»   »  రణబీర్‌ లుక్ ‘సంజు’లా మార్చడానికి ఎంత కష్టపడ్డారో.. (మేకింగ్ వీడియో)

రణబీర్‌ లుక్ ‘సంజు’లా మార్చడానికి ఎంత కష్టపడ్డారో.. (మేకింగ్ వీడియో)

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  రణబీర్‌ లుక్ ‘సంజు’లా మార్చడానికి ఎంత కష్టపడ్డారో.. (మేకింగ్ వీడియో)

  సంజయ్ దత్ జీవితం ఆధారంగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన 'సంజు' మూవీ బాక్సాఫీసు వద్ద సంచలనాలు నమోదు చేస్తూ దూసుకెళుతోంది. తెరపై రణబీర్ లుక్ చూసిన ప్రేక్షకులు సంజయ్ దత్ స్వయంగా సినిమాలో నటించినట్లు ఉందనే అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కానీ రణబీర్‌ను ఈ లుక్ లోకి మార్చడానికి చిత్ర బృందం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎన్నో లుక్స్ ట్రయల్స్ వేసి చివరకు ఇపుడు మనం చూస్తున్న లుక్ ఫైనల్ చేశారట.

  ‘సంజు’ లుక్ మేకింగ్ వీడియో

  రణబీర్ కపూర్ టు సంజయ్ దత్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగిందో వివరిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. వాస్తవానికి మొదట ఈ సినిమాలో రణబీర్‌ను హీరోగా అనుకున్నపుడు రూపంలో కానీ, సైజులో కానీ సంజయ్‌తో ఏ మాత్రం పోలికలేని ఈ యంగ్ స్టార్ ఎలా సూటవుతాడో? అని చాలా మంది అనుమాన పడ్డారట. కానీ దర్శకుడు రాజ్ కుమార్ విజన్ వేరు... అతడైతేనే ఈ పాత్రకు బాగా సూట్ అవుతాడని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. అందరూ అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి చూపించాడు.

  అదో పెద్ద సవాల్

  అదో పెద్ద సవాల్

  తాజా వీడియోలో దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ మాట్లాడుతూ..... ‘సంజయ్‌ దత్‌ బయోపిక్‌ను తెరకెక్కించాలని నిర్ణయించుకున్నప్పుడు.. ఎవర్ని ఈ పాత్ర కోసం తీసుకోవాలి? అనేది మాకు పెద్ద సవాల్‌గా మారింది. స్మార్ట్ హీరో అయిన రణబీర్ ఫైనల్ అయిన తర్వాత అతడిని బలంగా ఉండే సంజయ్‌ మాదిరిగా మార్చడానికి చాలా కష్టపడ్డాం. దాని కోసం రణ్‌బీర్‌ చాలా శ్రమించాడు అని తెలిపారు.

  సంజయ్‌ లుక్‌ను సాధించలేకపోతే సినిమా ఆపేయాలి అనుకున్నాం

  సంజయ్‌ లుక్‌ను సాధించలేకపోతే సినిమా ఆపేయాలి అనుకున్నాం

  రాజు సార్ నాకు ఈ సినిమా గురించి చెప్పినపుడు ఎగ్జైటింగ్‌గా ఫీలయ్యాను. నేను ఎప్పటికీ సంజయ్‌లా మారలేను, ఆయన ప్రత్యేకం. దీంతో నాకు చాలా భయాలు ఉండేవి. ఎలా ఆ పాత్ర చేయగలను అనుకునేవాడిని. సంజయ్‌ లుక్‌ను సాధించలేకపోతే సినిమా ఆపేయాలి అనుకున్నాం' అని రణ్‌బీర్‌ గుర్తు చేసుకున్నారు.

  బాక్సాఫీసు వద్ద ‘సంజు' సంచలనం

  బాక్సాఫీసు వద్ద ‘సంజు' సంచలనం

  జూన్ 29ప విడుదలైన ‘సంజు' మూబీ బాక్సాఫీసు వద్ద సంచలనాలు నమోదు చేస్తోంది. తొలి వారం రూ. 200 కోట్లు రాబట్టింది. ఈ చిత్రం ఫుల్ రన్‌లో రూ. 500 నుండి రూ. 700 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

  English summary
  The journey of #RanbirToSanju wasn't easy. It came along with a lot of obstacles and challenges. The transformation included long hours in the gym and the makeup room. Watch how Ranbir Kapoor managed to get the perfect look with his hard work and with the help of an entire team. Starring: Ranbir Kapoor, Paresh Rawal, Manisha Koirala, Anushka Sharma, Sonam Kapoor, Dia Mirza, Vicky Kaushal, Jim Sarbh and Boman Irani. Directed by: Rajkumar Hirani.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more