Don't Miss!
- News
మీరైతే కచ్చితంగా గెలుస్తారని చెబుతున్న చంద్రబాబు.. సీటు రిజర్వు
- Finance
Home Loan: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త టాక్స్ సిష్టం బెటరా..? పాతదే మేలా..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Sports
INDvsAUS : ఈ మూడు విషయాలే సిరీస్ విజేతను నిర్ణయిస్తాయి..!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Sameer Wankhede విసిరిన వలకు ఆర్యన్ ఖాన్ ఇలా చిక్కాడట.. అండర్ కవర్ ఆపరేషన్ కోసం ఎంత ఖర్చు చేశారంటే?
బాలీవుడ్‌తో దేశీయ, విదేశీ డ్రగ్స్ రాకెట్ లింకులపై ఉక్కుపాదం మోపుతున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) పక్కా ప్రణాళికతో దాడులు చేస్తున్నదనే విషయం అందరిలో ఆసక్తిని రేపుతున్నది. సినిమా స్క్రిప్టును తలపించేలా వ్యూహాలను రచిస్తూ ముంబై జోనల్ ఆఫీసర్ సమీర్ వాంఖడే దూకుడు ప్రదర్శిస్తున్నారనే విషయం ఎప్పటికప్పుడు ముంబై, జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఆర్యన్ ఖాన్ తన స్నేహితులతో కలిసి క్రూయిజ్‌లో పార్టీ చేసుకొంటున్నారని అందిన సమాచారంతో సమీర్ వాంఖడే టీమ్ ఎలా అండర్ కవర్ ఆపరేషన్ నిర్వహించిందంటే...

కార్డేలియా క్రూయిజ్‌లో రేవ్ పార్టీ
ముంబై
నుంచి
గోవాకు
వెళ్లే
కార్డేలియా
క్రూయిజ్
ఎంప్రెస్
షిప్‌లో
రేవ్
పార్టీ
జరుగుతున్నది.
ఆ
క్రూయిజ్‌లో
దాదాపు
1500
మంది
వరకు
ప్రయాణికులు
ఉన్నారు.
అందులో
షారుఖ్
ఖాన్
కుమారుడు
ఆర్యన్
ఖాన్,
అతడి
స్నేహితుడు
అర్బాజ్
ఖాన్
మర్చంట్,
ఇతరులు
పార్టీలో
పాల్గొంటున్నారని
ఎన్సీబీ
అధికారులకు
పక్కా
సమాచారం
అందింది.
దాంతో
మెరుపు
దాడులకు
సిద్దమయ్యారు.

22 మంది అధికారులతో అండర్ కవర్ ఆపరేషన్
అయితే క్రూయిజ్‌లో దాడులను నిర్వహించడానికి అండర్ కవర్ ఆపరేషన్ నిర్వహించడానికి సిద్ధమయ్యారు. మొత్తం 22 మంది అధికారులను సమీర్ వాంఖడే పురమాయించారు. క్రూయిజ్‌లోకి వెళ్లడానికి ఒక్కొక్కరికి రూ.100000 టికెట్ కొనుగోలు చేశారు. మొత్తం రూ.2000000 వెచ్చించి టీమ్‌లో 20 మందికి టికెట్లు కొనుగోలు చేశారు. దాంతో అండర్ కవర్ ఆపరేషన్‌కు స్కెచ్ వేశారు.

స్పెషల్ సూట్‌లో ఆర్యన్ ఖాన్
ముంబై
నుంచి
గోవాకు
బయలుదేరే
కార్డేలియా
క్రూయిజ్
ఎంప్రెస్
షిప్‌లోకి
వెళ్లిన
ఎన్సీబీ
అధికారులు
పక్కాగా
దాడులు
చేశారు.
ఓడలో
ప్రత్యేకమైన
సూట్‌లో
ఉన్న
ఆర్యన్
ఖాన్,
అతడి
స్నేహితుడిని
పక్కాగా
ఆధారాలతో
పట్టుకొన్నారు.
దాంతో
బాలీవుడ్
సూపర్
స్టార్
షారుక్
ఖాన్
లాంటి
కుమారుడు
అరెస్ట్
కావడంతో
భారతీయ
సినిమా
పరిశ్రమలో
సంచలనంగా
మారింది.

ఆర్యన్ ఖాన్ కోసం 20 లక్షల రూపాయలా?
అయితే ఆర్యన్ ఖాన్‌ను అరెస్ట్ చేయడం వెనుక ప్రధాన కారణం షారుక్ ఖాన్‌ను వేధించడానికే అని బాలీవుడ్ క్రిటిక్, దర్శకుడు కమల్ ఆర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు పన్ను కట్టే ఆదాయం నుంచి 20 లక్షలు ఖర్చు చేసి ఆర్యన్ ఖాన్‌ను పట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ కమల్ ఖాన్ అధికారులను ప్రశ్నిస్తున్నారు. అయితే షారుక్ ఖాన్ విషయంలో కొంత ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నారు అంటూ ఆయన అన్నారు.
Recommended Video

భారతీ సింగ్ బెయిల్.. ఆర్యన్‌కు నో బెయిల్?
బాలీవుడ్‌లో ఒక్కో ప్రముఖులకు ఒక్కో రకంగా న్యాయం ఉంటుందా అంటూ ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు చేయకపోవడంతో కమల్ ఆర్ ఖాన్ ఘాటుగా స్పందించారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన కమెడియన్ భారతీ సింగ్‌కు బెయిల్ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆమె వద్ద 86.5 గ్రాములు నిషేధిత మాదక ద్రవ్యాలు లభించాయి. అయితే బెయిల్ ఇచ్చారు. కానీ డ్రగ్స్ లభించిన ఆర్యన్‌కు ఎందుకు బెయిల్ ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు.