For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Shilpa Shettyకి మరో బిగ్ షాక్.. మొన్న భర్త, ఇప్పుడు తల్లి అరెస్ట్, అసలేం జరిగిందంటే?

  |

  బాలీవుడ్ నటి శిల్పా శెట్టి కష్టాలు ఏమాత్రం తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే ఆమె భర్త రాజ్ కుంద్రా పోర్న్ మూవీస్ వ్యవహారంలో అరెస్ట్ అయి జైల్లో ఉండగా ఇప్పుడు శిల్ప మరియు ఆమె తల్లి సునంద శెట్టి మీద ఇప్పుడు కోట్ల రూపాయలలో మోసం చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో శిల్పా మరియు ఆమె తల్లిపై కేసు నమోదైంది. దానికి సంబందించిన వివరాల్లోకి వెళితే

  అంతకు ముందు అలా

  అంతకు ముందు అలా

  శిల్పా శెట్టి తల్లి సునంద శెట్టి కొద్ది రోజుల క్రితం ముంబై పోలీసులకు చీటింగ్ కేసుకు సంబంధించి ఫిర్యాదు చేసింది. సునంద తన ఫిర్యాదులో, భూ ఒప్పందం కేసులో ఒకరు రూ .1.6 కోట్లు మోసం చేసినట్లు చెప్పింది. ఈ కేసులో సుధాకర్ ఘారె అనే వ్యక్తిని నిందితుడిగా పేర్కొన్నాడు. సునంద ఫిర్యాదుపై పోలీసులు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సునంద శెట్టి తన ఫిర్యాదులో నిందితుడు సుధాకర్ నకిలీ పత్రాల సహాయంతో 1.6 కోట్ల రూపాయల భూమిని విక్రయించారని చెప్పారు. అయితే, ఈ విషయంలో ఇంకా ఎలాంటి సమాచారం తెరపైకి రాలేదు.

  రెండున్నర కోట్ల

  రెండున్నర కోట్ల

  ఆ కేసు సంగతి అలా ఉంచితే ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌ రాజధాని లక్నోలో శిల్పా శెట్టి మరియు ఆమె తల్లి సునంద శెట్టి మీద చీటింగ్ కేసు నమోదైంది. ఈ మోసం కేసులో శిల్ప పేరు ఉన్నందున మరిన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. వెల్‌నెస్ సెంటర్ పేరుతో మోసం చేసిన కేసులో శిల్పా మరియు ఆమె తల్లి సునందలను విచారించడానికి లక్నో పోలీసుల బృందం ముంబైకి రానుంది. లక్నోలోని హజరత్ గంజ్ మరియు విభూతి ఖండ్ పోలీస్ స్టేషన్లలో రెండు FIR లు నమోదు చేయబడ్డాయి. ఈ క్రమంలోనే పోలీసులు ఇప్పుడు రెండు కేసులలో దర్యాప్తును ముమ్మరం చేశారు.

   శిల్ప నాయకత్వం

  శిల్ప నాయకత్వం

  పోలీసు అధికారుల ప్రకారం, శిల్పా శెట్టి ఐయోసిస్ వెల్నెస్ పేరుతో ఫిట్నెస్ చైన్ నడుపుతున్నారు. ఈ కంపెనీకి శిల్పా శెట్టి నాయకత్వం వహిస్తుండగా, ఆమె తల్లి సునంద డైరెక్టర్ గా ఉన్నారు. వెల్‌నెస్ సెంటర్ బ్రాంచ్ ప్రారంభించే పేరుతో శిల్పా శెట్టి మరియు ఆమె తల్లి ఇద్దరు వ్యక్తుల నుండి కోట్లాది రూపాయలు తీసుకున్నారని ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. హామీ అయితే ఇచ్చారు కానీ ఆ హామీ నెరవేర్చబడలేదు. ఈ కేసులో ఒమాక్స్ హైట్స్ నివాసి జ్యోత్స్న చౌహాన్, విభూతి ఖండ్ పోలీస్ స్టేషన్‌లో మరియు రోహిత్ వీర్ సింగ్ హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో మోసం చేసినట్లు కేసు నమోదు చేశారు. హజరత్‌గంజ్ పోలీసులు మరియు విభూతి ఖండ్ పోలీసులు శిల్పా శెట్టి మరియు ఆమె తల్లిని ప్రశ్నించడానికి నోటీసులు పంపారు.

