For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రాజ్ కుంద్రా పోర్న్ కేసు: ఆ ఒక్క విషయంలో శిల్పా శెట్టికి ఊరట.. వారు తప్పు చేయలేదని..

  |

  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ కేసులో రోజుకో విషయం బయటకు వస్తుంది. అశ్లీల చిత్రాలు చిత్రీకరించారని కేసు నుంచి రాజ్ కుంద్రా తోపాటు ఆమె భార్య మాజీ హీరోయిన్ అయినటువంటి శిల్పాశెట్టి కూడా అనేక రకాల విచారణతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే మరొక కీలకమైన విచారణలో వారికి కొంత ఊరట లభించింది. దీంతో శిల్పా శెట్టి కాస్త ఊపిరి పీల్చుకున్నారు. వారు షేర్ హోల్డింగ్ వివరాల వెల్లడి నిబంధనలను ఉల్లగించరని ఆరోపణలు రాగా ఇటీవల సెబీ విచారణను ముమ్మరం చేసింది.

  శిల్పా శెట్టి కూడా..

  శిల్పా శెట్టి కూడా..

  అశ్లీల చిత్రాలు చిత్రీకరించారని అలాగే బలవంతంగా పోర్న్ సినిమాలను షూట్ చేసినట్లు కొంతమంది నటీనటులు రాజ్ కుంద్రా పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ కేసులో రాజ్ కుంద్రాతో పాటు అతని భార్య శిల్పా శెట్టి కూడా రెగ్యులర్ గా క్రైమ్ బ్రాంచ్ పోలీస్ విచారణలో పాల్గొంటున్నారు. అధికారులు ఈ కేసు విషయంలో రాజ్ కుంద్రా ఫ్యామిలీకి సంబంధించిన వారిని కూడా విచారించారు.

   షేర్ హోల్డింగ్ వివరాల వెల్లడి..

  షేర్ హోల్డింగ్ వివరాల వెల్లడి..

  ఇక ఈ దంపతులు షేర్ హోల్డింగ్ వివరాల వెల్లడి నిబంధనలను ఉల్లగించరని ఆరోపణలు రాగా ఇటీవల సెబీ విచారణను ముమ్మరం చేసింది. అయితే ఆ విషయంలో ఊరట లభించింది. మార్కెట్ రెగ్యులేటర్ సెబి బహిర్గత అవకతవకలకు సంబంధించిన కేసులో నటుడు శిల్పా శెట్టి కుంద్రా, ఆమె భర్త రాజ్ కుంద్రాపై తీర్పు విచారణలను రద్దు చేసింది.

  ఆ తప్పు చేయలేదు

  ఆ తప్పు చేయలేదు

  గత కొన్ని రోజులుగా వయాన్ ఇండస్ట్రీస్ విషయంలో సెబీ (సబ్‌స్టేన్షియల్ అక్విజిషన్ ఆఫ్ షేర్స్ అండ్ టేకోవర్స్) రెగ్యులేషన్స్ లేదా SAST నిబంధనలను ఈ జంట ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయి. మొత్తానికి నోటీసుల షేర్‌హోల్డింగ్‌లో మార్పులో వారు ఎలాంటి ప్రకటనలు చేయాల్సిన అవసరం లేదు. SAST నిబంధనలు మరియు షోకాజ్ నోటీసు (SCN) లో ఆరోపణలు నోటీసులు నిబంధనలను ఉల్లంఘించాయి. SAST నిబంధనలు నిలకడగా ఉండవు. అని సెబీ జూలై 30 నాటి ఉత్తర్వులో పేర్కొంది.

  కొంత ఊపిరి పీల్చుకున్నారు.

  కొంత ఊపిరి పీల్చుకున్నారు.

  సెప్టెంబర్ 2013 నుండి డిసెంబర్ 2015 మధ్య కాలంలో వయాన్ ఇండస్ట్రీస్ స్క్రిప్‌లోని వ్యవహారాలపై విచారణ నిర్వహించింది. ఈ సంస్థ గతంలో హిందూస్తాన్ సేఫ్టీ గ్లాస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని పిలువబడేది. మొత్తానికి రాజ్ కుంద్రా దంపతులు సెబీ విచారణ నుంచి కొంత ఊపిరి పీల్చుకున్నారు.

   పాత కేసులపై విచారణ

  పాత కేసులపై విచారణ

  రాజ్ కుంద్రా ఎప్పుడైతే అశ్లీల సినిమాల చిత్రీకరణలో ఆరోపణలు ఎదుర్కొన్నడో అప్పటి నుంచి అతనిపై ఉన్న వివిధ రకాల కేసులు కూడా మరింత హాట్ టాపిక్ గా మారాయి. అధికారులు కూడా పాత కేసులపై విచారణను మరింత ముమ్మరం చేయడం రాజ్ కుంద్రా శిల్పా శెట్టిలపై కొంత ఒత్తిడి పెంచింది. ఇక కేసుల నుంచి బయట పడేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

  ఎమోషనల్ గా వివరణ

  ఎమోషనల్ గా వివరణ

  ఇక వారికి సెబీ విచారణ నుంచి క్లీన్ చిట్ ఇవ్వడం కాస్త ఊరటనిచ్చింది. ఆ విషయంలో శిల్పాశెట్టి దంపతులు ఎలాంటి తప్పు చేయలేదని నిర్ధారణ అయ్యింది. ఇక ఇటీవల శిల్పాశెట్టి సోషల్ మీడియాలో కాస్త ఎమోషనల్ గా వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే చట్టం పై ప్రభుత్వం పై మాకు పూర్తి నమ్మకం ఉందని ఆమెకు క్లుప్తంగా తెలియజేసింది.

  చిన్న పిల్లలు కూడా ఉన్నారని

  చిన్న పిల్లలు కూడా ఉన్నారని

  అలాగే శిల్పా శెట్టి మీడియాలో వస్తున్న కథనాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వీడియో సమాంతర దర్యాప్తు చేస్తోందని దానివల్ల మా వ్యక్తిగత గోప్యతకు గౌరవం ఇవ్వడం లేదని కూడా ఆమె తన సోషల్ మీడియాలో వివరణ ఇచ్చింది కుటుంబంలో చిన్న పిల్లలు కూడా ఉన్నారని ఆ విషయంలో కాస్త మానవత్వంతో ఆలోచించాలని హితవు పలికారు.

  Shilpa Shetty's Home Raided By Mumbai Crime Branch | Filmibeat Telugu
  పూర్తి నమ్మకం ఉందని..

  పూర్తి నమ్మకం ఉందని..

  న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని చట్టం తన పనిని తాను చేయనివ్వండి అని మీడియాను కోరారు. అశ్లీల చిత్రాలను చిత్రీకరించి వాటిని హాట్షాట్స్ అనే యాప్ ద్వారా రిలీజ్ చేసిన ఆరోపణలపై జూలై 19న రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు. దీనివల్ల రాజ్ కుంద్రా దంపతులు తీవ్ర స్థాయిలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

  English summary
  Along with Raj Kundra, Shilpa Shetty, who is also the ex-heroine of his wife, has also faced difficulties with various investigations since the case of pornography. However in another crucial trial they got some solace. Shilpa Shetty breathed a sigh of relief. SEBI has recently intensified its probe into allegations that they did not violate the terms of the shareholding disclosure details.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X