twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ కీచకులు కరోనా కంటే ప్రమాదం.. కలిసికట్టుగా భరతం పట్టాలి..

    |

    దేశీయ సినిమా రంగంలో మీటూ ఉద్యమాన్ని బలంగా తీసుకెళ్లిన వారిలో టెలివిజన్, సినీ నటి సంధ్యా మృదుల్ ఒకరు. నటుడు అలోక్ నాథ్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించారని చేసిన ఆరోపణలు సినీ పరిశ్రమలో ప్రకంపనాలు సృష్టించాయి. లైంగిక వేధింపులపై ఈ అందాల భామ సోషల్ మీడియాలో పోస్టు చేసిన లేఖ మీడియాను, సినీ ప్రేక్షకులను కుదిపేసింది. ప్రస్తుతం ఆ ఘటనపై స్పందిస్తూ..

     నా కెరీర్ తొలి రోజుల్లో

    నా కెరీర్ తొలి రోజుల్లో

    నా కెరీర్‌ తొలి రోజులు అవి. కొడైకెనాల్‌లో టెలి ఫిలిం షూటింగ్ జరుగుతున్నది. ఆ సమయంలోనే అలోక్‌నాథ్ నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. నా జీవితంలో అదో చేదు ఘటన. 2018లో అవకాశం వచ్చింది కాబట్టి ధైర్యంగా బయటపెట్టాను అని సంధ్యా మృధుల్ తెలిపారు.

    మీటూ ఉద్యమం వల్లే..

    మీటూ ఉద్యమం వల్లే..

    సంచలన రీతిలో సాగిన మీటూ ఉద్యమం వృధా కాలేదు. ఎన్నో విషయాలకు, సమస్యలకు పరిష్కారం దొరికింది. మహిళలకు ఓ ధైర్యాన్ని ఇచ్చింది. మహిళలను చిన్నచూపు చూస్తే ఏం జరుగుతుందో అనే విషయంపై చాలా మంది మగ సెలబ్రిటీలకు భయాన్ని కలిగించింది. వినోద రంగంలో మహిళలకు వ్యతిరేకంగా లైంగిక దాడులు తగ్గాయి. చాలా మంది ప్రవర్తనలో మార్పులు వచ్చాయి అని సంధ్యా మృదుల్ వెల్లడించారు.

    మీటూతో కనువిప్పు కలిగింది..

    మీటూతో కనువిప్పు కలిగింది..

    సినీ పరిశ్రమలో చాలా మంది మహిళలపై ఉద్దేశపూర్వకంగానో లేదా తెలియకుండానో లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. కానీ మీటూ ఉద్యమం వల్ల వారికి కనువిప్పు కలిగింది. వినోద పరిశ్రమలో మహిళలకు స్వేచ్ఛగా వ్యవహరించే సదుపాయం మీటూ ఉద్యమం కల్పించింది అని సంధ్యా పేర్కొన్నారు.

    కలిసికట్టుగా ఉంటే. హార్వే వెయిన్‌స్టెయిన్

    కలిసికట్టుగా ఉంటే. హార్వే వెయిన్‌స్టెయిన్

    లైంగిక వేధింపులు, రేప్ ఆరోపణలపై ప్రముఖ నిర్మాత హార్వే వెయిన్‌స్టెయిన్‌కు 23 ఏళ్ల జైలుశిక్ష విధించడాన్ని సంధ్యా మృధుల్ స్వాగతించారు. హాలీవుడ్‌ చేసిన సాహసం మనం చేయలేకపోతున్నారు. హ్యాట్సాఫ్ టు హాలీవుడ్. వారి ఐక్యత కారణంగానే హార్వే లాంటి ప్రముఖుడు కూడా జైలుకు వెళ్లాడు. మనమంతా ఐక్యంగా ఉంటే హార్వే లాంటి కీచకులను బుద్ధి చెప్పవచ్చు. లింగ బేధం లేకుండా ప్రతీ ఒక్కరు సహకరిస్తే ఇండస్ట్రీకి మంచి రోజులు వస్తాయి అని సంధ్యా అభిప్రాయపడ్డారు.

    అన్యాయాలపై మహిళలు ధైర్యంగా

    అన్యాయాలపై మహిళలు ధైర్యంగా

    తమకు జరిగిన అన్యాయాలపై మహిళలు ధైర్యంగా మాట్లాడాలి. వారికి పురుషులు సహకారం అందించాలి. సినీ ప్రముఖులు అండగా నిలువాలి. అప్పుడే హార్వే వెయిన్‌స్టెయిన్ లాంటి కీచకుల భరతం పట్టడానికి అవకాశం లభిస్తుంది. రానున్న రోజుల్లో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకొంటాయనే ఆశాభావం ఉంది అని సంధ్యా మృదుల్ పేర్కొన్నారు.

    Recommended Video

    Vishwaksen Hungama At Sandhya 70mm | Hit Movie Public Talk
    టెలివిజన్, సినీ రంగంలో

    టెలివిజన్, సినీ రంగంలో

    సంధ్యా మృదుల్ కెరీర్ విషయానికి వస్తే.. 1994లో టెలివిజన్ రంగంలోకి ప్రవేశించింది. బనేగి అప్నీ బాత్, స్వాభిమాన్, జస్సీ జైసీ కోయి నహీ, ఝలక్ దిక్లా జా లాంటి టెలివిజన్ షోలతోపాటు, పేజ్ 3, రాగిణి ఎంఎంఎస్2, క్విక్ గన్ మురుగన్, హానీమూన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ లాంటి చిత్రాల్లో నటించింది. బీబీడీ అనే షోకు హోస్ట్‌గా కనిపించబోతున్నది.

    English summary
    Actress Sandhya Mridul comments on Alok Nath and MeeToo Movement and Harvey Weinstein prison.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X