»   » సల్మాన్ సెన్సేషనల్ ట్వీట్.. కంగ్రాట్స్ చెప్పిన కండోమ్ కంపెనీ.. ఏం జరిగిందంటే..

సల్మాన్ సెన్సేషనల్ ట్వీట్.. కంగ్రాట్స్ చెప్పిన కండోమ్ కంపెనీ.. ఏం జరిగిందంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

దేశంలో మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌లో సల్మాన్ ఖాన్ ఒకరు. బాలీవుడ్ కండలవీరుడి పెళ్లి మీడియాలో ఎప్పడూ చర్చనీయాంశమే. అభిమానులు, సన్నిహితులు, సహచర నటులు ఎప్పుడేప్పుడా సల్మాన్ పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా సల్మాన్ చేసిన ట్వీట్ మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షించాయి. ఇంతకీ అంత సంచలనం రేపిన ట్వీట్ ఏమిటంటే..

నాకు పిల్ల దొరికింది

సల్మాన్ ట్విట్టర్ అకౌంట్‌లో హఠాత్తుగా నాకు పిల్ల దొరికింది (ముఝే లడ్కీ మిల్ గయీ) అనే ట్వీట్ కనిపించింది. ఇంకేముందీ అందరూ పెళ్లి కుదిరిందని అనుకొన్నారు. ఎందుకంటే గతంలో పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే కొంత కోపానికి గురైన సంగతి తెలిసిందే.

 పెళ్లి విషయంపై సల్మాన్ ఖాన్

పెళ్లి విషయంపై సల్మాన్ ఖాన్

మీడియాపై సల్లూభాయ్ మండిపడుతూ.. మీకు ఎందుకు చెప్పాలి? నాకే తెలియదు నేను ఎప్పుడు పెళ్లి చేసుకొంటానో. అయినా నా వ్యక్తిగత విషయాలను ఎందుకు చెప్పాలి అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Salman Khan cycling on Mumbai streets : Watch Video
 సోషల్ మీడియాలో వెల్లడిస్తా

సోషల్ మీడియాలో వెల్లడిస్తా

ఒకవేళ పెళ్లి కూతురు దొరికితే ఫేస్‌బుక్ లేదా ట్విట్టర్‌లోనో పెడుతాన అని చెప్పాడు. అంతే తాజాగా అమ్మాయి దొరికిందని ట్వీట్ రాగానే అభినందనలు సునామీలా వెల్లువెత్తాయి. అభిమానులు ఆనందంతో భాయ్‌కి ముందే కంగ్రాట్స్ చెప్పారు.

కంగ్రాట్స్ చెప్పిన కండోమ్ కంపెనీ

ఇదిలా ఉంటే ఓ కండోమ్ కంపెనీ కూడా సందంట్లో సడేమియా అంటూ ఈ వ్యవహారంలోకి దూరింది. సల్మాన్ ఖాన్ కంగ్రాట్స్ అని డ్యురెక్స్ ఇండియా ట్వీట్ చేసింది.

 బావ కోసం పిల్ల దొరికింది..

బావ కోసం పిల్ల దొరికింది..

ఇంతకు సల్మాన్‌కు నిజంగా పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరికిందా అని ఆరా తీస్తే అసలు విషయం తెలియడంతో అంతా అవక్కాయ్యారు. తన బావ ఆయుష్ శర్మ హీరోగా రంగ ప్రవేశం చేస్తున్న సినిమా కోసం హీరోయిన్ దొరికింది అని చెప్పడానికి సల్మాన్ అలా ట్వీట్ చేశాడట. దాంతో మీడియానే కాదు.. కండోమ్ కంపెనీ కూడా ఫూల్ అయింది.

 రంజాన్‌‌కు సల్మాన్ ఖాన్ సినిమా

రంజాన్‌‌కు సల్మాన్ ఖాన్ సినిమా

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో భారత్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం 2019 రంజాన్‌కు విడుదల కానున్నది. ఈ చిత్రంలో కత్రినా కైఫ్ నటిస్తున్నదనే వార్తలు వెలువడుతున్నాయి. ఇటీవల రేస్3 సినిమా ఓ షెడ్యూల్‌ను కూడా సల్మాన్ ముగించాడు. ఈ చిత్రం 2018 రంజాన్‌కు విడుదలయ్యే అవకాశం ఉంది.

English summary
Salman Khan's marriage has been a hot topic of discussion for a while now. Salman is arguably one of the country's most eligible bachelors. Recently, Salman posted a cryptic tweet on his official Twitter handle: "Mujhe ladki mil gayi". The tweet is already going viral, and congratulatory messages are pouring in from fans.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu