»   » కోరిక తీర్చమన్నారు.. నరకం చూశా.. తట్టుకోలేక భోరున ఏడ్చా.. క్యాస్టింగ్ కౌచ్‌పై అదితిరావు

కోరిక తీర్చమన్నారు.. నరకం చూశా.. తట్టుకోలేక భోరున ఏడ్చా.. క్యాస్టింగ్ కౌచ్‌పై అదితిరావు

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Aditi Rao Hydari Talks About Film Industry Culture

  ప్రపంచ సినిమా పరిశ్రమలో దుమారం రేపుతున్న క్యాస్టింగ్ కౌచ్ (ఆఫర్ల కోసం పడక గదిలోకి)పై విలక్షణ నటి అదితిరావు హైదరీ స్పందించారు. ఔత్సాహిక తారలను పట్టి పీడిస్తున్న ఈ సమస్య ఇప్పటిది కాదు అని ఆమె వెల్లడించింది. ప్రస్తుతం భారీ ఎత్తున్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో క్యాస్టింగ్ కౌచ్‌పై ఆమెకు ఎదురైన విషయాలను వెల్లడించింది.

   ఆరంభంలో క్యాస్టింగ్ కౌచ్

  ఆరంభంలో క్యాస్టింగ్ కౌచ్

  నా కెరీర్ ఆరంభంలో బాలీవుడ్‌లో ఇలాంటి సమస్య ఎదురైంది. కొందరి కోర్కెలు తీర్చలేక ఆఫర్లు వదులుకొన్నాను. నాకు ఎదురైన అనుభవాలను తట్టుకోలేక భోరున ఏడ్చిన రోజులు ఉన్నాయి. అలాంటి వాటికి లొంగక ఆఫర్లు వదులకోవడం వల్ల నాకు ఎలాంటి పశ్చత్తాపం లేదు అని అదితిరావు అన్నారు.

  ఎదిరించా.. ఆఫర్లు రాలేదు

  ఎదిరించా.. ఆఫర్లు రాలేదు

  ఆడిషన్స్ కోసం వెళ్లినప్పుడు భయపడే దానిని కాదు. ఆ క్రమంలో ఓ ఘటన ఎదురైంది. నా మనసు నచ్చినట్టు ధైర్యంగా ఎదురించి మాట్లాడాను. ఆ తర్వాత ఎనిమిది నెలలు ఒక్క అవకాశం రాలేదు. అందువల్ల నేను కుంగిపోలేదు. నా నిర్ణయానికి కట్టుబటి ఉండటం నాకు సంతోషం కలిగించింది అని అదితి రావు పేర్కొన్నారు.

   ఆ ఏడాది గడ్డు పరిస్థితి

  ఆ ఏడాది గడ్డు పరిస్థితి

  నా సినీ జీవితంలో 2013 సంవత్సరంలో చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాను. ఆ ఏడాదే నా తండ్రి చనిపోయారు. 2014 నుంచి నన్ను అదృష్టం వెంటాడింది. పరిస్థితులన్నీ చక్కదిద్దుకొన్నాయి. అలాంటి సమస్యను ఎవరైనా చూడాలి. ఎదుర్కోవాలి. దానిని నుంచి సులభంగా బయటపడాలి అని అదితి వెల్లడించారు.

  బాధలు పడ్డవారు బయటపెట్టాలి

  బాధలు పడ్డవారు బయటపెట్టాలి

  ఎవరికైనా చేదు సంఘటనలు ఎదురై.. వాటి వల్ల సంతోషం కరువైన ప్రతీ ఒక్కరు ఇలాంటి విషయాలను ధైర్యంగా బయటకు చెప్పాలి. అవకాశాలు కోల్పోతామనే భయంతో కొందరు అలా చెప్పకుండా భపడిపోతారు. సినీ పరిశ్రమ అనే ధన, కండబలంతో కూడుకొన్నది. వాటికి తలవంచకూడదు అని అదితి అభిప్రాయపడ్డారు.

  ప్రతిభ ఉంటే అవకాశాలు

  ప్రతిభ ఉంటే అవకాశాలు

  సినీ పరిశ్రమలో రాణించాలనే కలలుకనేవారు భయపడకూడదు. భయం ఎప్పుడు అవకాశాలను తీసుకురాదు. నీలో ప్రతిభ ఉంటే.. సరైన వ్యక్తులు నీ వద్దకు వచ్చి ఆఫర్లు ఇస్తారు. కొందరు శరీరాలను ప్రేమిస్తే.. మరికొందరు వారు నమ్ముకున్న వృత్తిని ఆరాధిస్తారు. అలాంటి వారి వల్ల మనకు అవకాశాలు వెతుక్కుంటు వస్తాయని నేను బలంగా నమ్ముతాను అని అదితి అన్నారు.

  సమ్మోహనంతో హిట్ కొట్టేసిన అదితి

  సమ్మోహనంతో హిట్ కొట్టేసిన అదితి

  అదితి రావు తొలిసారి తెలుగు తెరపై ఇటీవల సమ్మోహనం చిత్రంలో మెరిసింది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుధీర్‌బాబు పక్కన నటించారు. ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్రను పోషించి కనిపించడం విశేషం. టాలీవుడ్‌లో ఈ చిత్రం ఘనవిజయం సాధించింది.

  English summary
  Aditi Rao Hydari has come forward to speak about the casting couch issue in film industries. She opened up about the issue, but the debate was not as prevalent as it is now. Aditi was last seen in Sammohanam, which turned out to be a hit. The film was directed by Mohanakrishna Indraganti with Sudheer Babu in the lead role.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more