twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కంటిచూపు మందగించింది.. బాధను పంచుకొన్న సొనాలి బింద్రే

    |

    బాలీవుడ్ ముద్దుగుమ్మ సొనాలి బింద్రే క్యాన్సర్ బారిన పడ్డారనే వార్త సినీ, ప్రేక్షక లోకాన్ని షాక్ గురి చేసింది. తాను క్యాన్సర్ వ్యాధికి గురైన మనోస్థైర్యం కోల్పోకుండా దానిని ధీటుగా ఎదురిస్తూ ముందుకు సాగుతున్నది. తాజాగా కెమోథెరపీ ట్రీట్‌మెంట్ తన ఆరోగ్యంపై చూపిన ప్రభావాన్ని ఇన్స్‌ట్రాగ్రామ్ ద్వారా వెల్లడించింది. తన ఆరోగ్యం, జరుగుతున్న చికిత్స గురించి ఎప్పటికప్పుడూ సోషల్ మీడియా ద్వారా పంచుకొంటున్న సంగతి తెలిసింది. తాజాగా పలు ఆసక్తికరమైన విషయాలను ఆమె వెల్లడించారు. సోనాలి వెల్లడించిన విషయాలు ఏమిటంటే..

    మంచి పుస్తకం చదివాను

    మంచి పుస్తకం చదివాను

    నేను ఈ మధ్య ఓ మంచి పుస్తకాన్ని చదివాను. సాధారణంగా అయితే నేను చాలా త్వరగా పుస్తకాలు చదవడం పూర్తి చేస్తాను. కెమోథెరపీ కారణంగా నా కంటి చూపు మందగించింది. అందుకే ఆలస్యంగా పుస్తకాన్ని చదివాను. చదవడానికి చాలా కష్టపడ్డాను. కొంత ఆందోళనకు గురైనా.. ప్రస్తుతం నా కంటిచూపు కొంత మెరుగుపడింది అని సొనాలి బింద్రే పేర్కొన్నారు.

    పుస్తకం బాగున్నదని..

    పుస్తకం బాగున్నదని..

    న్యూయార్క్‌లో హన్యా యనగిహరా అనే రచయిత రాసిన ‘ఏ లిటిల్ లైఫ్' అనే పుస్తకాన్ని చదివాను. ఈ పుస్తకం ఎన్నో సాహిత్య సంబంధింత అవార్డులకు నామినేట్ అయింది. స్నేహం, లక్ష్యం నేపథ్యంగా రచయిత పుస్తకాన్ని చక్కగా రాశారు. నన్ను చాలా ఆకట్టుకొన్నది అని సొనాలి ఇన్స్‌టాగ్రామ్‌లో చెప్పారు.

    స్నేహం, లక్ష్యాలపై రచయిత పుస్తకం

    స్నేహం, లక్ష్యాలపై రచయిత పుస్తకం

    మహిళల నేపథ్యంగా స్నేహంపై ఎన్నో పుస్తకాలు చదివి ఉంటాంం. కానీ అబ్బాయిలు, పురుషుల స్నేహం ఆధారంగా వెలువడిన పుస్తకాన్ని నేను తొలిసారి చదివాను. చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంది. మీరు కూడా చదవండి.. తప్పకుండా నచ్చుతుంది అని సోనాలి వెల్లడించారు.

    సోనాలిపై రచయిత ప్రశంసలు

    సోనాలిపై రచయిత ప్రశంసలు

    ‘ఏ లిటిల్ లైఫ్' పుస్తకాన్ని చదివి తన ఇన్స్‌టాగ్రామ్‌లో సోనాలి పోస్ట్ చేసిన అభిప్రాయంపై స్వయంగా రచయిత హన్యా స్పందించారు. ఇప్పటికే ఎందరికో మీరు స్ఫూర్తిగా, ప్రేరణగా నిలిచారు. మీ స్పిరిట్‌ను అలానే కొనసాగించండి. మీ మనోస్థైర్యానికి, మీ అందానికి నేను అభిమానినే. క్యాన్సర్‌ను ఎదురిస్తున్న తీరును అభినందించలేకపోతున్నాను. ఎందరో మహిళలకు, పురుషుల్లో మనోస్థైర్యాన్ని నింపడమే కాకుండా స్పూర్తిగా నిలుస్తున్నారు అని రచయిత హన్యా పేర్కొన్నారు.

    ప్రియాంకా చోప్రా పెళ్లి వేడుకల్లో

    ప్రియాంకా చోప్రా పెళ్లి వేడుకల్లో

    ఇదిలా ఉండగా, ప్రియాంక చోప్రా పెళ్లి వేడుకల్లో సొనాలి మెరిసారు. ఎరుపు రంగు దుస్తుల్లో ఆకట్టుకొన్నారు. రణ్‌బీర్ కపూర్ తల్లి నీతూ కపూర్‌, ప్రియాంక చోప్రాతో కలిసి దిగిన ఫొటోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రియాంకా చోప్రా దాంపత్య జీవితం గొప్పగా సాగాలని ఆమె ఆకాంక్షించారు.

    English summary
    “Time to announce the next book! She wrote in Instagaram, I read a book A Little Life by hanyayanagihara. It’s been nominated for so many literary awards and is a story of friendship and ambition. She also mentioned in the post how chemotherapy had made her eyesight weak.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X