For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sidharth Shukla: పాపం షెహనాజ్, డిసెంబర్లో పెళ్లి..సీక్రెట్ గా నిశ్చితార్థం కూడా?

  |

  నటుడు, బిగ్ బాస్ 13 విన్నర్ సిద్ధార్థ్ శుక్లా తన 40 ఏళ్ళ వయసులో గురువారం (సెప్టెంబర్ 2, 2021) ఉదయాన్నే తీవ్రమైన గుండెపోటుతో మరణించారు. అభిమానులు చాలా కాలంగా సిద్దార్థ్‌ షెహ్నాజ్ గిల్‌ ను వివాహం చేసుకోబోతున్నారు అనే విశ్వసిస్తూ ఉండేవారు. మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అబూ మాలిక్ కూడా ఒక ఇంటర్వ్యూలో ఇద్దరూ ఒకరినొకరు పిచ్చిగా ప్రేమించుకుంటున్నారని, షెహ్నాజ్ సిద్ధార్థ్‌ని పెళ్లి చేసుకోవడానికి ఎదురుచూస్తున్నారని వెల్లడించాడు. అయితే సిద్ధార్థ మరణం తర్వాత ఇప్పుడు వారి పెళ్లికి ముహూర్తం కుదిరిందనే వార్తలు వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే

  పెళ్లి కోసం సర్వం సిద్దం

  పెళ్లి కోసం సర్వం సిద్దం

  సిద్ధార్థ్ మరణం తర్వాత, ఇద్దరి మధ్య సంబంధానికి సంబంధించి కొత్త అప్‌డేట్ వచ్చింది. సిడ్నాజ్ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు తెర మీదకు వచ్చాయి. సోషల్ మీడియాలో సిడ్నాజ్ ఫ్యాన్‌పేజ్‌లో, షహనాజ్ గిల్ యొక్క సన్నిహితుడిని ఉటంకిస్తూ దీని గురించి సమాచారం ఇవ్వబడింది. అదే సమయంలో, సిడ్నాజ్ ఈ ఏడాది డిసెంబర్‌లో వివాహం చేసుకోబోతున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తన నివేదికలో తెలిపింది. ఇద్దరికీ ఇప్పటికే నిశ్చితార్థం జరిగింది. వారు ఇప్పుడు పెళ్లి కోసం సిద్ధమవుతున్నారు అని ఆ కథనంలో పేర్కొంది.

  హోటల్ తో సంప్రదింపులు

  హోటల్ తో సంప్రదింపులు

  ఆ నివేదిక ప్రకారం, పెళ్లి రోజు కోసం బిజీగా ఉన్న తన కుటుంబాలకి ముందే ఇద్దరూ హింట్ ఇచ్చారని, ముంబైలోని ఒక హోటల్‌తో వెన్యూ, విందు మరియు ఇతర సేవలకు సంబంధించి చర్చలు కూడా జరుపుతున్నారని తెలుస్తోంది. అసలు ప్రణాళిక ప్రకారం సిడ్నాజ్ వివాహం 3 రోజుల వేడుకగా జరగాల్సి ఉంది. సిద్ధార్థ్ షహనాజ్ మాత్రమే కాకుండా, వారి రెండు కుటుంబాలు మరియు స్నేహితులు ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచారు. ఈ అన్ని సన్నాహాల మధ్య, సెప్టెంబర్ 2 న సిద్ధార్థ మరణించారనే బాధాకరమైన విషయం బయటకు వచ్చింది.

  చాలా దారుణంగా గిల్ పరిస్థితి

  చాలా దారుణంగా గిల్ పరిస్థితి

  సిద్ధార్థ్ మరణంతో, ఆ కలలన్నీ కల్లలు అయ్యాయని అంటున్నారు. అయితే సిద్ధార్థ్ మరియు షహనాజ్ వివాహం చేసుకోబోతున్నారనే వార్తల్లో ఎంత నిజం ఉందో అధికారికంగా నిర్ధారించబడలేదు. సిద్దార్థ్‌కి తన చివరి వీడ్కోలు ఇస్తున్నప్పుడు షహనాజ్ గిల్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. షెహనాజ్ కన్నీళ్లు ఆపే ప్రయత్నం కూడా ఎవరూ చేయలేకపోయారు.

  హృదయ విదారకంగా

  హృదయ విదారకంగా

  సిద్దార్థ్‌కి అంతిమ వీడ్కోలు ఇవ్వడానికి శ్మశాన వాటికకు చేరుకున్న షహనాజ్ గిల్ పూర్తిగా ఒక రకమైన అపస్మారక స్థితిలో, ఏడుస్తూ ఏడుస్తూ వచ్చారు. షహనాజ్ యొక్క దుస్థితిని చూసి, అభిమానులతో సహా ప్రముఖుల హృదయాలు కూడా హృదయ విదారకంగా మారాయి. షెహనాజ్ దుఖం అందరినీ కలవరపెడుతోంది. సిద్ధార్థ్ మరియు షహనాజ్ ముంబైలో నివసించేవారు. షెహనాజ్ కొన్నిసార్లు సిద్ధార్థ్ ఇంట్లో కూడా ఉండేవారు.

  Recommended Video

  Sidharth Shukla Biography ఆ రాత్రి ఏం జరిగింది.. ప్రేయసి గుండెబద్ధలు || Filmibeat Telugu
  సీక్రెట్ గా నిశ్చితార్థం కూడా?

  సీక్రెట్ గా నిశ్చితార్థం కూడా?


  సిద్దార్థ్ కుటుంబంతో కూడా షహనాజ్‌కు మంచి బంధం ఉంది. నిజానికి వీరికి పెళ్లి అయిపోయిందని కూడా ప్రచారం జరిగింది. అయితే అనేక మీడియా నివేదికలు చెప్పినప్పటికీ తాను షెహ్నాజ్ గిల్‌ని వివాహం చేసుకోలేదని గతంలో సిద్దార్థ్ స్పష్టం చేశారు. బిగ్ బాస్ 13 ఇంటి నుండి సిద్ధార్థ్ శుక్లా మరియు షెహనాజ్ వారి బంధానికి ఫేమస్ అయ్యారు. అయితే వీరికి సీక్రెట్ గా నిశ్చితార్థం కూడా? జరిగిందని అంటున్నా వాటికి ధృవీకరణ అయితే లేదు.

  English summary
  as per reports Sidharth Shukla and Shehnaaz Gill were engaged and planning to get married in December.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X