Don't Miss!
- News
ఢీ అంటే ఢీ అంటున్న రెండు పవర్ సెంటర్లు?
- Finance
Home Loan: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త టాక్స్ సిష్టం బెటరా..? పాతదే మేలా..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Sports
INDvsAUS : ఈ మూడు విషయాలే సిరీస్ విజేతను నిర్ణయిస్తాయి..!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ప్రభాస్ రేంజ్ లోనే ఆ హీరోకు వంద కోట్ల రెమ్యునరేషన్.. సక్సెస్ లేకపోయినా..
ఈ మధ్య కాలంలో ఒక్క హిట్టు పడితే చాలు హీరోలు అస్సలు వెనక్కి తిరిగి చూసుకోవడం లేదు. రెమ్యునరేషన్ విషయంలో అయితే భారీ స్థాయిలో డిమాండ్ చేస్తున్నారు. హైప్ పెరిగినా కూడా సినిమా బిజినెస్ తో సమానంగా పారితోషికం కావాలని డిమాండ్ చేసేస్తున్నారు. ఇక ప్రభాస్ తో పాటు బాలీవుడ్ లో మరో స్టార్ హీరో 100కోట్లను అడుగుతున్నాడట.
ఆ హీరో మరెవరో కాదు. కింగ్ ఖాన్ షారుక్ ఖాన్. అమీర్ ఖాన్, సల్మాన్ కంటే కూడా ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న ఈ స్టార్ హీరో ఈ మధ్య వరుసగా డిజాస్టర్స్ ఎదుర్కొన్నాడు. ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద దారుణమైన రిజల్ట్ ను అందుకుంటున్నాయి. ముఖ్యంగా జీరో సినిమా అయితే కనీసం పెట్టిన బడ్జెట్ లో సగం కూడా వెనక్కి తేలేకపోయింది.

జీరో సినిమా బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల గ్రాస్ కూడా అందుకోలేదు. అలాంటిది ఇప్పుడు షారుక్ తన తరువాత సినిమాకు మాత్రం 100కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ హీరో పఠాన్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. వార్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నాడు. ఇక సినిమా బిజినెస్ భారీగా పెరగడం వల్లే రెమ్యునరేషన్ వంద కోట్ల వరకు వెళ్లినట్లు సమాచారం.