»   » సన్ ఆఫ్ ఉదిత్ నారాయణ్..ఇంత బలుపా, ఆటోరిక్షాపై బెంజ్ కారు ఎక్కించేశాడు, తీవ్ర గాయాలు

సన్ ఆఫ్ ఉదిత్ నారాయణ్..ఇంత బలుపా, ఆటోరిక్షాపై బెంజ్ కారు ఎక్కించేశాడు, తీవ్ర గాయాలు

Subscribe to Filmibeat Telugu
అతనికి దురుసుతనం కొత్తేమి.. కాదు..!

ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్ కొడుకు ఆదిత్య నారాయణ్ బాధ్యత రాహిత్యంగా కారు నడిపి ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలపాలు కావడానికి కారణం అయ్యాడు. పోలీస్ లు ఆదిత్య నారాయణ్ ని అరెస్ట్ చేసారు. ముంబై లో ఈ ఘటన జరిగింది. సెలెబ్రిటీ కొడుకు కావడంతో అంతలోనే ఆదిత్య నారాయణ్ కు బెయిల్ లభించింది. కాగా ఆదిత్య నారాయణ్ చేసిన ప్రమాదంలో ఆటో రిక్షా డ్రైవర్ మరియు అందులోని లేడి ప్యాసింజెర్ తీవ్ర గాయాలపాలయ్యారు.

ఉదిత్ నారాయణ్ కొడుకుగా

ఉదిత్ నారాయణ్ కొడుకుగా

ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్ కొడుకుగా వారసత్వంలో ఆదిత్య నారాయణ్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆదిత్య నారాయణ్ నటించాడు. ప్రస్తుతం సింగర్ గా, నటుడిగా ఆదిత్య నారాయణ్ బాలీవుడ్ లో రాణిస్తున్నాడు.

 రాష్ డ్రైవింగ్

రాష్ డ్రైవింగ్

తన బెంజ్ కారులో ప్రయాణిస్తున్న ఆదిత్య నారాయణ్ యూ టర్న్ వద్ద కూడా వేగాన్ని అదుపు చేయకుండా ప్రమాదానికి కారణం అయ్యాడు. ఆదిత్య నారాయణ్ రాష్ డ్రైవింగ్ వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

 లేడీ ప్యాసింజర్ వాంగ్మూలం

లేడీ ప్యాసింజర్ వాంగ్మూలం

ఈ ప్రమాదాలో ఆటో రిక్షా డ్రైవర్ తో పాటు, అందులోని లేడీ ప్యాసింజెర్ కూడా గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీస్ లు గాయపడ్డ వారి వాంగ్మూలాన్ని తీసుకుని ఆదిత్య నారాయణ్ పై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

 అరెస్ట్..వెంటనే బెయిల్

అరెస్ట్..వెంటనే బెయిల్

పోలీస్ లు ఆదిత్య నారాయణ్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ వెంటనే అతడి కుటుంబ సభ్యులు బెయిల్ తో వచ్చి ఆదిత్యని విడిపించుకుపోయినట్లు తెలుస్తోంది.

 ఇతగాడికి బాధ్యత రాహిత్యం ఎక్కువే

ఇతగాడికి బాధ్యత రాహిత్యం ఎక్కువే

ఆదిత్య నారాయణ్ భాద్యత రాహిత్యంగా ప్రవర్తించడం ఇదేమి కొత్త కాదు. గత ఏడాది ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించి బుక్కయ్యాడు. మీ అంతు చూస్తాను అంటూ విమానం సిబ్బందిని ఆదిత్య నారాయణ్ బెదిరించిన ఘటన అప్పట్లో కలకలం సృష్టించింది.

English summary
Singer Aditya Narayan Arrested After Car Hits Rickshaw. He gets bail immediately.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu