పెళ్లి ఏర్పాట్లు షురూ.... సోనమ్ కపూర్ కాబోయే భర్త గురించి ఆశ్చర్యపరిచే విషయాలు!

By Bojja Kumar

బాలీవుడ్లో మరో భారీ పెళ్లి వేడుకకు రంగం సిద్ధమవుతోంది. బాలీవుడ్ అగ్ర నటుడు అనిల్ కపూర్ కూతురు, హీరోయిన్ సోనమ్ కపూర్ త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది. సోనమ్ వివాహం బాయ్ ఫ్రెండ్ ఆనంద్ ఆహుజాతో జరుగనుంది. మే నెలలో వీరి వివాహం జరుగనుందని తెలుస్తోంది. అయితే పెళ్లి డేట్ ఎప్పుడు అనేది ఇంకా అఫీషియల్‌గా ప్రకటించక పోయినప్పటికీ ముంబైలోని సోనమ్ కపూర్ నివాసం విద్యుత్ దీపాలతో అలంకరించడంతో పెళ్లి ఏర్పాట్లు మొదలైనట్లు ప్రచారం మొదలైంది.

పెళ్లి పనుల్లో బిజీ బిజీగా కపూర్ ఫ్యామిలీ

పెళ్లి పనుల్లో బిజీ బిజీగా కపూర్ ఫ్యామిలీ

కపూర్ ఫ్యామిలీ మొత్తం వెడ్డింగ్ ప్రిపరేషన్స్‌లో బిజీ అయ్యారు. బట్టలు, నగలు షాపింగ్ చేస్తూ బిజీగా గడపటంతో పాటు సంగీత్ డాన్స్ రిహార్సల్స్ చేస్తున్నారు. ఈ వివాహ వేడుక సోనమ్ జీవితంలో ఒక మెమొరబుల్‍‌ డేగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

 కలర్‌ఫుల్‌గా మారిన అనిల్ కపూర్ నివాసం

కలర్‌ఫుల్‌గా మారిన అనిల్ కపూర్ నివాసం

ముంబైలోని అనిల్ కపూర్ నివాసాన్ని శుక్రవారం విద్యుత్ దీపాలతో అలంకరించారు. సోనమ్ కపూర్ తల్లి సునితా ఇందుకు సంబంధించిన పనులు దగ్గరుండి చూసుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

 సోనమ్ ఇంట్లో సినీ ప్రముఖుల సందడి

సోనమ్ ఇంట్లో సినీ ప్రముఖుల సందడి

సోనమ్ కపూర్ ఇంటికి పలువురు బాలీవుడ్ సినీ సెలబ్రిటీలు వచ్చి పోతుండటంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. కరణ్ జోహార్, పరా ఖాన్, మోహిత్ మార్వా, అంతరా మోతివాలా తదితరులు కపూర్ ఇంటిని సందర్శించారు. దీంతో పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి అనే విషయం స్పష్టమయింది.

వెడ్డింగ్ కార్డ్స్ లేకుండానే....

వెడ్డింగ్ కార్డ్స్ లేకుండానే....

సోనమ్-ఆనంద్ ఆహుజా పెళ్లి వేడుకకు సంబంధించి అసలు వెడ్డింగ్ కార్డ్స్ అచ్చు వేయించడం లేదట. పేపర్ సేవ్ చేద్దామనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారట. వాటి స్థానంలో డిజిటల్ వెడ్డింగ్ కార్డ్స్ ప్లాన్ చేస్తున్నారు. వాటిని నేరుగా అతిథుల ఫోన్లకు పంపనున్నారని టాక్.

భారీ ఖర్చు లేకుండానే

భారీ ఖర్చు లేకుండానే

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సోనమ్ కపూర్ మాట్లాడుతూ... విదేశాల్లో భారీగా ఖర్చు పెట్టి వివాహం చేసుకోవాలనే ఆలోచన లేదని, సింపుల్‌గా ఇండియాలోనే చేసుకుంటానని సోనమ్ కపూర్ వెల్లడించారు.

ఆనంద్ ఆహుజా గురించి ఆశ్చర్య పరిచే విషయాలు

ఆనంద్ ఆహుజా గురించి ఆశ్చర్య పరిచే విషయాలు

ఢిల్లీ వ్యాపారవేత్త హరీశ్‌ అహూజా కుమారుడు ఆనంద్‌ ఆహుజా. ఇండియాలోని అతిపెద్దదైన ‘షాహీ ఎక్స్‌పోర్ట్స్‌' కంపెనీ ఆహుజా ఫ్యామిలీ రన్ చేస్తోంది. ఆనంద్ ఆహుజా కుటుంబ ఆస్తుల విలువ రూ.3వేల కోట్లు ఉంటుందట. ఢిల్లీలోని అమెరికన్‌ ఎంబసీ స్కూల్‌, ఆపై అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా, వార్టన్‌ బిజినెస్‌ స్కూల్‌ ఆహుజా చదువుకున్నారు. చదువు పూర్తయిన తర్వాత అమేజాన్‌లో స్పోర్ట్స్‌వేర్‌ బ్రాండ్లకు ప్రొడక్ట్‌ మేనేజర్‌గా చేశారు.

నాలుగేళ్లుగా ప్రేమాయణం

నాలుగేళ్లుగా ప్రేమాయణం

2014లో ప్రేరణా అనే స్నేహితురాలి ద్వారా ఆనంద్‌- సోనమ్‌ మధ్య పరిచయం ఏర్పడింది. ముందు ఆనంద్ ప్రపోజ్ చేశాడట, అతడు ప్రపోజ్ చేసిన కొన్ని నెలలకు సోనమ్ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అప్పటి నుండి ఇద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోంది.

గెస్ట్ లిస్ట్...

గెస్ట్ లిస్ట్...

సోనమ్-ఆనంద్ పెళ్లి వేడుకకు బాలీవుడ్ నుండి ప్రముఖులు హాజరు కాబోతున్నారు. తన కజిన్స్ అర్జున్, జాహ్నవి, ఖుషి, అన్షులాతో పాటు తన బెస్ట్ ఫ్రెండ్ జాక్వెలిన్, వీరేది వెడ్డింగ్ కో యాక్టర్స్ స్వర భాస్కర్, కరీనా కపూర్, రణబీర్ కపూర్, రణవీర్ సింగ్, దీపిక పదుకోన్, వరుణ్ ధావన్, కరణ్ జోహార్, సైఫ్ అలీ ఖాన్, కరిష్మా కపూర్ తదితరులు పెళ్లి వేడుకలో సందడి చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X