Don't Miss!
- News
సరిహద్దులో 26 గస్తీ పాయింట్లు కోల్పోయిన భారత్
- Sports
KL Rahul పెళ్లి.. ఖరీదైన బహుమతులు ఇచ్చిన ధోనీ, కోహ్లీ!
- Lifestyle
మీకు మధుమేహం ఉందో లేదో మీ పాదాలను చూసి తెలుసుకోవచ్చు..
- Finance
అదరగొట్టిన జున్‌జున్‌వాలా కంపెనీ.. షేర్లు కొనేందుకు ఎగబడతున్న ఇన్వెస్టర్లు
- Technology
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- Automobiles
'బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్' లాంచ్ చేసిన మహీంద్రా.. ధర ఎంతో తెలుసా?
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Kisi Ka Bhai Kisi Ki Jaan Trailer: ఈసారి మరింత యాక్షన్ డోస్ పెంచిన భాయ్.. అలాంటి పాత్రలో వెంకటేష్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన తదుపరి సినిమా 'కిసి కా భాయ్ కిసి కి జాన్' తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఫర్హాద్ సంజీ తెరపైకి తీసుకురాబోతున్న ఈ సినిమా పై అంచనాలు అయితే మామూలుగా లేవు. ఇదివరకే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ పై కొంత నెగిటివ్ ట్రోల్స్ వచ్చినప్పటికీ సినిమా మాత్రం తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని చిత్ర యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు.
దానికి తోడు ఈ సినిమాలో టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతూ ఉండడం విశేషం. ఈ సినిమాలో వెంకటేష్ దగ్గుబాటి అలాగే జగపతిబాబు కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఇక హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. భూమిక చావ్లా కూడా ఒక స్పెషల్ పాత్రలో కనిపించనుంది. ఇక మొత్తానికి ఈ సినిమా టీజర్ ను ఈరోజు పఠాన్ సినిమాతో పాటు ధియేటర్లలో విడుదల చేశారు.
ఇక ఆ తర్వాత యూట్యూబ్లో విడుదల చేయడం జరిగింది. ఇక విడుదలైన కొన్ని నిమిషాలకు ఈ సినిమా టీజర్ భారీ స్థాయిలో వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. కదులుతున్న మెట్రో రైలులో ఫైట్ తో టీజర్ ను మొదలెట్టిన సల్మాన్, పొడవాటి జుట్టు పవర్ఫుల్ బాడీతో ఇంట్రడక్షన్ ఇచ్చాడు. "నాకు సమయం లేదు, కానీ నేను భాయ్ జాన్ అని పిలవాలనుకుంటున్నాను" అని సల్మాన్ ఖాన్ ఒక డైలాగ్ తో మరీంత హైలెట్ అయ్యాడు.

టీజర్ లో కొంచెం సౌత్ ఇండియన్ టచ్ ఉంది. ఎందుకంటే వెంకటేష్ సాధారణ సౌత్ ఇండియన్ డ్రెస్ లుంగీలో కనిపిస్తున్నాడు. వెంకీకి జోడీగా పూజా, భూమిక చావ్లా ఉన్నారు.

ఇక తెల్లటి లుంగీలో సల్మాన్ మాస్ బీట్‌కి డ్యాన్స్ చేయడం కూడా హైలెట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను సమ్మర్ లో ఏప్రిల్ 21న విడుదల చేయనున్నారు.