twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దర్శకుడిపై మీటూ ఆరోపణలు నిజం కాకపోతే? సోనమ్ కపూర్ ఏమన్నారంటే..

    |

    ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్‌కు గురి చేసింది. పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో తనను వేధించాడని 'సంజు' చిత్రానికి పని చేసిన ఓ మహిళ ఆయనపై ఈ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

    ఈ ఆరోపణల ఎఫెక్టుతో సోనమ్ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా' సినిమా పోస్టర్ నుంచి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న హిరానీ పేరు తొలగించారు. ఈ విషయమై సోనమ్ కపూర్ స్పందించారు.

    అప్పుడు అందరినీ నమ్మాను, కానీ...

    అప్పుడు అందరినీ నమ్మాను, కానీ...

    మీటూ ఉద్యమంలో నేను మహిళలను నమ్మాను. కానీ హిరానీ విషయంలో మన జడ్జిమెంటును రిజర్వ్ చేసుకోవాలి. ఇక్కడ రెండు విషయాలున్నాయి. ఇక్కడ ఉద్యమం కంటే సినిమా ముఖ్యం. నాకు హిరానీ చాలా సంవత్సరాలుగా తెలుసు. ఫిల్మ్ మేకర్‌గా, వ్యక్తిగా ఆయనపై గౌరవం ఉంది అన్నారు సోనమ్.

    ఆరోపణలు నిజం కాకపోతే...

    ఆరోపణలు నిజం కాకపోతే...

    నా సినిమా విడుదలైన తర్వాత ఈ అంశంపై పూర్తిగా మాట్లాడతాను. కానీ ఈ ఆరోపణలు నిజం కాకపోతే మీటూ ఉద్యమం పట్టాలు తప్పినట్లే అవుతుందని సోనమ్ వ్యాఖ్యానించారు. సోనమ్ వ్యాఖ్యలు చూస్తుంటే... హిరానీకి ఆమె పూర్తి మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది.

    హిరానీకి పెరుగుతున్న మద్దతు

    హిరానీకి పెరుగుతున్న మద్దతు

    ఈ వివాదంలో హిరానీకి ఇండస్ట్రీ ప్రముఖులు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ నుంచి మద్దతు లభిస్తోంది. అర్షద్ వర్షి, కరిష్మా తన్నా, శర్మాన్ జోషి తదితరులు ఆయన అలాంటి వ్యక్తి కాదంటూ ఇప్పటికే ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే.

    లీగల్‌గా ప్రొసీడ్ అవుతున్న హిరానీ

    లీగల్‌గా ప్రొసీడ్ అవుతున్న హిరానీ

    కాగా... తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై రాజ్ కుమార్ హిరానీ లీగల్‌గా ముందుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తాను ఎవరినీ వేధించలేదని, తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. మొత్తానికి ఈ వ్యవహారం ఆయనపై ఉన్న క్లీజ్ ఇమేజ్‌కు కలంకం తెచ్చిందని చెప్పక తప్పదు.

    English summary
    Rajkumar Hirani was accused of sexual harassment, by a woman crew member during the making of Sanju. Owing to these allegations, Hirani's name was dropped from the poster of Ek Ladki Ko Dekha Toh Aisa Laga. When asked about this at an event, Sonam Kapoor who plays the female lead in the film, said, "In the Me Too movement, I always believe a woman. But in this case, we need to reserve our judgment."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X