సోనమ్ పెళ్లి సరేసరే.. పాపం హనీమూన్‌కే అనేక అడ్డంకులు..
సోనమ్ కపూర్, ఆనంద్ అహుజా పెళ్లికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. సినీ ఇండస్ట్రీలో సోనమ్ పెళ్లి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. చిరకాల స్నేహితుడు ఆనంద్ అహుజాను మే 8 తేదీన వివాహం చేసుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లికి ప్రముఖ డిజైనర్లు ప్రత్యేకంగా పెళ్లి దుస్తులను డిజైన్ చేస్తున్నారు. అనామిక ఖన్నా, అబు జానీ-సందీప్ ఖోస్లా, అనురాధ వకీల్ డిజైన్ చేస్తున్నారు. అత్యంత వైభవంగా వీరి వివాహాన్ని నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

రెండు రోజుల పెళ్లి
సోనమ్ పెళ్లి రెండు రోజులపాటు ఘనంగా జరిగేలా చేస్తున్నారు. మే 7 తేదీన మెహందీ, సిక్కు మత సంప్రదాయం ప్రకారం మే 8న ఓ కార్యక్రమం జరుగుతుంది. ప్రధానమైన పెళ్లి కార్యక్రమం ముంబైలోని బంద్రాలోని రాక్ డేల్‌లో ఓ కార్యక్రమం కూడా జరుగుతుంది. అక్కడే మధ్యాహ్న విందును ఏర్పాటు చేశారు.

ఆసక్తికరమైన కథనం
అయితే సోనమ్, ఆనంద్ వివాహానికి ఏర్పాట్లు చకచకా జరుగుతుంటే ఓ ఆసక్తికరమైన కథనం బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అదేమిటంటే..

మే 14న కేన్స్ ఫెస్టివల్‌కు సోనమ్
సోనమ్, ఆనంద్ హానీమూన్ ఆలస్యం కానున్నదట. పెళ్లి తర్వాత మే 14న జరిగే కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు సోనమ్ హాజరుకానున్నారు. అయితే ఈ కార్యక్రమానికి సోనమ్ వెంట ఆనంద్ వెళ్లడం లేదట.

వీర్ దే వెడ్డింగ్ ప్రమోషన్
కేన్స్ ఫెస్టివల్ నుంచి వెనుకకు వచ్చిన తర్వాత తాను నటించిన వీర్ దే వెడ్డింగ్ ప్రమోషన్‌లో బిజీగా ఉంటారు. ఆ తర్వాత ఏక్ లడికీ కో దేఖా తో ఐసా లగా చిత్రంలో పాల్గొంటారు. ఇలాంటి కారణాల వల్ల సోనమ్, ఆనంద్ హానీమూన్ వెళ్లడం జూన్ గానీ జూలైలో గానీ జరిగే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications











