»   » దటీజ్ సల్మాన్ ఖాన్.. పుట్టిన బిడ్డను ఎత్తుకొని.. సంచలన నిర్ణయం!

దటీజ్ సల్మాన్ ఖాన్.. పుట్టిన బిడ్డను ఎత్తుకొని.. సంచలన నిర్ణయం!

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Salman Khan Makes His Promise

  మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండే వాళ్లు ఈ రోజుల్లో చాలా తక్కువగా ఉంటారు. ఎప్పుడో సరదాకు మాట ఇచ్చిన సల్మాన్ ఖాన్ ఆ మాటను నిజం చేస్తున్నారు. సల్మాన్ తీసుకొన్న నిర్ణయంపై ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తనకు 30 ఏళ్లుగా బాడీగార్డ్‌గా పనిచేస్తున్న గుర్మిత్ సింగ్ అలియాస్ షేరా కుమారుడిని హీరోగా పరిచయం చేయబోవడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.

  బాడీగార్డ్‌ షేరాకు ప్రామిస్

  బాడీగార్డ్‌ షేరాకు ప్రామిస్

  ఆంగ్ల దినపత్రికతో సల్మాన్ ఖాన్ సన్నిహితుడు మాట్లాడుతూ.. తన బాడీగార్డ్ షేరా కుమారుడు టైగర్ పుట్టినప్పడు సల్మాన్ ఓ ప్రామిస్ చేశాడు. పుట్టగానే పసిపాపను ఎత్తుకొని వీడియిన హీరో చేస్తానని అన్నాడు. వీడు హీరో అవుతాడు. వీడినే నేనే హీరో చేస్తాను అని ఆనందంతో ఓ మాట చెప్పాడు అని వెల్లడించాడు.

  ఇచ్చిన మాటకు సల్మాన్ కట్టుబడి

  ఇచ్చిన మాటకు సల్మాన్ కట్టుబడి

  పుట్టిన బిడ్డను చూసి సంతోషంలో అలా అని ఉంటాడని షేరా ఆ విషయాన్ని లైట్ తీసుకొన్నాడు. ఇప్పుడు టైగర్‌కు యుక్త వయసు వచ్చింది. దాంతో ఇప్పుడు షేరా కొడుకును తన సొంత బ్యానర్‌పై లాంచ్ చేయడానికి నిర్ణయం తీసుకొన్నాడు.

  లవ్‌రాత్రి చిత్రం విడుదల తర్వాత

  లవ్‌రాత్రి చిత్రం విడుదల తర్వాత

  ప్రస్తుతం సల్మాన్ బావ నటించిన లవ్‌రాత్రి చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ చిత్రం విడుదలైన తర్వాత టైగర్‌ను హీరోగా పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఓ యాక్షన్ చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయం చేయాలని అనుకొంటున్నాడు అని సల్మాన్ సన్నిహితుడు మీడియాకు చెప్పాడు.

  సల్మాన్ ఖాన్ సినిమా కోసం

  సల్మాన్ ఖాన్ సినిమా కోసం

  సల్మాన్ నటించిన టైగర్ జిందా హై చిత్ర దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్‌కు టైగర్ అసిస్టెంట్‌గా వ్యవహరించాడు. సల్మాన్ ప్రారంభించబోయే సినిమా కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందుతున్నాడు. త్వరలోనే సల్మాన్ ఆ సినిమా వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది అని సన్నిహితుడు పేర్కొన్నాడు.

  English summary
  Salman Khan is the Bhai and the messiah of Bollywood, as many of his ardent fans like to believe. Years ago, when Salman's bodyguard of 30 years, Gurmeet Singh AKA Shera's son, Tiger was born, Salman had declared that he would become an actor. His friend said Salman had picked up the newborn boy and said, 'Yeh hero banega. Main banaunga'.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more