పాక్‌లో దుమ్మురేపుతున్న రేస్3.. కరాచీలో కిక్కిరిసిన థియేటర్లు!
సల్మాన్ ఖాన్ నటించిన రేస్3 చిత్రం పాకిస్థాన్‌లో ఇటీవల విడుదలైంది. ఇండియాలో సినీ విమర్శకులు, ఓ వర్గం ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేకపోయినప్పటికీ మంచి కలెక్షన్లను రాబట్టింది. పాకిస్థాన్‌లో రేస్3 చిత్రానికి అద్భుతమైన స్పందన లభిస్తున్నదని సినీ విమర్శకుడు ఉమేర్ సంధూ ట్వీట్ చేశారు.
రేస్3 చిత్రం శనివారం (జూన్23న) రిలీజైంది. సోషల్ మీడియాలో నెగిటివ్ టాక్ ఉన్నప్పటికీ ఈ చిత్రం బంపర్ ఓపెనింగ్స్ సాధిస్తున్నది. పాకిస్థాన్‌లో ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. కిక్కిరిసిన ప్రేక్షకులతో మార్నింగ్, మ్యాట్నీ షోలు ప్యాక్ అయిపోయాయి. లాహోర్, కరాచీలో ఈ సినిమాకు బ్రహ్మండమైన స్పందన వ్యక్తమవుతున్నది.

salman khan race3 jacqueline fernandez bobby deol abbas mustan remo dsouza umair sandhu సల్మాన్ ఖాన్ రేస్3 జాక్వలైన్ ఫెర్నాండేజ్ బాబీ డియోల్ అబ్బాస్ మస్తాన్ రెమో డిసౌజా ఉమేర్ సంధూ


Click it and Unblock the Notifications