Raj Kundra Case : శిల్పా శెట్టి నష్టం కోట్లలోనే, ఎన్ని కోట్లు పోగొట్టుకుందంటే?
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా జూలై 19 వ తేదీన పోర్న్ సినిమాలు తీసినందుకు అరెస్టయ్యారు. రాజ్ కుంద్రా ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. రాజ్ కుంద్రా అసభ్యకరమైన పోర్న్ సినిమాలు తయారు చేసి యాప్ ద్వారా అమ్ముకుని డబ్బు సంపాదించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పోలీసుల వాదన ప్రకారం, వారు రాజ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలు కూడా పొందారు. అదే సమయంలో, భర్త రాజ్ కుంద్రా అరెస్టు కారణంగా శిల్పా శెట్టి చాలా బాధపడుతోంది. బాలీవుడ్ నటి శిల్పా శెట్టి రాజ్ కుంద్రా అరెస్ట్ అయినప్పటి నుంచి హిందీ టీవీ యొక్క ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'సూపర్ డాన్సర్ 4' లో కనిపించలేదు. రాజ్ కుంద్రాను అరెస్టు చేసిన తర్వాత, పోలీసులు శిల్పను కూడా విచారించారు మరియు ఇప్పటి వరకు ఆమెకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు కనుగొనబడలేదు. అయితే భర్త అరెస్ట్ తర్వాత శిల్ప చాలా డిస్టర్బ్ అయింది.
తన భర్త అరెస్ట్‌తో ఇబ్బంది పడటం వలన, శిల్పా శెట్టి ప్రముఖ డాన్స్ రియాలిటీ షో 'సూపర్ డాన్సర్ 4' నుంచి నిష్క్రమించింది. ఈ షోలో, శిల్ప గీతా కపూర్ మరియు అనురాగ్ బసుతో పాటుగా న్యాయమూర్తిగా వ్యవహరించేది. అంతే కాక ఆ ముగ్గురిలో కూడా ఆమె అత్యంత ఖరీదైన జడ్జ్ కూడా. కానీ రాజ్ అరెస్ట్ అయినప్పటి నుంచి, ఆమె మిస్సింగ్ లోనే ఉన్నారు. అంతే షోకి హాజరు కావడం లేదు. భర్త అరెస్ట్ కారణంగా ఆమె మానసికంగా కూడా తీవ్రంగా దెబ్బతిన్నారు. మీడియా నివేదికల ప్రకారం, 'సూపర్ డాన్సర్ చాప్టర్ 4' షూట్ కు రాకపోవడం వల్ల శిల్పా సుమారు 2 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూస్తారుని అంటున్నారు. నిజానికి శిల్పా ఇంకా అధికారికంగా షో నుండి నిష్క్రమించానని ప్రకటించలేదు. అలాగే మేకర్స్ నుంచి కూడా అలాంటి ప్రకటన ఏదీ లేదు.

కానీ గత రెండు వారాలుగా, షోలో శిల్పా కనిపించలేదు, ఆమె బదులుగా ఒక ఎపిసోడ్ లో కరిష్మా కపూర్, మరో ఎపిసోడ్ లో జెనీలియా డిసౌజా మరియు రితీష్ దేశ్ ముఖ్ ప్రత్యేక అతిథులుగా కనిపించారు. ఈ షో నుంచి తప్పుకోవడం వల్ల శిల్పా చాలా బాధపడుతోందని అంటున్నారు. అంతే కాక షోలో అత్యధిక పారితోషికం తీసుకునే న్యాయమూర్తి శిల్ప. ఈ షో చేసినందుకు గాను ప్రతి ఎపిసోడ్ కోసం శిల్పా శెట్టి దాదాపు 18 నుంచి 22 లక్షల రూపాయలు ఛార్జ్ చేసే వారు. అటువంటి పరిస్థితిలో, ఆమె ప్రతి వారం 2 రోజులు షోలో కనిపిస్తుంది. ఇక ఒకవేళ శిల్పా త్వరలో షోకి తిరిగి రాకపోతే, ఆమె నష్టం మరింత పెరుగుతుందని అంటున్నారు. ఇక ఇప్పటికే శిల్పా శెట్టి ఇటీవల మీడియాపై కేసు పెట్టింది రాజ్ కుంద్రా కేసులో తనని లాగుతూ ఉండడం వలన తన ఇమేజ్ మసకబారుతోందని ఆమె ఆరోపించింది. ఇక మీడియాను ఆపలేమని కోర్టు స్పష్టంగా చెప్పినప్పటికీ, కొన్ని వీడియోలను తీసివేయాలని ఆమె డిమాండ్ చేస్తోంది.
బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటో గ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంబంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











