Porn Rocket Case: షెర్లీన్ చోప్రాకు ఎదురు దెబ్బ.. బెయిల్ పిటిషన్ రిజెక్ట్‌తో కష్టాల్లోకి..
పోర్న్ రాకెట్ కేసులో బాలీవుడ్ నటి షెర్లీన్ చోప్రాకు ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవల ముంబై క్రైం బ్రాంచ్ విచారణకు హాజరయ్యే ముందు అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా ఆమెకు ముంబై కోర్టు బెయిల్ జారీ చేసింది. అయితే ఈ కేసులో పలు పరిణామాలు చోటుచేసుకోవడంతో షెర్లిన్ చోప్రాకు ముంబై సెషన్ కోర్టు ముందస్తు బెయిల్ అప్లికేషన్‌ను తిరస్కరించింది.
అయితే పోర్న్ రాకెట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టైన వారి మాదిరిగానే తన క్లయింట్ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకొన్నారు. పోలీసుల నుంచి కోర్టు ప్రొటెక్షన్ కావాలని కోరుకొంటున్నారు. విచారణకు పిలిస్తే ఎప్పుడంటే అప్పుడు వస్తున్నారు. దర్యాప్తుకు సహకరిస్తున్నారు అని షెర్లీన్ చోప్రా లాయర్ వెల్లడించారు.

పోర్న్ రాకెట్ కేసులో రాజ్ కుంద్రాకు సెక్షన్ 41 ఏ కింద నోటీసులు ఇవ్వకుండా నేరుగా అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కూడా నోటీసులు జారీ చేయకుండా అదుపులోకి తీసుకొన్నారు. ఈ కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమేశ్‌ను కూడా అలాగే అరెస్ట్ చేశారు. కాబట్టి నా క్లయింట్ షెర్లీన్ చోప్రాకు కూడా అలాంటి పరిస్థితి ఎదురవుతుందనే భయంతో ముందస్తు బెయిల్ కోసం ధరఖాస్తు చేసుకొన్నారు అని జస్టిస్ సొనాలీ అగర్వాల్‌కు షెర్లీన్ చోప్రా తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
అయితే పోర్న్ రాకెట్ కేసులో రాజ్ కుంద్రాపై పలు అరోపణలు షెర్లీన్ చోప్రా చేశారు. కాబట్టి ఆమె నుంచి వాగ్మూలం తీసుకోవడానికి ఆమెను తమకు అప్పగించాలని పోలీసులు కోర్టును వేడుకొన్నారు. దాంతో షెర్లీన్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.


Click it and Unblock the Notifications











