విలన్ భార్యపై ప్రేమను కురిపించిన ప్రభాస్.. డార్లింగ్‌పై ప్రశంసల వర్షం!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో షూటింగ్‌లో తలమునలై ఉన్నారు. ఈ చిత్రంలో విలన్‌గా నీల్ నితిన్ ముఖేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది నీల్ నితిన్ ముఖేష్ వివాహం చేసుకొన్నారు. ఆయన భార్య రుక్మిణి త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఈ నేపథ్యంలో నీల్ నితిన్ ముఖేష్ దంపతులకు ప్రభాస్ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. రుక్మిణిని పలకరించడమే కాకుండా జాగ్రత్తలు చెప్పిన ప్రభాస్‌పై నీల్ ప్రశంసల వర్షం కురిపించారు.

దేశ సినీ అభిమానులు డార్లింగ్ అని పిలిచుకొనే ప్రభాస్ తనేంటో మరోసారి రుజువు చేసుకొన్నారు. నా భార్య రుక్మిణి ముఖేష్‌ను కలిసి ప్రేమతో, ఆప్యాయంగా పలుకరించారు. త్వరలో కొత్త జీవితాన్ని ప్రారంభించనున్న మాకు మంచి ధైర్యాన్ని, ప్రేమను పంచారు. ప్రభాస్ పంచిన ఆప్యాయతను చూసి మేము ఆయన ప్రేమలో పడ్డాం అని నీల్ నితిన్ ముఖేష్ ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని నీల్ నితిన్ ముఖేష్ తన ఇన్స్‌టాగ్రామ్ ద్వారా పంచుకొన్నారు.


Click it and Unblock the Notifications











