Just In
- 13 min ago
కమల్ హాసన్ పోస్టర్స్‌పై పేడ కొట్టిన లారెన్స్.. లోక నాయకుడి ఫ్యాన్స్ ఫైర్
- 47 min ago
'అల.. వైకుంఠపురములో': పోటీ పడదామనుకున్న అల్లు అర్జున్.. చివరకు వెనకడుగు.. కొత్త డేట్ ఫిక్స్
- 51 min ago
Lata Mangeshkar Heath Update: ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..
- 1 hr ago
గొప్ప నటుడివి అనుకుంటున్నావా.. మర్యాదగా బయటకు వెళ్లిపో.. రజనీని అవమానించిన నిర్మాత
Don't Miss!
- Sports
త్వరలో పెళ్లి మోగనున్న పెళ్లి బాజాలు: అజహర్ కోడలు కానున్న సానియా మిర్జా చెల్లి
- Lifestyle
ఇటలీ నుండి ఇండియా వరకు సోనియా గాంధీ ప్రస్థానం..
- News
యడ్డీ సర్కార్ సేఫ్, 12 చోట్ల ఆధిక్యం, నిజమైన ఎగ్జిట్ పోల్ అంచనాలు..
- Finance
పీఎం కిసాన్ స్కీం నిధులు కావాలంటే బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేసుకోవాల్సిందే
- Technology
ఇండియాలో 5జీ ప్రాజెక్టును ప్రారంభించిన oneplus
- Automobiles
హోండా యాక్టివా కొంటున్నారా..? అదిరిపోయే ఆఫర్లు మీ కోసం..
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
విషమంగానే గాయని లతా మంగేష్కర్ ఆరోగ్యం.. మరో 10 రోజులపాటు..
ప్రఖ్యాత గాయని, గాన కోకిల లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ఆమెకు చికిత్సనందిస్తున్నారు. నవంబర్ 11వ తేదీన అనారోగ్యంతో లతా మంగేష్కర్ హాస్పిటల్‌లో చేరిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి లతా ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పులు లేని కారణంగా మరికొన్ని రోజులు హాస్పిటల్‌లో వైద్యుల పర్యవేక్షణ అవసరమని కుటుంబ సభ్యులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే..

ఛాతిలో ఇన్‌ఫెక్షన్
లతా మంగేష్కర్‌కు ఛాతిలో ఇన్‌ఫెక్షన్ సోకింది. ఆమెకు ముంబైలోని బ్రీచ్ క్యాండి హాస్పిటల్‌లోని ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. పరిస్థితిలో పెద్దగా మార్పు లేకపోవడం వల్ల మరో 7 నుంచి 10 రోజుల వరకు హాస్పిటల్‌లో ఉంటారు. డాక్టర్ ఫారుఖ్ ఈ ఉద్వాడియా పర్యవేక్షణలో చికిత్స జరుగుతున్నది అని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ఆరోగ్యం మెరుగుపడితే
లతా ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ.. మునుపటి కంటే లతా ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. అభిమానుల ప్రార్థనలు, వైద్యుల కృషితోనే ఆమె త్వరగా కోలుకొన్నారు. ఆమె ఆరోగ్యం మరింత మెరుగుపడితే డిశ్చార్జ్ చేయాలని చూస్తున్నాం. మా ప్రైవసీకి ఎలాంటి భంగం కలుగకుండా మీరంతా తోడుగా ఉన్నందుకు ధన్యవాదాలు అని వారు అన్నారు.

అనూహ్యంగా అనారోగ్యంతో
నవంబర్ 11వ తేదీకి ముందు లతా మంగేష్కర్ చాలా యాక్టివ్‌గా ఉన్నారు. తన మేన కోడలు, నటి పద్మిని కొల్హాపురి నటించిన పానిపట్ సినిమా గురించి ట్వీట్ చేశారు. నమస్కార్. మేరి భాంజీ పద్మిని కొల్హాపురి మంచి నటి. పానిపట్ సినిమాలో నటించిన పద్మినికి, అశుతోష్ చిత్ర యూనిట్‌కు సక్సెస్ లభించాలని వేడుకొంటున్నాను అని లతా ట్వీట్‌లో పేర్కొన్నారు. అలా యాక్టివ్‌గా ఉన్న ఆమె అనూహ్యంగా అనారోగ్యం బారిన పడటం అభిమానులను కలిచి వేసింది.

లతా కెరీర్ గురించి
లతా మంగేష్కర్ 1949లో కెరీర్ ఆరంభించారు. హిందీలో వేలాది పాటలు పాడారు. అంతేకాకుండా అనే భారతీయ భాషల్లోను, విదేశీ భాషలో కూడా అనేక పాటలు పాడారు. ముఖ్యంగా మరాఠీ, హిందీ, బెంగాలీ భాషల్లో ఎక్కువగా తన పాటలను ఆలపించారు. సినీ పరిశ్రమకు చేసిన సేవల గుర్తుగా లతా మంగేష్కర్ కేంద్ర ప్రభుత్వం పలు అవార్డులతోపాటు భారత రత్నను కూడా ప్రధానం చేసింది.