»   » సోనమ్ కపూర్ మెహందీ: అతిధులుగా వచ్చేది వీళ్ళే.. డాన్స్‌తో అదరగొట్టబోతున్న జాన్వీ!

సోనమ్ కపూర్ మెహందీ: అతిధులుగా వచ్చేది వీళ్ళే.. డాన్స్‌తో అదరగొట్టబోతున్న జాన్వీ!

Subscribe to Filmibeat Telugu
Sonam Kapoor's Mehendi Function

బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ వివాహ వేడుకకు వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కపూర్ ఫ్యామిలీ నుంచి అనిల్ కపూర్ వారసురాలిగా వచ్చిన సోనమ్ పలు బాలీవుడ్ చిత్రాలతో అలరించింది. ఈ 32 ఏళ్ల అందగత్తె గత కొంతకాలంగా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహుజాతో ప్రేమలో ఉన్నట్లు వచ్చిన వార్తలు నిజమయ్యాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, అతిధుల సమక్షంలో ఈ జంట మే 8 న ఒక్కటి కాబోతోంది.కాగా నేడు అనిల్ కపూర్ నివాసంలో జరగబోయే మెహందీ వేడుకకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాలీవుడ్ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.

వైభవంగా ఏర్పాట్లు

వైభవంగా ఏర్పాట్లు

మే 7 సాయంత్రం 4 గంటల నుంచి సోనమ్ కపూర్ మెహందీ వేడుక మొదలు కాబోతోంది. ఇప్పటికే అనిల్ కపూర్ కుటుంబ సభ్యులు అర్జున్ కపూర్, అన్షులా, జాన్వీ కపూర్, ఖుషి హాజరైనట్లు తెలుస్తోంది.

 అతిధులు వీళ్ళే

అతిధులు వీళ్ళే

ఇక అనిల్ కపూర్ కుటుంబ సభ్యులు కాకుండా బాలీవుడ్ సినీ ప్రముఖలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. కరణ్ జోహార్, రణవీర్ సింగ్, రణబీర్ కపూర్, వరుణ్ ధావన్, జాక్వెలిన్ హాజరవుతారని సమాచారం.

డాన్స్‌తో అదరగొట్టబోతున జాన్వీ

డాన్స్‌తో అదరగొట్టబోతున జాన్వీ

మెహందీ వేడుకలో జాన్వీ కపూర్ డాన్స్ పెర్ఫామెన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీదేవి పాటలలో కొన్నింటికి ఆమె స్టెప్పులు వేయబోతోందట.

ఫోటోలు వైరల్

ఫోటోలు వైరల్

సోనమ్ కపూర్ వివాహ వేడుక ఏర్పాట్లకు సంబందించిన కొన్ని ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సోనమ్ కపూర్, ఆనంద్ కొంత కాలంగా క్లోజ్ గా ఉంటున్నారు. కానీ వీరి రిలేషన్ గురించి ఎప్పుడూ మీడియా ముందు మాట్లాడలేదు.

English summary
Sonam Kapoor and Anand Ahuja’s mehendi. Bolllywood celebritis will attend the event
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X