  అరెస్ట్

  అరెస్ట్

  ఇక నటి శిల్పాశెట్టి మరియు ఆమె తల్లి సునందలను విచారించడానికి దర్యాప్తు అధికారి సోమవారం ముంబై వెళ్తారని DCP (తూర్పు) సంజీవ్ సుమన్ తెలిపారు. ఆయన ఈ విషయంలో అన్ని అంశాలు పరిశీలిస్తారని వెల్లడించారు. సంజీవ్ సుమన్ ఈ కేసు ఉన్నత స్థాయికి చెందినదని, అందువల్ల పోలీసులు అన్ని అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నారని చెప్పారు. ఇక ఈ కంపెనీ రెండుసార్లు సుమారు 2.5 కోట్ల రూపాయలు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో వారి ప్రమేయం స్పష్టంగా తెలిస్తే శిల్పా మరియు ఆమె తల్లిని కూడా అరెస్టు చేయవచ్చని చెబుతున్నారు.

   మొట్టమొదటిసారిగా అలా

  మొట్టమొదటిసారిగా అలా


  ఇక మరో పక్క శిల్పా శెట్టి తన భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పోర్న్ రాకెట్ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత మొదటిసారిగా బహిరంగ ఈవెంట్ కు హాజరు కానున్నారు. బాలీవుడ్ నటులు మాత్రమే కాక అంతర్జాతీయ నటులు అర్జున్ కపూర్, దియా మీర్జా, ఎడ్ షీరన్, కరణ్ జోహార్, పరిణీతి చోప్రా, సైఫ్ అలీ ఖాన్, సారా అలీ ఖాన్ మరియు స్టీవెన్ స్పీల్‌బర్గ్ వంటి వారు కోవిడ్ -19 సహాయ నిధుల సేకరణ కోసం చేరాలని భావిస్తున్నారు. దీనికి సంబందించిన వర్చువల్ ఈవెంట్, వి ఫర్ ఇండియా: సేవింగ్ లైఫ్స్, ప్రొటెటింగ్ లైవ్‌హుడ్‌స్, ఆగస్టు 15 న జరగబోతోంది. ఈవెంట్ ద్వారా వచ్చే ఆదాయం ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, సిలిండర్లు, వెంటిలేటర్లు, అవసరమైన మందులు మరియు ఐసియు యూనిట్లు వంటి సౌకర్యాలను అందించడానికి ఉపయోగించబడుతుంది. .

  Shilpa Shetty's Home Raided By Mumbai Crime Branch | Filmibeat Telugu
  మూడు గంటల పాటు

  మూడు గంటల పాటు

  టీకాలు వేసే కేంద్రాల సిబ్బందికి మద్దతు ఇవ్వడానికి నిధులు కూడా వెళ్తాయి. విరాళాలు కూడా దీర్ఘకాలిక ప్రజా పునరుద్ధరణకు మరియు జీవనోపాధిని పునర్నిర్మించడానికి తోడ్పడతాయని భావిస్తున్నారు. మూడు గంటల వీడియోథాన్ ఆదివారం సాయంత్రం నుండి ఫేస్‌బుక్‌లో ప్రసారం చేయబడుతుంది. ఇక ఈ ఈవెంట్ ను రాజ్‌కుమార్ రావు హోస్ట్ చేస్తారు. అశ్లీల కంటెంట్‌ని ఉత్పత్తి చేసి ప్రచురించిన కేసులో రాజ్ కుంద్రా అరెస్టయిన దాదాపు నెల రోజుల తర్వాత ఈ ఈవెంట్ లో శిల్ప హాజరు కానున్నారు. అరెస్ట్ అయినప్పటి నుండి అతని భార్య, నటి శిల్పా శెట్టి దృష్టికి దూరంగా ఉన్నారు. ఆమె తన రియాలిటీ షో సూపర్ డాన్సర్ 4 నుండి కూడా విరామం తీసుకుంది.

  English summary
  Bollywood actress Shilpa Shetty's troubles are unlikely to abate. Shilpa and her mother Sunanda Shetty are now accused of cheating crores of rupees while her husband Raj Kundra was already in jail after being arrested in a porn movies affair.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X