For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రియాంక చోప్రా ఫ్యామిలీలో ఊహించని పరిణామాలు.. అక్కడ పెళ్లి, ఇక్కడ పెటాకులు?

|
Wedding Of Priyanka Chopra’s Brother Siddharth Called Off? || Filmibeat Telugu

ప్రియాకం చోప్రా ఇటీవల తన సోదరుడు సిద్దార్థ్ చోప్రా పెళ్లి వేడుకలో పాల్గొనడానికి ఇండియా వచ్చిన సంగతి తెలిసిందే. పెళ్లి వాయిదా పడటంతో తిరిగి అమెరికా వెళ్లిపోయారు. సిద్ధార్థ్ వివాహం వాయిదా పడటానికి కారణం అతడు పెళ్లాడబోయే ఇషితాకు ఎమర్జెన్సీ సర్జరీ జరుగడమే.

అయితే తాజాగా ఈ వివాహానికి సంబంధించి షాకింగ్ రిపోర్ట్స్ వెలుగులోకి వచ్చాయి. పెళ్లి వాయిదా పడలేదని, రద్దయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లి ముహూర్తానికి కొన్నిరోజుల ముందే ఇద్దరి మధ్య బ్రేకప్ అయినట్లు తెలుస్తోంది. ముంబైకి చెందిన ఓ ఆంగ్లపత్రి ఈ మేరకు కథనం ప్రచురించింది.

బ్రేకప్ జరిగింది అనడానికి ఇది సంకేతమా?

ఇషితా తాజాగా ఓ రెస్టారెంట్లో దిగిన ఫోటో షేర్ చేస్తూ ‘‘ఒక అందమైన ముగింపు తర్వాత... నా జీవితం ఇప్పుడు మళ్లీ కొత్తగా మొదలైంది'' అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇషితా పోస్టుకు ఆమె తల్లి నిధి కుమార్ రియాక్ట్ అవుతూ.. ‘పాత పుస్తకం మూసేసి.. కొత్తగా రాయి' అని కామెంట్ పెట్టారు. ‘మేము నీకు తోడుగా ఉన్నాం' అంటూ తండ్రి మరో కామెంట్ పెట్టారు. ఈ పోస్ట్ సిద్ధార్థ్ చోప్రా, ఇషితా మధ్య బ్రేకప్ జరిగింది అనడానికి సంకేతంగా భావిస్తున్నారు.

రోకా సెర్మనీ ఫోటోలు డిలీట్ చేసిన ఇషిత

కొన్ని రోజుల క్రితం ఇషితా రోకా సెర్మనీకి సంబంధించిన ఫోటోలు షేర్ చేశారు. ‘‘చాలా ఫన్‌గా సాగింది. ఈ వేడుకను ఎంతో స్పెషల్‌గా మార్చిన అందరికీ థాంక్స్. నేను పెళ్లి చేసుకుంటున్నాననే విషయం నమ్మలేకపోతున్నాను' అంటూ క్యాప్షన్ పెట్టారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆసుపత్రిలో చికిత్స జరుగుతున్న ఫోటోలు షేర్ చేశారు. కట్ చేస్తే తాజాగా ఇషితా సోషల్ మీడియా పేజీ నుంచి రోకా సెర్మనీకి సంబంధించిన, సిద్ధార్థ్ చోప్రాతో కలిసి దిగిన ఫోటోలు మాయం అయ్యాయి.

పరిస్థితి మొత్తం తారుమారైంది

ప్రియాంక చోప్రా ఫిబ్రవరిలో జరిగిన సిద్దార్థ్-ఇషితా రోకా సెర్మనీకి హాజరయ్యారు. ఇషితను తమ ఫ్యామిలీలోకి ఇన్వైట్ చేస్తూ కొన్ని ఫోటోలు కూడా షేర్ చేశారు. ‘‘నా తమ్ముడిని చూస్తుంటే గర్వంగా ఉంది. ఇషితాను మా ఫ్యామిలీలోకి ఆహ్వానిస్తున్నాను. మీ జంట చాలా అందంగా ఉంది. మీ భవిష్యత్తు బావుండాలని కోరుకుంటున్నాను.'' అని ట్వీట్ చేశారు. అయితే ఇపుడు పరిస్థితి మొత్తం తారుమారైంది.

అక్కడేమో మరో పెళ్లి జరిగిపోయింది

ప్రియాంక సోదరుడి పెళ్లి విషయంలో ఇలా జరిగితే... . మరోపక్క ప్రియాంక భర్త నిక్ జోనస్ సోదరుడు జో జోనస్‌ వివాహం బుధవారం లాస్‌వెగాస్‌లో జరిగింది. హాలీవుడ్‌ నటి సోఫీ టర్నర్‌ను జో జోనస్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ ఇద్దరూ గేమ్స్ ఆఫ్ థ్రోన్స్‌లో నటిస్తున్నారు.

English summary
Bollywood Rumors aid that, Priyanka Chopra brother Siddharth Chopra and Ishitha Kumar wedding called off. According to a report in Mumbai Mirror, Ishita has posted a new picture of herself hanging out at a restaurant with the caption, “Cheers to new beginnings. With a goodbye kiss to beautiful endings.” While this hints at her and Siddharth’s possible breakup, the comments of her parents to the post further added to the speculation.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more