»   » శ్రీదేవి అందుకే ఆస్తులు అమ్మింది... అతి పెద్ద ప్లాప్, సారీ చెప్పిన దర్శకుడు!

శ్రీదేవి అందుకే ఆస్తులు అమ్మింది... అతి పెద్ద ప్లాప్, సారీ చెప్పిన దర్శకుడు!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Sri Devi Was Remembered By One Of Her Director

  శ్రీదేవి-అనిల్ కపూర్ కాంంబినేషన్లో 1993లో వచ్చిన 'రూప్ కి రాణి చోరోంకా రాజా' చిత్రం అప్పట్లో బాలీవుడ్లోనే బిగ్గెస్ట్ ప్లాప్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రాన్ని నిర్మించిన బోనీ కపూర్ దారుణంగా దెబ్బతిన్నాడు. ఈ సినిమా తర్వాత కొన్నాళ్ల పాటు ఆయన ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయ్యారు. ఈ సినిమా విడుదలై 25 సంవత్సరాలైన సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు సతీష్ కౌషిక్ ట్విట్ చేశారు. ఈ సినిమా ద్వారానే సతీష్ కౌషిక్ దర్శకుడిగా పరిచయం అయ్యారు.

  నన్ను క్షమించండి

  నన్ను క్షమించండి

  ఈ సినిమా విడుదలై 25 సంవత్సరాలు అయిన సందర్భంగా దర్శకుడు సతీష్ లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవిని గుర్తు చేసుకున్నాడు. తన వల్ల నిర్మాత బోనీ కపూర్ తీవ్ర నష్టాల పాలు కావడంపై సారీ చెప్పారు. తన ఫెయిల్యూర్‌ను ఒప్పకుంటూ ట్వీట్ చేశారు.

  నా మనసుకు దగ్గరైన చిత్రం

  నా మనసుకు దగ్గరైన చిత్రం

  ‘రూప్ కి రాణి చోరోంకా రాజా' చిత్రం విడుదలైన 25 సంవత్సరాలు పూర్తయింది. బాక్సాఫీసు వద్ద భారీ పరాజయం చూపిన సినిమా. కానీ ఇది నా ఫస్ట్ చైల్డ్... నా మనసుకు ఎంతో దగ్గరైన చిత్రం. ఈ సినిమా పేరు విన్నపుడల్లా శ్రీదేవి మేడమ్ గుర్తుకు వస్తారు, బోనీ కపూర్ నాకు బ్రేక్ ఇద్దామని అవకాశం ఇచ్చారు, కానీ నేను పూర్తిగా విఫలం అయ్యాను.' అంటూ ట్వీట్ చేశారు.

  అప్పట్లో భారీ బడ్జెట్ మూవీ...

  అప్పట్లో భారీ బడ్జెట్ మూవీ...

  25 ఏళ్ల క్రితమే ఈ చిత్రం 9 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఆ సమయంలో అత్యంత భారీ బడ్జెట్ బాలీవుడ్ సినిమా అది. అప్పట్లో రూ. 2 నుండి 3 కోట్లతో సినిమా తీయడమే ఎక్కువ..... అలాంటి రోజుల్లో బోనీ కపూర్ 9 కోట్లు ఖర్చు పెట్టి కొత్త దర్శకుడితో పెద్ద సాహసమే చేశాడు.

  దీని కోసమే శ్రీదేవి తన ఆస్తులు అమ్మింది

  దీని కోసమే శ్రీదేవి తన ఆస్తులు అమ్మింది

  ఈ సినిమా వల్ల బోనీ కపూర్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారని,. బోనీతో పెళ్లి తర్వాత అతడిని ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడేయటానికి శ్రీదేవి తన ఆస్తులు అమ్మారని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఈ చిత్రంలో అనిల్ కపూర్, శ్రీదేవి, జాకీ ష్రాఫ్, అనుపమ్ ఖేర్ తదితరులు నటించారు.

  English summary
  "25 years ago it was a disaster at the box office, but it was my first child and will remain close to heart. Remembering madam Sridevi and my sorry to Boney Kapoor who gave me a break but was broke after the film." Roop Ki Rani Choron Ka Raja director Satish Kaushik tweeted.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more