»   » ‘షంషీరా’ ఫస్ట్ లుక్: బందిపోటుగా మారిన లవర్‌బాయ్ హీరో

‘షంషీరా’ ఫస్ట్ లుక్: బందిపోటుగా మారిన లవర్‌బాయ్ హీరో

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Ranbir Kapoor's Next Movie 'Shamshera' First Look Released

  బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ మనకు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరోగానే తెలుసు. అయితే కేవలం అదే ఇమేజ్‌కు పరిమితం కాకుండా విభిన్నమైన పాత్రలు, కథలు ఎంచుకుంటూ ప్రేక్షకులకు తనను తాను సరికొత్తగా పరిచయం చేసకునే ప్రయత్నం చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం సంజయ్ దత్ బయోపిక్ 'సంజు'లో నటిస్తున్న రణబీర్ దీని తర్వాత 'షంషీరా' అనే యాక్షన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

  బందిపోటుగా రణబీర్ కపూర్

  బందిపోటుగా రణబీర్ కపూర్

  ప్రముఖ బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న ‘షంషీరా' చిత్రంలో రణబీర్ కపూర్ బందిపోటుగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ‘అగ్నిపథ్', ‘బ్రదర్స్' ఫేం కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది.

  ఇలాంటి సినిమా కోసం చాలా కాలంగా...

  ఇలాంటి సినిమా కోసం చాలా కాలంగా...

  ఈ సినిమా గురించి రణబీర్ కపూర్ మాట్లాడుతూ... ‘షంషీరా లాంటి సినిమా కోసం నేను చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. చిన్నతనం నుండి హిందీలో ఎన్నో కమర్షియల్ సినిమాలు చూస్తూ పెరిగా.... అలాంటి సినిమాల్లో చేయాలని ఎప్పటి నుండో కోరిక ఉండేది. ఇన్నాళ్లకు షంషీరా సినిమా ద్వారా నా కోరిక తీరబోతోంది. ఈ సినిమాను ఒక ఛాంలెజింగ్‌గా తీసుకుని చేస్తున్నాను. దర్శకుడు కరణ్ ఈ సినిమా ద్వారా నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయబోతున్నారు' అని రణబీర్ కపూర్ తెలిపారు.

  9 ఏళ్ల తర్వాత వీరి కాంబినేసన్లో

  9 ఏళ్ల తర్వాత వీరి కాంబినేసన్లో

  యశ్‌రాజ్ ఫిలింస్ బేనర్లో రణబీర్ కపూర్ ‘బచ్నా యే హసీనా' సినిమా ద్వారా తొలి హిట్ కొట్టాడు. తర్వాత అతడు ఇదే బేనర్లో నటించిన ‘రాకెట్ సింగ్-సేల్స్ మేన్ ఆఫ్ ది ఇయర్' చిత్రంలో పెర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. దాదాపు 9 ఏళ్ల తర్వాత యశ్ రాజ్ ఫిలింస్‌తో కలిసి మసాలా ఎంటర్టెన్మెంటుతో కూడిన దేశీ మెగా యాక్షన్ మూవీ ‘షంషీరా' చేస్తున్నారు.

  మూవీ షంషీరా మోషన్ పోస్టర్

  రణబీర్ కెరీర్లో హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. అభిమానులు ఇప్పటి వరకు చూడని సరికొత్త రణబీర్ కపూర్‌ను ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఈ ఏడాది చివర్లో సినిమా సెట్స్ మీదకు వెళుతుందని, 2019లో జూన్ వరకు షూటింగ్ పూర్తి చేయాలనే ప్లాన్లో ఉన్నట్లు సమాచారం.

  English summary
  Ranbir Kapoor turns dacoit for YRF's next. The 35-year-old actor is all set to stun the audience with his never-seen-before avatar in Karan Malhotra's Shamshera. Talking about the movie, Ranbir Kapoor says, "Shamshera is exactly the film I was looking for. While growing up watching Hindi commercial cinema, I had an image of what a film hero should be doing. Shamshera allows me to do everything that I had imagined and it's a very exciting project for me. Karan is going to take me completely out of my comfort zone and I'm looking forward to this challenge."
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more