twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరో వివాదంలో సంజయ్ దత్.. ఇరుకున పెట్టిన మహారాష్ట్ర మంత్రి

    |

    బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మరోసారి రాజకీయ దుమారంలో చిక్కుకున్నాడు. జైలు నుంచి విడుదలయ్యాక సినిమాలపై పూర్తి స్థాయిలో ద‌ృష్టిపెట్టిన సంజూ బాబా తనకు ప్రమేయం లేకుండానే వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. తనకు సంబంధంలేని వార్తలకు పుల్‌స్టాప్ పెట్టడానికి సంజయ్ మీడియాలో ప్రకటన చేయడంతో ఆ వివాదానికి తెరపడేలా చేసింది. సంజూని చుట్టుముట్టిన వివాదం ఏమిటంటే..

    మహారాష్ట్ర మంత్రి వ్యాఖ్యలతో

    మహారాష్ట్ర మంత్రి వ్యాఖ్యలతో

    మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న రాష్ట్రీయ సమాజ్ పక్ష (ఆర్ఎస్‌పీ) చీఫ్, మంత్రి మహదేవ్ జంకర్ వ్యాఖ్యలు మీడియాలో పతాక శీర్షికను ఆకర్షించాయి. త్వరలోనే సంజయ్ దత్ మా పార్టీలో చేరుతున్నారు. అందుకు ముహుర్తం సెప్టెంబర్ 25గా నిర్ణయించాం అని ప్రకటన చేయడంతో సంజు బాబా ఇరుకున పడ్డారు.

    రంగంలోకి సంజయ్ దత్

    రంగంలోకి సంజయ్ దత్

    సంజయ్ దత్ ఆర్ఎస్‌పీలో చేరుతున్నారనే వార్త మీడియాలో వైరల్ కావడం, రాష్ట్రమంతటా ఆ వార్తపై విపరీతమైన చర్చ జరుగుతుండటంతో సంజయ్ దత్ రంగంలోకి దిగాడు. తన రాజకీయ ప్రవేశంపై వివరణ ఇస్తూ.. నేను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదు. మంత్రి జంకర్ నాకు ప్రియమైన స్నేహితుడు. సోదరుడిలాంటి వారు. రాజకీయాల్లో ఆయన విశేషంగా రాణించాలని ఆకాంక్షిస్తున్నాను అని సంజయ్ దత్ ఓ ప్రకటనలో తెలిపారు.

    వీడియోలో సంజయ్ దత్

    వీడియోలో సంజయ్ దత్

    సంజయ్ దత్ రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది. ప్రస్తుతం నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం మిస్టర్ జంకర్ మాత్రమే. అందుకు నేను రుణపడి ఉంటాను. కానీ ప్రస్తుతం రాజకీయాలపై నాకు ఆసక్తి లేదు అంటూ సంజయ్ వీడియోలో తెలిపారు. దాంతో రాజకీయ ప్రవేశంపై అనేక సందేహాలు, అనుమానాలకు తెరపడ్డాయి.

    20న ప్రస్థానం సినిమా రిలీజ్

    20న ప్రస్థానం సినిమా రిలీజ్

    ఇక సినిమా కెరీర్ విషయానికి వస్తే... తెలుగులో ఘన విజయం సాధించిన ప్రస్థానం సినిమా రీమేక్‌లో సంజయ్ దత్ నటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 20న రిలీజ్ కానున్నది. దేవకట్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మనీషా కోయిరాల, జాకీ ష్రాఫ్, చంకీ పాండే, అమీరా దస్తర్ నటిస్తున్నారు. సంజయ్ దత్ భార్య మాన్యత దత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

    English summary
    Sanjay Dutt has clarified that he will not be joining any political party. He said, I will not be joining any political party. Mr. Jankar is a dear friend and brother of mine and I humbly wish him good luck for his future endeavours.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X