For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మంచి మనసు చాటుకున్న స్టార్ హీరో.. ఆ ఫ్యామిలీకి అండగా!

  |

  కరోనా సెకండ్ వేవ్ జడలు విప్పింది. ఎవరూ ఊహించని రీతిలో మహమ్మారి పట్టి పీడిస్తున్న పరిస్థితుల్లో సినీ నటులు అందరూ తమకు తోచిన సాయం చేసి ఉదారత చాటుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్‌ అగ్ర హీరో సల్మాన్‌ ఖాన్‌ చేసిన ఒక పని మాత్రం ఆయన మీద ప్రశంసల వర్షం కురిపిస్తోంది. నిజానికి గత ఏడాది కూడా సల్మాన్ సినీ పరిశ్రమలో కార్మికుల మొదలు సామాన్య ప్రజలకు సైతం చాలా సేవ చేశారు. తాజాగా కరోనా కారణంగా తండ్రిని కోల్పోయిన ఒక కుర్రాడికి తాను అండగా నిలిచి, జీవితంలో సెటిల్ అయ్యేదాకా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే...

  అందరూ ఇళ్లలోనే

  అందరూ ఇళ్లలోనే

  కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర అంతా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.. అంతకంటే ముందే సినిమా షూటింగులు కూడా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో దాదాపు అందరు సినిమా స్టార్లు ఇళ్లకే పరిమితం అయిపోయారు. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ మాత్రం ఇంట్లో ఉండి కూడా ఖాళీగా ఉండకుండా ఎవరు అవసరంలో ఉన్నారో తెలుసుకుని వాళ్ళకి సహాయం చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికి కూడా ఆయన తనకు చేతనైన సాయం చేస్తూ ముందుకు వెళ్తున్నారు.

  గత ఏడాది నుంచి

  గత ఏడాది నుంచి

  ఇక గత ఏడాది కూడా సల్మాన్ ఖాన్ ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ సినీ వర్కర్స్ యూనియన్ కి సంబంధించిన దాదాపు ప్రతి కార్మికుడికి దాదాపుగా పాతిక వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ ఏడాది కూడా ఆయన అండగా నిలబడతామని హామీ ఇచ్చారని యూనియన్ సభ్యులు చెబుతున్నారు. ఇక మరో పక్క సల్మాన్ ఖాన్ తన సొంత భాయ్‌జాన్‌ కిచెన్‌ రెస్టారెంట్‌ ద్వారా పోలీసులకు, ఆరోగ్య కార్యకర్తలకు, కంటైన్‌మెంట్‌ జోన్‌లలో ఉన్నవాళ్లకు ఆహారాన్ని అందిస్తున్నారు. సల్మాన్‌ ఖాన్‌, శివ సేన యువ నాయకుడు రాహుల్‌ కలిసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.

  రోజుకు 5000 మందికి ఆహారం

  రోజుకు 5000 మందికి ఆహారం

  రోజుకు 5000 మందికి ఆహారాన్ని అందించడమే ధ్యేయంగా ఈ కార్యక్రమం సాగుతోంది. బాంద్రాలోని భాయ్‌ జాన్‌ కిచెన్‌ను ఏర్పాటు చేసి 'బీయింగ్ హంగ్రీ' పేరుతో వ్యాన్ల ద్వారా ముంబయి అంతటా అవసరమైన వాళ్లకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం భాయ్‌జాన్‌ కిచెన్‌ రెస్టారెంట్‌ను సందర్శించి ఆహార నాణ్యతను సైతం సల్మాన్‌ ఖాన్‌ పరిశీలించారు. సల్మాన్ ఆధ్వర్యంలో అందిస్తున్న ఈ పార్శిల్ లో భోజనం , బిస్కెట్లు, వాటర్‌ బాటిల్‌తో పాటు చికెన్‌ నగ్గెట్స్‌, చికెన్‌ బిర్యానీ, వెజ్‌ బిర్యానీ, విటమిన్‌ సి అధికంగా ఉండే జ్యూస్‌లు అందింస్తున్నారు.

  తండ్రిని కోల్పోయిన కొడుక్కి అండగా

  తండ్రిని కోల్పోయిన కొడుక్కి అండగా

  ఇక కర్ణాటకకు చెందిన ఒక విద్యార్థి తాజాగా కరోనా కారణంగా తన తండ్రిని కోల్పోయాడు. ఈ నేపథ్యంలో తన చదువుకు తన ఇంట్లో అవసరాలకు సహాయపడమని కోరుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. ఈ విషయం సల్మాన్ టీమ్ దృష్టికి వెళ్లడంతో అప్పటికప్పుడు సదరు విద్యార్థిని కలుసుకొని ఆయనకి ఆర్థిక సాయం అందించడమే కాక ఇంట్లో గృహ అవసరాల నిమిత్తమై సరుకులు కూడా అందజేసినట్లు సమాచారం. ఆయన సెటిల్ అయ్యేదాకా సల్మాన్ అండగా ఉంటానని హామీ ఇచ్చినట్టు సమాచారం. ఈ మేరకు శివసేన యువ నాయకులు రాహుల్ ఈ వివరాలు వెల్లడించారు.

  Salman Khan Winning Hearts | కర్ణాటక లో ఓ విద్యార్థి తండ్రి చనిపోతే..!! || Filmibeat Telugu
  భాయ్ వచ్చేస్తున్నాడు

  భాయ్ వచ్చేస్తున్నాడు

  ఇక సినిమాల విషయానికి వస్తే సల్మాన్‌ హీరోగా తెరకెక్కిన రాధే సినిమా మే 13న రంజాన్ పండుగ సందర్భంగా ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటించిన డీజే సినిమాలోని సీటీమార్ సాంగ్ ను రీమిక్స్ చేశారు. ఈ సాంగ్ కూడా రిలీజ్ చేయడంతో ఆ సాంగ్ యూట్యూబ్ లో రచ్చ చేస్తుంది. కరోనా కేసులు నమోదు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాను థియేటర్లతో పాటు ఓటీటీలోనూ ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు.

  English summary
  Actor Salman Khan helped an 18-year-old student from Karnataka recently. Salman helped the boy after he reached out for financial help on social media post his father's death due from Covid-19. Salaman;s team have provided ration and educational equipment to him
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X