twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గూగుల్, ఫేస్‌బుక్ సహా మీడియాకి షాక్ ఇచ్చిన శిల్పా శెట్టి.. పరువు తీస్తున్నారు, 25 కోట్లు కట్టండి!

    |

    తన భర్త రాజ్ కుంద్రా పై ఆరోపణలు ఎదుర్కొంటున్న అశ్లీల కేసులో బాలీవుడ్ ప్రముఖ నటి శిల్పా శెట్టి 29 మంది మీడియా వ్యక్తులు మరియు మీడియా సంస్థలపై 'తప్పుడు రిపోర్టింగ్ మరియు వారి ఇమేజ్ ను డ్యామేజ్ చేసినందుకు గాను 25 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఈ కేసును రేపు విచారించనున్నట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది. ఈ విషయంలో మీడియా తప్పుగా రిపోర్ట్ చేయడాన్ని ఆపాలని నటి కోర్టును కోరింది. గూగుల్, ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లను కూడా ఈ కేసులో ఆమె ఇన్వాల్వ్ చేశారని తెలుస్తోంది. అదే సమయంలో మీడియా సంస్థలు తనకు వ్యతిరేకంగా రాసిన అన్ని రకాల అవమానకరమైన వార్తలను తొలగించాలని నటి డిమాండ్ చేసింది.

    అశ్లీల కేసులో భర్త రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసి, ముంబై క్రైమ్ బ్రాంచ్ విచారణ ఎదుర్కొన్న తర్వాత, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి మీడియా పై మొదటిసారిగా విరుచుకు పడ్డారనే చెప్పాలి. అశ్లీల సినిమాలను చేసి, కొన్ని యాప్‌ల ద్వారా ప్రసారం చేసిన కేసులో వ్యాపారవేత్త రాజ్ కుంద్రా బెయిల్ పిటిషన్‌ని ముంబై కోర్టు బుధవారం తిరస్కరించింది. బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త కుంద్రాను జూలై 19 న ముంబై పోలీసుల క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది. భారతీయ శిక్షాస్మృతి మరియు సమాచార సాంకేతిక చట్టం లోని సంబంధిత సెక్షన్ల రాజ్ కుంద్రా మీద కేసు నమోదు చేశారు.

    Shilpa Shetty files defamation suit against media houses

    మంగళవారం నాడు మెజిస్టీరియల్ కోర్టు కుంద్రాను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఇక కుంద్రా బెయిల్ దరఖాస్తు దాఖలు చేసినప్పటికీ కోర్టు బుధవారం దానిని తిరస్కరించింది. ఇక ఈ కేసు దర్యాప్తులో, కుంద్రా ఆర్మ్స్‌ప్రైమ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌ను కూడా సృష్టించినట్లు తెలిసింది. ఈ కంపేనే ఇది సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వీడియోలను అప్‌లోడ్ చేయడానికి లండన్ కు చెందిన కెన్రిన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా హాట్‌షాట్స్ యాప్‌ను కొనుగోలు చేసింది. గత ఏడాది ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య కుంద్రా హాట్‌షాట్‌ యాప్ ద్వారా రూ.1.17 కోట్లకు పైగా సంపాదించాడని కూడా ఆరోపించింది. ఇక నిందితుల కార్యాలయంపై జరిపిన దాడుల్లో 51 అభ్యంతరకర వీడియోలు దొరికాయని కూడా పోలీసులు పేర్కొన్నారు.

    English summary
    Bollywood actor Shilpa Shetty has filed defamation suit in Bombay High Court against 29 media personnel and media houses, accusing them of doing "false reporting and maligning her image."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X