మంచి చేస్తే మంచే జరుగుతుందని నిరూపించాడట.. విలన్‌కు కాస్ట్‌లీ కార్ గిఫ్ట్ ఇచ్చిన సల్మాన్
సినిమాలు హిట్ అయితే అందులో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఖరీదైన బహుమతులను ఇవ్వడం ఆనవాయితీగా వస్తోన్న సంగతి తెలిసిందే. అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలో ఈ సంప్రదాయం కొనసాగుతూ ఉంటుంది. తాజాగా సల్మాన్ కూడా తన చిత్రం హిట్ అయిన సందర్భంగా కిచ్చా సుదీప్‌కు ఖరీదైన బహుమతి ఇచ్చాడు.
సల్మాన్ హీరోగా వచ్చిన దబాంగ్ 3 ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దాదాపు 200కోట్లను కొల్లగొట్టిన ఈ చిత్రాన్ని ప్రభుదేవా తెరకెక్కించగా.. సల్మాన్ ఖాన్, ఆర్బాజ్ ఖాన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదలై నేటికి సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూనే ఉంది. ఈ క్రమంలో ఈ సినిమాలో విలన్‌గా నటించిన కిచ్చా సుదీప్‌కు బీఎండబ్ల్యూ కారును బహుమతిగా ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
View this post on InstagramA post shared by kicchasudeep (@kichchasudeepa) on

ఈ మేరకు సుదీప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. 'మనం మంచి చేస్తే..తిరిగి మనకూ మంచే జరుగుతుందని సల్మాన్ ఖాన్ నిరూపించాడు. తనతో పాటు బీఎండబ్ల్యూ ఎమ్5 కారును మా ఇంటికి తీసుకొచ్చాడు. నాపై, నా కుటుంబంపై ప్రేమను కురిపిస్తున్నందుకు ధన్యవాదాలు. మీతో పని చేసినందుకు, మీరు మా ఇంటికి రావడం ఎంతో గౌరవంగా ఉంద'ని అన్నాడు.


Click it and Unblock the Notifications











