For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నా భర్తతో ఉండలేకపోతున్నా, మీరేదైనా: మహిళ ఫిర్యాదుకు సోనుసూద్‌ దిమ్మతిరిగే జవాబు

  |

  కరోనావైరస్ కారణంగా దారుణమైన పరిస్థితులు వెంటాడుతున్న తరుణంలో బాలీవుడ్ నటుడు సోనుసూద్ వలస కార్మికులను ఆదుకొంటున్న తీరు అందర్ని ఆకట్టుకొంటున్నది. తమ సొంత గ్రామాలకు, పట్టణాలకు దూరంగా ఇతర ప్రాంతాల్లో చిక్కకున్న వలస కార్మికులను తన సొంత ఖర్చులతో బస్సులు, విమానాలు ఏర్పాటు చేసి తరలించడంపై అన్ని వర్గాల ప్రజల మనసును గెలుచుకొన్నాడు.

  Sonu Sood Has The Best Solution’ As Woman Complains About Her Husband

  ఇలా తన వంతు సహాయం చేస్తున్న సోనుసూద్‌కు ఓ గమ్మత్తైన ప్రశ్నలు నెటిజన్ల నుంచి వస్తున్నాయి. అయితే వాటికి తనదైన రీతిలో సమయస్పూర్తిని ప్రదర్శిస్తూ సమాధానాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో గమ్మత్తైన ప్రశ్న మహిళల నుంచి రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే..

  సామాన్య ప్రజల కష్టాలు..

  సామాన్య ప్రజల కష్టాలు..

  సామాన్య ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావిస్తున్న సూను సూద్‌కు కొందరు నెటిజన్లు గమ్మత్తైన సహాయాన్ని ఆర్థించారు. కొందరు మద్యం కావాలని, మరికొందరు సెలూన్ సౌకర్యం కావాలనే ప్రశ్నలు సూనుసూద్‌ను పలకరించాయి. అలాంటి వాటికి తనదైన రీతిలో స్పందించారు. ఇలాంటి వాటికి చాలా ఓపికగా సమాధానాలు ఇస్తున్నారు. దాంతో నెటిజన్లకు కూడా హుషారు కలిగించే జవాబులను పోస్టు చేస్తున్నారు.

  పుట్టిన బిడ్డకు సోనుసూద్ పేరు

  పుట్టిన బిడ్డకు సోనుసూద్ పేరు

  ఇక సోను సూద్ చేసిన సహాయానికి ఓ మహిళ తనకు పుట్టిన బిడ్డకు పేరు పెట్టుకోవడం అందర్నీ ఆకట్టుకొన్నది. గర్భవతి అయిన ఓ వలస కార్మికురాలిని తన ఇంటికి క్షేమంగా సోనుసూద్ చేర్చడం జరిగింది. దానికి కృతజ్తతగా ఆమె తన బిడ్డకు సోనుసూద్ పేరు పెట్టుకొని తన ప్రేమను, అభిమానాన్ని చాటుకొన్నారు. అయితే తన పేరు పెట్టుకోవడంపై స్పందిస్తూ.. మీరు శ్రీవాస్తవ్ అయితే సోనుసూద్ అని ఎలా పెట్టుకొంటారంటే.. దానికి మా అబ్బాయి పేరు సోనుసూద్ శ్రీవాస్తవ్ అని పెట్టుకొన్నామని ఆ దంపతులు వెల్లడించడంతో సోను ఆనందంలో మునిగిపోయారు.

  నా భర్తతో ఉండలేకపోతున్నాను.. అని

  నా భర్తతో ఉండలేకపోతున్నాను.. అని

  ఇక తాజాగా సోనుసూద్‌కు ఓ మహిళ తన కోరిక తీర్చాలంటూ ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టారు. సోనుసూద్ నేను జనతా కర్ఫ్యూ నుంచి ఇప్పటి వరకు నా భర్తతోనే ఉంటున్నాను. ఆయనతో ఉండటం కష్టంగా ుంది. వీలైతే ఆయనను ఎక్కడికైనా లేదా నన్ను నా తల్లిగారి ఇంటికి పంపించండి. ఇంతకంటే నేను ఎక్కువ మిమ్నల్ని అడుగలేను అని ఓ నెటిజన్ ట్వీట్ ద్వారా సహాయం అందించాలని కోరారు.

  మహిళకు సోనుసూద్ జవాబు

  మహిళకు సోనుసూద్ జవాబు

  ట్విట్టర్‌లో మహిళ చేసిన రిక్వెస్ట్‌పై సోనుసూద్ స్పందిస్తూ.. నా దగ్గర మంచి ప్లాన్, ఐడియా ఉంది. మీ ఇద్దరిని కలిపి గోవాకు పంపిస్తాను. ఏమంటారు అని సోను సూద్ తనదైన శైలిలో తెలిపారు. అయితే సోనుసూద్ జవాబుకు నెటిజన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

  ఇది నాకు ఎమోషనల్ జర్నీ అంటూ..

  ఇది నాకు ఎమోషనల్ జర్నీ అంటూ..

  ఇక తాజా పరిస్థితులపై సోనుసూద్ స్పందిస్తూ.. వలస కార్మికుల కష్టాల్లో భాగం పంచుకోవడం చాలా సంతృప్తిగా ఉంది. నా జీవితంలో ఎమోషనల్ జర్నీ కొనసాగుతున్నది. చివరి వలస కార్మికుడిని ఇంటికి చేర్చడమే నా లక్ష్యం అంటూ సోనుసూద్ అన్నారు. ఇలాంటి సేవను భుజానికెత్తుకోవడం నాకు, నా హృదయానికి మంచి ఫీలింగ్‌ను అందిస్తున్నది అని సోనుసూద్ చెప్పారు.

  English summary
  Bollywood Actor Sonu Sood has been helping migrants to shift for their home. In this occassion, Sonu Sood gets quirky requests from Women fan. She tweeted that, SonuSood I am staying with my husband from Janta Curfew to lock down 4. Can u either send him or send me to my mother's house, as I can't stay with him any more.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X