»   » స్టార్ హీరో భార్య హీరోయిన్‌గా.. ఇప్పుడు ఇదేం కోరిక!

స్టార్ హీరో భార్య హీరోయిన్‌గా.. ఇప్పుడు ఇదేం కోరిక!

Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ స్టైలిష్ హీరో షాహిద్ కపూర్ వివాహ జీవితం అన్యోన్యంగా సాగుతోంది. తన భార్య మీరా రాజ్ పుత్ తో కలసి షాహిద్ కపూర్ అందమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. వీరికి అందమైన బుజ్జి కుమార్తె మిషా కపూర్ ఉంది. షాహిద్ కపూర్ ఎంత స్టైలిష్ గా ఉంటాడో మీరా కపూర్ కూడా అంతే అందంగా ఉంటుంది. ఆమె అందం బాలీవుడ్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుంది.

తాజాగా బాలీవుడ్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం మీరా రాజ్ పుత్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ అంశం బాలీవుడ్ లో హాట్ టాపిక్ కావడం విశేషం. మీరా రాజ్ పుత్ ఇంత వరకు నటించింది లేదు. పెళ్ళై పాపకు తల్లయ్యాక హీరోయిన్ నటించాలనే కోరిక ఏంటని బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Shahid Kapoor wife to become heroine

బాలీవుడ్ హీరోయిన్లని ఈ భామ ఆదర్శంగా తీసుకుందా అనే వాదన వినిపిస్తోంది. ఐశ్వర్యారాయ్, కరీనా కపూర్ ఇప్పటికి హీరోయిన్లు గా నటిస్తూ రొమాన్స్ పండిస్తున్నారు. కాగా మీరా రాజ్ పుత్ సిద్ధార్థ్ మల్హోత్రా సరసన నటించబోతున్నట్లు తెలుస్తోంది. భారీ చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తుంది. గతంలో ఓ సారి మీరాని ప్రశ్నించినప్పుడు తనకు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో నటించాలని ఉన్నట్లు ఆమె తెలిపింది.

English summary
Shahid Kapoor wife to become heroine. Mira Rajput signs her first film opposite Sidharth Malhotra
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X