»   » వైరల్ : అందం కోసం ఇంజక్షన్లు తీసుకుంటారా? శ్రీదేవి ఇచ్చిన సమాధానం!

వైరల్ : అందం కోసం ఇంజక్షన్లు తీసుకుంటారా? శ్రీదేవి ఇచ్చిన సమాధానం!

Subscribe to Filmibeat Telugu

వెండి తెరపై ఎక్కువకాలం నిత్య యవ్వనంగా కనిపించిన నటి శ్రీదేవి. శ్రీదేవి నటన అన్నా, ఆమె అందం అన్నా వెర్రెత్తిపోయే అభిమానులు ఉన్నారు. అతిలోక సుందరి లాంటి ఆమె ముగ్దమనోహర రూపానికి అభిమానులు కానివారంటూ ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. అన్ని భాషల చిత్ర పరిశ్రమల్లో శ్రీదేవి చెరగని ముద్ర వేసింది. అనూహ్యంగా మరణించిన అందరిని శోకంలోకి నెట్టి వెళ్ళిపోయింది.

Sridevi Passes Away : అందమే శాపమైందా, అవే ప్రాణాలకు ముప్పు తెచ్చాయా?

శ్రీదేవి మరణ తరువాత ఆమె మధుర స్మృతులని అంత నెమరు వేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీదేవికి సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీదేవి శరీర సౌందర్య రహస్యాన్ని సంబందించిన అనుమానాలు ఇప్పుడే కాదు అప్పట్లోనూ అభిమానులకు ఉండేవి.

రూప్ కీ రాణి సమయంలో

రూప్ కీ రాణి సమయంలో

శ్రీదేవి రూప్ కి రాణి చిత్రంలో నటిస్తున్న సమయంలో ఓ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఇంటర్వ్యూ లో మీడియా ప్రతినిధి అడిగిన పలు ప్రశ్నలను శ్రీదేవి సమాధానం ఇచ్చింది.

అందం కోసం ఇంజెక్షన్లు వాడుతారా

అందం కోసం ఇంజెక్షన్లు వాడుతారా

మీడియా ప్రతినిధి శ్రీదేవిని అందం కోసం మీరు ఇంజెక్షన్లు వాడుతారా? అవునని అభిమానులు అనుకుంటున్నారు అని మీడియా ప్రతినిధి అడగగా శ్రీదేవి సమాధానం ఇచ్చింది. అభిమానులు అలా ఎందుకు అనుకుంటున్నారో తెలియదు. నేను ఎటువంటి ఇంజెక్షన్లు తీసుకోను అని శ్రీదేవి బదులిచ్చింది.

అందుకు కారణం అదృష్టమా

అందుకు కారణం అదృష్టమా

ఇన్నేళ్ల పాటు మీరు చిత్ర పరిశ్రమలో విజయవంతమా కొనసాగడాని కారణం అదృష్టమా అని శ్రీదేవిని ప్రశ్నించారు. అదృష్టం మీద నేను నమ్మకం పెట్టుకొని అని శ్రీదేవి బదులిచ్చింది. రాణించాలంటే మన టాలెంట్, డాన్సులు, బ్యూటీని మెరుగుపర్చుకోవాలని శ్రీదేవి బదులిచ్చారు.

ప్రేమ వివాహం చేసుకుంటారా? పెద్దలు కుదిర్చిన వివాహమా?

ప్రేమ వివాహం చేసుకుంటారా? పెద్దలు కుదిర్చిన వివాహమా?

వివాహం సంగతి మా అమ్మ చూసుకుంటుంది. తనకు పెద్దలు కుదిర్చిన వివాహమే ఇష్టమని శ్రీదేవి అప్పట్లో బదులిచ్చింది. శ్రీదేవికి సంబందించిన ఈ ఇంటర్వ్యూ లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

English summary
Sridevi old interview goes viral in social media. Sridevi revealas her beauty secret.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu