షారుక్ కూతురితో బిగ్‌బీ మనవడు సెల్ఫీ జోష్.. వైరల్‌గా మారి..
బాలీవుడ్‌లో స్టార్ల మధ్య పోటీ పక్కన పెడితే వారి పిల్లలు మాత్రం చాలా అన్యోన్యయంగా సమయాన్ని గడిపేస్తుంటారు. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, బాద్షా షారుక్ ఖాన్ కుటుంబల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. అందుకు ప్రతీకగా వారి పిల్లలు చేసే పనులు వారి బంధాలను వెల్లడిస్తుంటాయి.
తాజాగా షారుక్ కూతురు సుహానా ఖాన్, అమితాబ్ కూతురు శ్వేతా బచ్చన్ నందా కుమారుడు అగస్త్యా నందాతో కలిసి దిగిన సెల్ఫీ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫొటోను సుహానా ఫ్యాన్ పేజ్ షేర్ చేయడం మీడియా దృష్టిని ఆకర్షించింది. ఈ ఫోటోలో అగస్థ్య, సుహానాలిద్దరూ చూడ చక్కగా ఉన్నారు. సుహానా, అగస్త్యా బాల్య స్నేహితులు. వీరిద్దరూ ఇరు ఫ్యామిలీ సభ్యులు కలిసి వెళ్లిన దాఖలాలు ఉన్నాయి.

నటనలో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుకొంటున్న సుహానా త్వరలోనే బాలీవుడ్‌లో రంగ ప్రవేశం చేసే అవకాశాలు ఉన్నాయి. నాటక రంగానికి చేరువైన సుహానా ఇటీవల ప్రదర్శించిన ఓ నాటకానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.


Click it and Unblock the Notifications











