twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోలు గుర్తుంటారు, మరణం లేనివారే లెజెండ్స్: శ్రీదేవి జ్ఞాపకాలతో బోనీ కన్నీళ్లు

    By Bojja Kumar
    |

    శ్రీదేవి మరణం కేవలం ఆమె కుటుంబ సభ్యులనే కాదు, యావత్ భారత దేశ వ్యాప్తంగా ఉన్న అభిమానులను విషాదంలోకి నెట్టివేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 24న దుబాయ్‌ హోటల్‌లోని బాత్ టబ్‌లో ప్రమాద వశాత్తు పడిపోయి మరణించిన ఈ అతిలోక సుందరి ఇక లేదు అనే చేదు నిజాన్ని ఇప్పటికీ కొందరు అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. నేడు (ఆగస్టు 13) శ్రీదేవి పుట్టిన రోజు. అతిలోక సుందరి మరణం తర్వాత వచ్చిన తొలి జయంతి ఇది. ఈ సందర్భంగా తన భార్య గురించి బోనీ కపూర్ తలుచుకుని కన్నీటి పర్యంతమైన తీరు కలిచి వేసింది.

    Recommended Video

    శ్రీదేవి పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు తెలియని ఆసక్తికర అంశాలు
    లెజెండ్స్‌కు మరణం లేదు

    లెజెండ్స్‌కు మరణం లేదు

    తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి గురించి గుర్తు చేసుకుంటూ బోనీ కపూర్ ఎమోషనల్ అయ్యారు. ఇండస్ట్రీలో హీరోస్ ఉంటారు, లెజెండ్స్ ఉంటారు. అందరికీ గుర్తుండే వారు హీరోలు... మరణం లేని వారు లెజెండ్స్. శ్రీదేవి ప్రతీ రోజూ మా జ్ఞాపకాల్లో జీవించే ఉంది. ఆమెను ప్రతిక్షణం గుర్తు చేసుకుంటూనే ఉన్నామని తెలిపారు.

    18 అడుగుల శ్రీదేవి పేయింటింగ్

    18 అడుగుల శ్రీదేవి పేయింటింగ్

    శ్రీదేవి పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్ ఆర్ట్ ప్రాజెక్ట్ 18 అడుగులు భారీ పెయింటింగును ఏర్పాటు చేస్తున్నారు. చాపెల్ రోడ్‌లోని బిల్డింగ్ వాల్ మీద ఈ పెయింటింగ్ దర్శమివ్వబోతోంది. ఈ ప్రాజెక్టులో రంజిత్ దహియా, కునాల్ దహియా, బిదిషా విశ్వాస్, అరుషు, రిచా తదితర ఆర్టిస్టులు ఇన్వాల్వ్ అయ్యారు. శ్రీదేవి నటించిన గురుదేవ్ అనే చిత్రంలోని లుక్‌తో ఈ పెయింటింగ్ అభిమానులకు కనువిందు చేయబోతోంది.

     కృతజ్ఞతలు తెలిపిన బోనీ

    కృతజ్ఞతలు తెలిపిన బోనీ


    ఈ సందర్భంగా ఈ పెయింట్ ఏర్పాటు చేసిన వారికి బోనీ కృతజ్ఞతలు తెలిపారు. మా కుటుంబం దీన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.

    శ్రీదేవి

    శ్రీదేవి

    శ్రీదేవి ఆగస్టు 13, 1963న జన్మించింది. బాల నటిగా కన్దన్ కరుణై (1967) అనే తమిళ చిత్రంతో కెరీర్ మొదలు పెట్టిన శ్రీదేవి సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. అనంతరం బాలీవుడ్లో అడుగు పెట్టి అక్కడ కూడా తన సత్తా చాటింది. దేశంలోనే టాప్ హీరోయిన్‌గా కొంతకాలం తన హవా కొనసాగించింది.

    English summary
    Sridevi’s untimely death in February left a nation shocked. On the eve of her birth anniversary, Boney Kapoor spoke to Pinkvilla and said, “There are heroes and then there are legends, heroes get remembered but legends never die. Sri lives with us every day not a minute goes by when we don’t miss her.” Today Sridevi’s first birthday after her death.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X