twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీదేవి మరణం తర్వాత.. అది అసాధ్యం.. అలా చేస్తే పిచ్చిపనే!

    By Rajababu
    |

    హిందీలో 30 ఏళ్ల క్రితం రూపొందిన మిస్టర్ ఇండియా చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయ ఢంకా మోగించింది. శ్రీదేవి నటనకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. శ్రీదేవి మరణానికి ముందు మిస్టర్ ఇండియాకు సీక్వెల్ రూపొందించాలని నిర్మాత బోనికపూర్ నిర్ణయం తీసుకొన్నారు. శేఖర్ కపూర్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ ఇండియాకు సీక్వెల్ అనగానే ఈ తరం ప్రేక్షకులకు మంచి జోష్ వచ్చింది.

    మిస్టర్ ఇండియా సీక్వెల్‌ ప్లాన్

    మిస్టర్ ఇండియా సీక్వెల్‌ ప్లాన్

    మిస్టర్ ఇండియా సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు బోనికపూర్ చకచకా ప్లానింగ్ చేశారు. దర్శకుడు శేఖర్ కపూర్‌తో సంప్రదింపులు జరిపారు. అంతా సవ్యంగా సాగిపోతుందనుకొంటున్న సమయంలో అనూహ్యంగా శ్రీదేవి మృత్యువాత పడ్డారు.

    శ్రీదేవి మరణం తర్వాత

    శ్రీదేవి మరణం తర్వాత

    శ్రీదేవి మరణం తర్వాత బోనికపూర్ విషాదంలో కూరుకుపోయారు. మిస్టర్ ఇండియా సీక్వెల్ పనులు ఆగిపోయాయి. అయితే అందాల అభినేత్రి లేకుండా సీక్వెల్ కుదరదని బోనికపూర్ ఆ ప్రాజెక్ట్‌ను నిలిపివేశాడట.

    శ్రీదేవి లేకుండా

    శ్రీదేవి లేకుండా

    శ్రీదేవి లేకుండా మిస్టర్ ఇండియాకు సీక్వెల్ రూపొందించడం ఓ పిచ్చిపని. నర్గీస్ లేకుండా మదర్ ఇండియా తీసినట్టు... తాజ్ మహల్ లేకుండా ఆగ్రా ఉంటే ఎవరైనా ఒప్పుకొంటారా? అని శ్రీదేవి సన్నిహితులు పేర్కొన్నారు.

    ఆ ఇద్దరు లేకుండా అసాధ్యం

    ఆ ఇద్దరు లేకుండా అసాధ్యం

    మిస్టర్ ఇండియా అంటే ముందుగా గుర్తొచ్చేది అనిల్ కపూర్, అమ్రిష్ పురి, శ్రీదేవి. ఆ ముగ్గురిలో ఇద్దరు మన మధ్య లేరు. వారు లేకుండా వెండితెర మీద మ్యాజిక్ సృష్టించడం అసాధ్యం అని బోని సన్నిహితులు అభిప్రాయపడ్డారు.

    సీక్వెల్ తీయడం అసమంజసమే

    సీక్వెల్ తీయడం అసమంజసమే

    మిస్టర్ ఇండియా సీక్వెల్‌కు సంబంధించి ఏ జరుగుతుందో నాకు తెలియదు. శ్రీదేవి మరణం తర్వాత బోని ఏం ఆలోచిస్తున్నాడో. ఇప్పుడు సీక్వెల్ రూపొందించడం కూడా అసమంజసమే అని శేఖర్ కపూర్ పేర్కొన్నారు.

    English summary
    Sridevi's untimely death in February this year, buzz has it that the plans of making Mr India sequel have been shelved by Boney Kapoor. Reports suggest that It makes no sense to have a sequel without Sridevi. Its like Mother India without Nargis, Or Agra without the Taj Mahal.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X