»   » సల్మాన్ ఖాన్‌కు తగిన శాస్తి జరిగింది : కండల వీరుడిపై నటి సంచలనం!

సల్మాన్ ఖాన్‌కు తగిన శాస్తి జరిగింది : కండల వీరుడిపై నటి సంచలనం!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Why Salman Khan Only Convicted..? Karma Gets You In The End..!

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‍‌కు1998 కృష్ణ జింకలను వేటాడిన కేసులో ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ జోధ్‌పూర్ కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో పలువురు బాలీవుడ్ నటులు, అభిమానులు ఆయనకు సపోర్టుగా తమ గళం వినిపిస్తుంటే మాజీ బాలీవుడ్ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ సోఫియా హయత్ మాత్రం సల్లూ భాయ్‌కి తగిన శాస్తి జరిగింది అంటూ సంచలన కామెంట్స్ చేసింది. నేరం చేసిన ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే అని తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నారు.

సల్మాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడటానికి నాకేమీ భయం లేదు

సల్మాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడటానికి నాకేమీ భయం లేదు

నువ్వు చేసిన కర్మకు ఫలితం ఎప్పటికైనా అనుభవించాల్సిందే. చాలా మంది సల్మాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడటానికి భయ పడుతున్నారు. అతడు బాలీవుడ్‌ను కంట్రోల్ చేస్తాడు అనేది చాలా మంది అభిప్రాయం. అలాంటి భయాలే నాకేమీ లేవు. అందుకే నిర్బయంగా నా అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నాను అని సోఫియా హయత్ తెలిపారు.

ఒక బాధ్యత గల స్టార్‌గా నువ్వు చేసేది ఏమిటి?

ఒక బాధ్యత గల స్టార్‌గా నువ్వు చేసేది ఏమిటి?

సినిమా నటులను పిల్లలు, యువతరం నిరతరం పరిశీలిస్తూ, వారిని పాలో అవుతూ ఉంటారు. ఒక బాధ్యత గల స్థానంలో ఉన్న నువ్వు ఇలాంటి నేరాలు చేయడం ద్వారా వారికి ఎలాంటి సందేశం ఇవ్వ దలుచుకున్నావు? సినిమా సెలబ్రిటీ అయినంత మాత్రాన చట్టాలను అతిక్రమింస్తావా? అటవీ జంతువులను చంపుతావా? ఇతర దేశాల్లో అయితే ఇలాంటి పనులు చేస్తే అత్యంత నీచంగా చూస్తారు... అంటూ సోఫియా మండి పడింది.

అందుకే అలాంటివి చేస్తున్నాడు

అందుకే అలాంటివి చేస్తున్నాడు

తను చేసిన తప్పులను కడిగేసుకోవాలనే ఉద్దేశ్యంతో సల్మాన్ సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈ రోజు ఇండియా మొత్తం చూస్తోంది. చట్టానికి ఎవరూ అతీతులు కాదు. నువ్వు ఎంత పెద్ద స్థానంలో ఉన్నా సరే తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే.... అని సోఫియా హయత్ చెప్పుకొచ్చారు.

చాలా మంది డబ్బు బలంతో...

చాలా మంది డబ్బు బలంతో...

ఇండియాలో చాలా మంది యువకులు ఇతరుల నేరాల గురించి పోలీసులకు వెళ్లి చెప్పడానికి భయపడుతున్నారని నేను విన్నాను. కొందరు తమ డబ్బు, పలుకుబడి ఉపయోగించి ఎలా బయటకు వస్తున్నారో రోజూ టీవీల్లో చూపిస్తూనే ఉన్నారు... అన సోఫియా హయత్ తెలిపారు.

నా విషయంలోనూ జరిగింది

నా విషయంలోనూ జరిగింది

ఇలాంటి సంఘటన నా విషయంలో కూడా జరిగింది. అర్మాన్ కోహ్లి నా లాయర్లను కొనేసి నేను కేసులో కంటిన్యూ కాకుండా చేశారు. డాలీ బింద్రా కూడా నాతో చెప్పారు అర్మాన్ ఫ్యామిలీ చాలా పరవ్‌ఫుల్ నిన్ను ఏదో ఒక కేసులో నన్ను ఇరికించి జైలుకు పంపిస్తారని భయపెట్టారు. దీంతో నేను అపుడు కేసు వెనక్కి తీసుకోక తప్పలేదు అని సోఫియా హయత్ తెలిపారు. కానీ ఈ రోజు ఇండియాలో అలాంటి పరిస్థితి లేదు. నేరం చేసిన వ్యక్తి ఎంతటి పెద్దవాడైనా, ఎంత డబ్బున్నా శిక్షార్హులే అని తేలిపోయింది అని సోఫియా హయత్ తెలిపారు.

English summary
"Karma gets you in the end...Many people are afraid to talk against Salman because they think he controls Bollywood. Well, I no longer serve my ego and therefore am not afraid to speak up. I am so happy that Salman has gone to jail for what he has done. Animals are so important to this planet and doing what he did and then mocking it was a huge act of his own self importance." sofia hayat said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X