Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వివాదంలో సంజయ్ దత్.. ఖల్ నాయక్ అనిపించుకునేలా..
బాలీవుడ్ హీరో సంజయ్ దత్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. దీపావళీ పండుగ కవరేజ్ కోసం వెళ్లిన మీడియో ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లను దూషించడం చర్చనీయాంశంగా మారింది. దీవాళీ పండగ సందర్భంగా సంజయ్ దంపతులు తమ నివాసంలో భారీ రేంజ్‌లో విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫొటోగ్రాఫర్లను దూషిస్తూ ఉన్న వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. ఆ వీడియోలో సంజయ్ దత్ ఏమన్నారంటే..
ఆయన జీవితంలో డ్రగ్స్, గన్స్, అమ్మాయిలతో ఎఫైర్లు నిజమే.. అదే చూపించాం!

మీడియాపై నోరుపారేసుకొన్న
దీపావళీ పండుగ రోజైనా ఇంటికి పోవాలని లేదా బాస్టర్డ్స్ అంటూ తన నివాసం వద్ద గుమ్మిగూడిన ఫోటోగ్రాఫర్ల బృందాన్ని సంజయ్ దత్‌ను దూషించారు. దీపావళీ పండుగను జరుపుకోవాలా లేదా? మా యజమాని కవర్ చేయమని చెప్పాడని అనగా.. మీ బాస్ అమ్మ.. అంటూ రాయలేని విధంగా దూషించాడు. దానిని వీడియోలో బంధించి మీడియాలో లీక్ చేశారు.

సంజయ్ తీరుపై గరం
సంజయ్ దూషిస్తున్న వీడియోను ఓ నెటిజన్ షేర్ చేశాడు. దాంతో నెటిజన్లు షాక్ అయ్యారు. సంజయ్ దత్ తీరును దుయ్యబట్టారు. ఇలాంటి వ్యక్తి జీవిత చరిత్రకు రూ.300 కోట్లు వచ్చాయా? రౌడీ.. చెత్త వ్యక్తి అంటూ నెటిజన్లు శాపనార్థాలు పెట్టారు.
|
సంజుపై నెటిజన్ల ఫైర్
సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా రూపొందిన సంజూ బయోపిక్ సంచలన విజయం సాధించింది. ఆ చిత్రంలో మీడియా తీరును తప్పుపడుతూ ఓ పాటను సంజయ్, రణ్‌బీర్‌పై చిత్రీకరించిన సంగతి తెలిసిందే. వాస్తవాలకు విరుద్ధంగా కథనాలు రాస్తారనే విమర్శల్ని మీడియాపై ఎక్కుపెట్టడం గమనార్హం.

అలియాభట్, నర్గీస్ ఫక్రీతో
ఇక కెరీర్ పరంగా చూస్తే సంజయ్ దత్ ప్రస్తుతం గిరీష్ మాలిక్ రూపొందించే తోర్బాజ్ చిత్రంలో నటిస్తున్నారు. అఫ్ఘనిస్తాన్‌లో సూసైడ్ బాంబర్లుగా ఉండే బాలల జీవితం ఆధారంగా తెరకెక్కుతున్నది. ఈ చిత్రంలో నర్గీస్ ఫక్రీ, రాహుల్ దేవ్ నటిస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం కాలాంక్ అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు. అభిషేక్ వర్మన్ ఈ చిత్రానికి దర్శకుడు. అలియాభట్, వరుణ్ ధావన్, సోనాక్షి సిన్హా, అదిత్య రాయ్ కపూర్ నటిస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది.