Don't Miss!
- Finance
Infosys: ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ ఝలక్..! ఉద్యోగాల తొలగింపు.. ఆ టెక్నిక్ వాడుతూ..
- News
'దుప్పటి మడతపెట్టి' వచ్చిన టీడీపీ సీనియర్లు!
- Travel
వైజాగ్ సమీపంలోని సందర్శనీయ పర్యాటక ప్రదేశాలు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Sports
INDvsAUS : స్పిన్నర్ల ఎంపికపై ఆసీస్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
బెంగళూరులో రేవ్ పార్టీ భగ్నం.. శ్రద్దాకపూర్ సోదరుడు అరెస్ట్.. పోలీసు దాడి సమయంలో సాహో హీరోయిన్ ఎక్కడంటే?
బాలీవుడ్ నటి శ్రద్దాకపూర్ కుటుంబాన్ని మరోసారి డ్రగ్స్ కేసు వివాదం చుట్టుముట్టింది. గతంలో బాలీవుడ్‌కు సంబంధించిన డ్రగ్స్ కేసులో ఆరోపణలు శ్రద్దాకపూర్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా శ్రద్దా కపూర్ సోదరుడు, యువ హీరో సిద్దాంత్ కపూర్ స్వయంగా పోలీసుల దాడుల్లో బెంగళూరు రేవ్ పార్టీలో దొరకడం దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలో సంచలనం రేపింది. పోలీసుల అదుపులో ఉన్న సిద్దార్థ్ కపూర్ కేసు వివరాల్లోకి వెళితే..

డ్రగ్స్ కేసులో శ్రద్దాకు సమన్లు
2020లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరాణం తర్వాత నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చేపట్టిన దాడుల్లో శ్రద్దాకపూర్, రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకోన్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఆ వ్యవహారంలో శ్రద్దా కపూర్‌కు ఎన్సీబీ అధికారులు సమన్లు జారీ చేశారు. ఈ సమయంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం, అలాగే బాలీవుడ్‌తో డ్రగ్స్ మాఫియా సంబంధాలపై ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. ఆ ఘటన మరువక ముందే సిద్దాంత్ కపూర్ డ్రగ్స్ కేసులో దొరకడం సంచలనంగా మారింది.
|
బెంగళూరు రేవ్ పార్టీలో జరిగినదేమిటంటే
బెంగళూరులోని ఎంజీ రోడ్డులో ఉన్న ఓ హోటల్‌లో జరిగిన రేవ్ పార్టీపై దాడి ఘటనపై ప్రముఖ వార్తా ఏజెన్సీ సోషల్ మీడియాలో సమాచారం అందించింది. నగరంలో ఓ హోటల్‌లో జరిగిన రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. ఆ దాడిలో నటి శ్రద్దా కపూర్ సోదరుడు సిద్దాంత్ కపూర్‌ను అదుపులోకి తీసుకొన్నారు. ఆయనతోపాటు మరో ఆరుగురు డ్రగ్స్ తీసుకొంటూ పట్టుబడ్డారు అని తెలిపారు.

స్పెయిన్‌లో శ్రద్దా కపూర్
బెంగళూరులోని రేవ్ పార్టీలో సిద్దాంత్ కపూర్ పట్టుబడిన సమయంలో శ్రద్దా కపూర్ స్పెయిన్‌లో ఉన్నారు. లవ్ రంజన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్ర షూటింగ్‌లో శ్రద్దా కపూర్ పాల్గొంటున్నారు. ఈ ఘటనపై ఆమె స్పందించడానికి అందుబాటులోకి రాలేదు. కానీ ఆమె తండ్రి మీడియాతో మాట్లాడారు.

మీడియా ద్వారానే తెలుసుకొన్నా
జాతీయ మీడియాతో సిద్దాంత్ కపూర్ తండ్రి, ప్రముఖ నటుడు శక్తి కపూర్ మాట్లాడుతూ.. నాకు సిద్దాంత్ డ్రగ్స్ వ్యవహారం గురించి నాకు ఏమీ తెలియదు. ఉదయం ఫోన్ నిరంతరంగా రింగ్ అవుతుంటే.. నిద్ర లేచాను. డ్రగ్స్ కేసులో అతడిని అరెస్ట్ చేయలేదు. అదుపులోకి తీసుకొన్నారని చెప్పారు. సిద్దాంత్ వద్ద డ్రగ్స్ లభించాయనే వార్త నాకు చేరలేదు. నేను న్యూస్, మీడియా నుంచి అందిన సమాచారం ద్వారానే ఈ విషయాన్ని తెలుసుకొన్నాను అని శక్తికపూర్ చెప్పారు.

సిద్దాంత్ కపూర్ కెరీర్ ఇలా..
సిద్దాంత్ కపూర్ కెరీర్ విషయానికి వస్తే.. సంజయ్ గుప్తా దర్శకత్వంలో రూపొందిన షూట్అవుట్ ఎట్ వడాలా చిత్రం ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో అగ్లీ అనే చిత్రంలో నటించాడు. దావూద్ ఇబ్రహీం సోదరి జీవితం ఆధారంగా రూపొందిన హసీనా పార్కర్ అనే చిత్రాన్ని తన సోదరితో కలిసి నిర్మించాడు. ఇటీవల రిలీజైన చెహ్రే చిత్రంలో నటించారు.