twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘కేదార్‌నాథ్’ నిషేధంపై సారా అలీ ఖాన్ అసంతృప్తి

    |

    బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ 'కేదార్‌నాథ్' సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఉత్తరఖండ్‌లోని కేదార్‌నాథ్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.... ఉత్తరఖండ్‌లో నిషేదానికి గురైంది.

    తన సినిమా బ్యాన్ చేయడంపై సారా అలీ ఖాన్ స్పందించారు. ఈ నిర్ణయం తనను ఎంతో డిసప్పాయింట్మెంటుకు గురి చేసిందని తెలిపారు. నటిగా నా జర్నీ ఉత్తరఖండ్ ప్రజలతో మొదలైందని, 45 రోజుల పాటు అక్కడ షూటింగులో పాల్గొన్నాను. అలాంటి చోటు నా సినిమా విడుదల కాక పోవడం అసంతృప్తికి గురి చేసిందన్నారు.

    Sara Ali Khan about Kedarnath ban on Uttarakhand

    కేదార్‌నాథ్ దర్శనానికి వచ్చిన హిందూ అమ్మాయి... ముస్లిం యువకుడితో ప్రేమలో పడే కథతో ఈ చిత్రం రూపొందించారు. దీంతో ఈ చిత్రం లవ్ జిహాద్‌ను ప్రోత్సహించే విధంగా ఉందంటూ కొన్ని సంఘాలు ఆందోళన చేపట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ పరిణామాలతో ఉత్తరఖండ్ ప్రభుత్వం సినిమాపై నిషేధం విధించింది.

    అభిషేక్ కపూర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇండియాలో ఇప్పటి వరకు రూ. 54 కోట్ల బిజినెస్ చేసింది. తొలివారం రూ. 42.45 కోట్లు వసూలవ్వగా.... సెకండ్ వీకెండ్ రూ. 11.76 కోట్లు రాబట్టింది. నటిగా సారా అలీ ఖాన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

    English summary
    Sara Ali Khan says she was disappointed that she couldn’t share her labour of love, her debut film Kedarnath, with the people of Uttarakhand, the state where she started her journey as an actress.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X