twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Shilpa Shetty, Raj Kundraలకు ఊహించని షాక్.. అలా చేసినందుకు భారీగా ఫైన్ !

    |

    బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, భర్త రాజ్ కుంద్రా కష్టాలు ఇప్పట్లో తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. అశ్లీల చిత్రాలను నిర్మించి ఒక యాప్ ద్వారా వాటిని ప్రసారం చేసి డబ్బు కూడబెట్టారు అన్న ఆరోపణలతో రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు శిల్పా స్వయంగా ఇబ్బందుల్లో పడినట్లు తెలుస్తోంది. వాస్తవానికి, శిల్పా శెట్టికి సెబీ 3 లక్షల జరిమానా విధించింది. సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) ఇన్సైడర్ ట్రేడింగ్ నిషేధ నిబంధనలను ఉల్లంఘించినందుకు రాజ్ కుంద్రా మరియు అతని సంస్థ వయాన్ ఇండస్ట్రీస్ కు జరిమానా విధించారు.

    ఒక వైపు, రాజ్ కుంద్రాను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపినప్పుడు, సెబీ కూడా రాజ్ కుంద్రా మరియు శిల్పా శెట్టి పై చర్యలు తీసుకుంది. నిజానికి రాజ్ బెయిల్ పిటిషన్ గురించి కూడా ముంబైలోని కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో కూడా రాజ్ కు ఎదురుదెబ్బ తగిలింది. రాజ్ బెయిల్ దరఖాస్తును కోర్టు తిరస్కరించింది. ముంబైలోని ఎస్ప్లానేడ్ కోర్టు రాజ్ కుంద్రా మరియు రియాన్ తోర్పేల బెయిల్ పిటిషన్లను విచారించింది. అయితే రాజ్ యొక్క న్యాయవాదుల వాదనలతో కోర్టు సంతృప్తి చెందలేదు. ఆ తరువాత వారి బెయిల్ దరఖాస్తు తిరస్కరించబడింది. రాజ్ కుంద్రాను జూలై 19 న ముంబై క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది.

    SEBI imposes Rs 3 lakh fine on Shilpa Shetty and Raj Kundra for insider trading

    అరెస్టు అయినప్పటి నుంచి రాజ్ పోలీసుల అదుపులో ఉన్నాడు. రాజ్‌పై తమ వద్ద బలమైన ఆధారాలున్నాయని పోలీసులు చెబుతున్నారు. విషయం ఏమిటంటే ఈ కేసులో శిల్పాకు ఇంకా క్లీన్ చిట్ ఇవ్వలేదు. ఫోరెన్సిక్ నిపుణులు రాజ్ కుంద్రా కంపెనీ బ్యాంక్ ఖాతాను పరిశీలిస్తున్నారు. శిల్పా శెట్టి రాజ్ కంపెనీ వియాన్ ఇండస్ట్రీస్ లో ఒక డైరెక్టర్ గా ఉన్నారు. అలాగే, శిల్పా శెట్టి అశ్లీల వ్యాపారం నుండి డబ్బు వస్తున్న ఖాతాను కూడా ఉపయోగిస్తున్నారు.ఈ కారణంగా, శిల్పాకు ఈ కేసులో ఇంకా క్లీన్ చిట్ రాలేదు.

    English summary
    As per latest report Capital Markets regulator Securities and Exchange Board of India (SEBI) imposed a fine of Rs 3 lakh on Shilpa Shetty, Raj Kundra and Viaan Industries, the company they own, violating its insider trading rules.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X