twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీడియా కంట పడకుండా షారుఖ్ తంటాలు.. గొడుగులు అడ్డుపెట్టి మరీ ఎందుకు?

    |

    ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు తర్వాత షారుఖ్ ఖాన్ మీడియా కంట పడకుండా పోయాడు. మామూలుగానే షారుఖ్ ఖాన్ ఫోటో గ్రాఫర్ లకు కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇక నవంబర్ 7 ఆదివారం నాడు, షారుఖ్ టీమ్ అంతా ముంబైలోని కలీనా విమానాశ్రయంలో కనిపించింది. ఢిల్లీలో ఓ సమావేశం ముగించుకుని షారుఖ్ ఖాన్ తన ప్రైవేట్ జెట్‌లో ముంబైకి తిరిగొచ్చినట్లు సమాచారం. ఈ సమయంలో మరోసారి మీడియా కెమెరా నుంచి తప్పించుకుని షారుక్ ఖాన్ వెళ్లిపోయాడు. అయితే గొడుగులు అడ్డుపెట్టి మరీ వెళ్లడం చర్చనీయాంశం అయింది. ఆ వివరాల్లోకి వెళితే

    తప్పించుకుని

    తప్పించుకుని

    తాజాగా ముంబైలోని కలీనా విమానాశ్రయం నుండి ఒక వీడియో బయటపడింది. ఈ వీడియోలో షారుక్ ఖాన్ టీమ్ కనిపిస్తోంది. వీడియోలో, ఇద్దరు వ్యక్తులు నల్ల గొడుగు వెనక దాక్కుని కారులో కూర్చున్నట్లు కనిపిస్తోంది. ఫోటో గ్రాఫర్ లు వెంటపడినా తాను కంటపడకుండా ఉండేందుకే షారుఖ్ టీమ్ అలా ప్లాన్ చేసిందని అంటున్నారు. అందుకే తన సెక్యూరిటీ గార్డుల నుంచి నల్ల గొడుగు తీసుకున్నాడు.

    ఇంటర్వ్యూల కోసం వెంట పడుతూ ఉండడంతో

    ఇంటర్వ్యూల కోసం వెంట పడుతూ ఉండడంతో

    అయితే షారుక్ ఖాన్ గొడుగు వెనక దాక్కుని కారులో కూర్చున్నాడనే విషయం కూడా స్పష్టంగా లేదు. అలాగే అతనితో పాటు ఎవరెవరు ఉన్నారనే విషయం కూడా తెలియలేదు. మీడియా నివేదికల ప్రకారం, అనేక విదేశీ మీడియా సంస్థలు ఇంటర్వ్యూల కోసం షారుక్ ఖాన్ బృందాన్ని సంప్రదించాయి. వీరంతా షారుక్‌తో తన కొడుకు ఆర్యన్‌ఖాన్ డ్రగ్స్ కేసు గురించి మాట్లాడాలని అనుకుంటున్నారు.

    నో కామెంట్స్

    నో కామెంట్స్

    అయితే దీని గురించి ఎవరితోనూ మాట్లాడటానికి షారుక్ సిద్ధంగా లేదని అంటున్నారు. ప్రస్తుతం ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు దర్యాప్తు కొత్త స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (NCB)కి బదిలీ చేయబడింది.డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న ఆర్యన్ ఖాన్ 28 రోజుల తర్వాత బెయిల్ మీద ఇంటికి వచ్చాడు. అప్పటి నుంచి షారుక్ ఖాన్ మరియు అతని భార్య గౌరీ ఖాన్ తమ కొడుకుపై దృష్టి పెట్టారు. ఆర్యన్ డైట్, మానసిక ఆరోగ్యం, భద్రత కోసం ఆ ఇద్దరూ పెద్ద నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.

    ఆర్యన్ ఖాన్‌కు ఎన్‌సిబి సిట్ సమన్లు

    ఆర్యన్ ఖాన్‌కు ఎన్‌సిబి సిట్ సమన్లు

    మరో పక్క ఆర్యన్ ఖాన్‌కు ఎన్‌సిబి సిట్ సమన్లు ​​జారీ చేసింది. డ్రగ్స్ కేసులో ఆర్యన్‌ఖాన్‌ను సిట్ ఈరోజే విచారణకు పిలిచింది. ఎన్‌సీబీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారిస్తున్న 6 కేసుల్లో నిందితులందరినీ విచారణకు పిలుస్తారు. ఈ ఎపిసోడ్‌లో, ఆర్యన్ ఖాన్‌కు ఈరోజు సమన్లు ​​అందాయి. అయితే, ఈ వార్త రాసే వరకు, ఆర్యన్ ఎన్‌సిబి సిట్ ముందు విచారణకు హాజరు కాలేదు.

    Recommended Video

    Allu Arjun యుట్యూబ్ లో, Mahesh Babu ట్విట్టర్ లో Thaggede Le || Filmibeat Telugu
    వాళ్లందరినీ మళ్ళీ

    వాళ్లందరినీ మళ్ళీ


    ఎన్‌సీబీ యొక్క సిట్ కూడా నవాబ్ మాలిక్ అల్లుడు సమీర్ ఖాన్‌ను విచారణ కోసం పిలిచింది. సిట్ దర్యాప్తు చేస్తున్న ఆరు కేసులకు సంబంధించిన వ్యక్తులందరిని మళ్లీ విచారణకు పిలిపించనున్నారు. ఈ ఎన్‌సీబీ బృందం కూడా క్రూయిజ్‌కి వెళ్లింది మరియు క్రైమ్ సీన్ మళ్లీ రీ క్రియేట్ చేసినట్లు చెబుతున్నారు. డ్రగ్స్ కేసులో మరో నిందితుడు అర్బాజ్ మర్చంట్‌ను కూడా ఎన్‌సిబి సిట్ పిలిపించి విచారణకు పిలిచింది. అర్బాజ్ మర్చంట్ మరియు అచిత్ కుమార్ విచారణ కోసం ఎన్‌సీబీ కార్యాలయానికి చేరుకున్నారని ఏజెన్సీ తెలిపింది.


    English summary
    Shah Rukh Khan avoided media with the umbrella.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X