For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అవమానంతో శిల్పా శెట్టి దూరం.. ఆమె స్థానంలో ఖడ్గం హీరోయిన్.. భారీ నష్టం!

  |

  బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా కాలం తర్వాత సంచలనం సృష్టించిన రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు ఏ స్థాయిలో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త అయినటువంటి రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల వీడియోలను నిర్మించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ కేసు కారణంగా రాజ్ కుంద్రా గతంలో చేసిన తప్పులు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పలువురు సెలబ్రిటీలు కూడా రాజ్ కుంద్రా చేసిన తప్పులను ధైర్యంగా బయటకు చెబుతున్నారు.

  ఇక భర్త చేసిన పని వల్ల నటి శిల్పా శెట్టి కూడా పోలీసుల విచారణలతో తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అంతేకాకుండా శిల్పా శెట్టి ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. కెమెరా ముందుకు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఒక రియాలీటి షో నుంచి కూడా తప్పుకోవడంతో ఆమే స్థానంలో మరొక స్టార్ హీరోయిన్ ను తీసుకున్నారు దానివల్ల శిల్పాశెట్టి భారీగా నష్టపోయినట్లు సమాచారం.

  బలవంతంగానే పోర్న్ వీడియోల షూట్

  బలవంతంగానే పోర్న్ వీడియోల షూట్

  జులై 19న రాజ్ కుంద్రాను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేయడంతో ఒక్కసారిగా ఆ వార్త బాలీవుడ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా అందరినీ షాక్ కు గురి చేసింది. అలాంటి వీడియోల వెనుక ఉన్నది రాజ్ కుంద్రా అని ఎవరు నమ్మలేకపోయారు. అశ్లీల చిత్రాలను చిత్రీకరించారని అలాగే కొన్ని పోర్న్ వీడియోలను షూట్ చేయడానికి బలవంతం ఒప్పించినట్లు పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే.

  ఇష్టం లేకుండా ముద్దు పెట్టుకునే ప్రయత్నం

  ఇష్టం లేకుండా ముద్దు పెట్టుకునే ప్రయత్నం

  ప్రస్తుతం రాజ్ కుంద్రాతో పాటు మరికొందరిని జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. గ్లామర్ బ్యూటీ షెర్లిన్ చోప్రా కూడా గతంలో అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. తనను కూడా పోర్న్ చిత్రాల కోసం బలవంతంగా లాగాడు అంటూ ఒకరోజు బలవంతంగా ముద్దు పెట్టుకునే ప్రయత్నం కూడా చేసినట్లు షెర్లీన్ చోప్రా పిటిషన్ లో వివరణ ఇచ్చింది.

  మరోసారి షాక్..

  మరోసారి షాక్..

  ఇక బాంబే హైకోర్టు మరోసారి రాజ్ కుంద్రాకు షాక్ ఇచ్చింది. పోర్న్ ఫిలిమ్ కేసులో శిల్పాశెట్టి భర్త గత కొంతకాలంగా జూనియర్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. అసభ్యకరమైన సినిమాలను కొన్ని ఆప్స్ ద్వారా ప్రసారం చేసి వాటితో బిజినెస్ చేసుకుంటున్నట్లు కేసు నమోదు కాగా వాటిపై సీరియస్ గా విచారణ జరుగుతోంది.

  అయితే విచారణ లో రాజ్ కుంద్రా ఏమాత్రం సహకరించడం లేదని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కోర్టులో వివరణ ఇవ్వడం మరింత వైరల్ గా మారింది. దీంతో అతనికి బెయిల్ కూడా దొరకడం లేదు. బయటకు వస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉన్నట్లు కూడా పోలీసుల తరపు న్యాయవాది కోర్టులో వివరణ ఇచ్చారు.

  ఆ షో నుంచి తప్పుకున్న శిల్పా శెట్టి

  ఆ షో నుంచి తప్పుకున్న శిల్పా శెట్టి

  ఇదిలా ఉండగా రాజ్ కుంద్రా చేసిన పని కారణంగా అతని భార్య శిల్పా శెట్టి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. శిల్పా శెట్టి ప్రస్తుతం పలు రకాల రియాల్టీ షోల తో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ముఖ్యంగా సూపర్ డాన్సర్ 4కి గత కొంత కాలంగా న్యాయనిర్ణేతగా కొనసాగుతొంది. అయితే ఆమె స్థానంలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రేని రంగంలోకి దింపారు.

