For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రియుడితో కియారా అద్వానీ పెళ్లి.. మొత్తానికి మౌనం వీడిన యువ హీరో.. ఏమన్నాడంటే?

  |

  సినిమా ఇండస్ట్రీలో సినీ తారల మధ్య లవ్ ఎఫర్స్ గురించి నిత్యం ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. కొంతమంది ఆ రూట్లో సక్సెస్ అవుతుంటే మరికొంత మంది మధ్యలోనే బ్రేకప్ చెప్పేస్తున్నారు. ఇక మరికొందరు పెళ్లి అయిన తర్వాత కూడా విడిపోతున్నారు. ఆ విషయాలను పక్కన పెడితే ప్రస్తుతం బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒక జంట మధ్య అనేక రకాల ప్రేమ వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. గ్లామర్ బ్యూటీ కియరా అద్వానీ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రేమలో ఉన్నట్లు గత కొన్నాళ్లుగా మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. అంతే కాకుండా పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అని టాక్ వచ్చింది. కియారా అద్వాని ఇటీవల కాలంలో సౌత్ లో కూడా బిజీ అవుతుండడంతో ఆమెకు సంబంధించిన రూమర్స్ టాలీవుడ్ లో కూడా వైరల్ గా మారుతున్నాయి.

  బెస్ట్ జోడిగా సూపర్ హిట్

  బెస్ట్ జోడిగా సూపర్ హిట్


  నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా - కియారా అద్వానీ ఇద్దరు కూడా వెండితెరపై బెస్ట్ జోడిగా మంచి గుర్తింపును అందుకుంటున్నారు. ఇటీవల వీరి కాంబినేషన్ లో వచ్చిన 'షేర్‌షా' సినిమా డైరెక్ట్ గా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన విషయం తెలిసిందే. ఇక సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఓటీటీ వరల్డ్ లో భారీ విజయంపై ఈ జంట ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారు.

  నిజజీవితంలో కూడా లవర్స్ తరహాలోనే

  నిజజీవితంలో కూడా లవర్స్ తరహాలోనే

  ఇక ఈ జంట ఎక్కడికెళ్లినా కూడా కెమెరాలు ఎక్కువగా వారిపైనే ఫోకస్ చేస్తాయి. వారు ఒకరితో ఒకరు డేటింగ్ చేస్తున్నట్లు గత కొంతకాలంగా పుకార్లు గట్టిగానే వస్తున్నాయి. అంతే కాదు, వారి పెళ్లికి సంబంధించిన ఊహాగానాలు కూడా తరచుగా వస్తున్నాయి. వారి కెమిస్ట్రీని తెరపై అభిమానులు ఎంతగానో ఆరాధించారు. ఇక నిజ జీవితంలో కూడా తమ అభిమాన నటులను జంటగా చూడాలని ఓ వర్గం ఫ్యాన్స్ అయితే గట్టిగానే కోరుకుంతున్నారు.

  పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సిద్దార్థ్

  పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సిద్దార్థ్

  ఇక ఇటీవల సిద్ధార్థ్ కు తన వివాహ ప్రణాళికలపై ఒక ప్రశ్న ఎదురవ్వగా ఒక ఆంగ్ల మీడియాకు ఈ విధంగా వివరణ ఇచ్చారు. పెళ్లి ఎప్పుడు అనే గురించి నాకు తెలియదు, నేను జ్యోతిష్యుడిని కాదు. అది చాలా ముఖ్యమైనదే. అయితే ఇది జరిగే అవకాశం ఉంటే నేను అందరికీ తెలియజేస్తాను. ప్రస్తుతం టైమ్‌లైన్ లేదు. అది సరైన సమయంలోనే జరగాలి..అని సిద్దార్థ్ వివరణ ఇచ్చారు.

  ఎలాంటి ప్రేమ కథ లేదు..

  ఎలాంటి ప్రేమ కథ లేదు..


  సిద్ధార్థ్ మల్హోత్రా అలాగే కియారా అద్వానీ ఇద్దరు కూడా వారి సంబంధాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. కానీ ఒకరిపై ఒకరు మాత్రం ప్రేమికుల కంటే ఎక్కువ స్థాయిలో పొగడ్తలు కురిపించుకుంటారు. ఇక కీయరా విషయంలో ఒక నటిగా తన లక్షణాలు నచ్చుతాయని చెప్పిన సిద్ధార్థ.. ఆమె ప్రవర్తన ఒక సినీ నటిలా కాకుండా ఆమె తనకు రెగ్యులర్ వ్యక్తి అనే భావన కలిగి ఉంటుంది. అందుకు నేను అభినందిస్తున్నాను. ఎంతగానో ఆరాధిస్తాను. ఆమె అద్భుతమైన నటి. ఇక ఆమెకు నాతో ఎలాంటి ప్రేమ కథ లేదు.. కేవలం నాతో నటించాలని కాకుండా ఆమెకు నచ్చిన కథలను సెలెక్ట్ చేసుకుంటోందని సిద్దార్ట్ క్లారిటీగా వివరణ ఇచ్చారు.

  Prabhas Launched Kalakhar Teaser కళాకార్ టీజర్ లాంచ్ | Rohith
  కియరా ఆలోచన ఏమిటంటే?

  కియరా ఆలోచన ఏమిటంటే?

  ఇక ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో కియారా సిద్ధార్థ్‌ని ఇండస్ట్రీలో తన సన్నిహితులలో ఒకరని తెలిపింది. కియరా మాట్లాడుతూ.. సహనటుడిగా సిద్ధార్థ్ చాలా బాగా ఆలోచిస్తాడు. సరైన ఫోకస్ తో చాలా ప్రిపరేషన్ చేయడానికి ఇష్టపడతాడు. చాలా చదువుతారు. నేను అతనితో సినిమా పనిచేయడానికి ఇష్టపడే విధానానికి ఇది చాలా దగ్గరి పోలిక అని చెప్పవచ్చు. ఆ కోణంలో మేము చాలా బాగా కలిసిపోయాము. స్నేహితుడిగా, అతను పరిశ్రమలో నాకు అత్యంత సన్నిహితులలో ఒకరని నేను చెబుతాను. అంతే కాకుండా సిద్దార్థ్ ఎల్లప్పుడూ సరదాగా ఉంటాడు.. అని కియరా వివరణ ఇచ్చింది.

  English summary
  Sidharth Malhotra about getting married and sweet comments on Kiara Advani,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X