  అది షో నిర్వాహకులు శిల్పాశెట్టి కావాలని తీసేసారా? లేకపోతే కొంత గ్యాప్ తీసుకోవాలని శిల్పా శెట్టి తప్పకుందా అనే ఈ విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.

  రూ.2కోట్ల నష్టం

  రూ.2కోట్ల నష్టం

  గత వారం ఈ షోలోకి కరిష్మా కపూర్ రాగా ఇప్పుడు సోనాలి బింద్రే రంగంలోకి దింపారు. ఒక విధంగా శిల్పాశెట్టి వచ్చేవరకు ఇలా సీనియర్ హీరోయిన్స్ తో కొనసాగించాలని నిర్వాహకులు ఆలోచించినట్లు తెలుస్తోంది. అయితే ఈ షో ద్వారా భారీ స్థాయిలో ఆదాయాన్ని అందుకుంటున్న శిల్పాశెట్టికి గ్యాప్ రావడం వలన దాదాపు రెండు కోట్ల నష్టపోవాల్సి వచ్చిందని సమాచారం.

  సోనాలి బింద్రే విషయానికి వస్తే

  సోనాలి బింద్రే విషయానికి వస్తే

  ఇక సోనాలి బింద్రే విషయానికి వస్తే ఆమె గతంలో తెలుగులో కూడా పలు సినిమాలతో మంచి గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. మొదట బాలీవుడ్ సినిమాలతో సినిమా వరల్డ్ లోకి వచ్చినప్పటికీ అనంతరం తెలుగు సినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఐదేళ్ల వరకు బాలీవుడ్ లో ఒక రేంజ్ లో ఉన్నప్పటికీ తెలుగులో ఆఫర్లు బాగానే ఉంది.

  2001 లో మురారి సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆచితూచి అడుగులు వేసి ఇంద్ర, ఖడ్గం, మన్మధుడు, పల్నాటి బ్రహ్మనాయుడు, శంకర్ దాదా ఎంబిబిఎస్.. వంటి సినిమాలతో 2004 వరకు బిజీబిజీగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగింది.

  Shilpa Shetty's Home Raided By Mumbai Crime Branch | Filmibeat Telugu
  రీ ఎంట్రీ ఇచ్చిన సోనాలి

  రీ ఎంట్రీ ఇచ్చిన సోనాలి

  అయితే మధ్యలో క్యాన్సర్ బారిన పడటం వలన సినిమాలకు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. విదేశాల్లో ఆమె క్యాన్సర్ కోసం చికిత్స కూడా తీసుకున్నారు. క్యాన్సర్ బారిన పడినప్పుడు సోనాలి బింద్రే తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. జుట్టును కోల్పోయినా ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అప్పట్లో ఫోటోలు వీడియోలు అభిమానులను తీవ్ర మనోవేదనకు గురి చేశాయి.

  2012లో మళ్లీ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. వన్స్ అపాన్ ఆ టైమ్ ఇన్ ముంబై దుబారా సినిమాలో అతిధి పాత్రలో నటించిన సోనాలి బింద్రే మళ్లీ మరో సినిమాలో నటించలేదు. పలు రకాల ఆఫర్స్ వచ్చినప్పటికీ అవి ఏమాత్రం నచ్చకపోవడంతో నటించలేదు.

  ఇక బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. సూపర్ డ్యాన్సర్ 4 షోలో ఇటీవల జడ్జీగా ఎంట్రీ ఇచ్చింది. శిల్ప శెట్టి స్థానంలో ఆమె రావడంతో ఒక్కసారిగా ఆ విషయం వైరల్ అయ్యింది. ఇక సోనాలి బింద్రే కొత్త షోకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకుంది.

  English summary
  Shilpa shetty super dancer 4 show star actress replacement huge to for shilpa shetty
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X