twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టింగ్ ఆపరేషన్ టేపుల కలకలం: తనుశ్రీ దత్తా లైంగిక వేధింపుల వివాదం కొత్త మలుపు!

    |

    తనుశ్రీ దత్తా, నానా పాటేకర్ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. పదేళ్ల క్రితం 'హార్న్ ఓకే ప్లీజ్' సినిమా షూటింగులో నానా పాటేకర్ తనతో మిస్ బిహేవ్ చేశాడని, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని తనుశ్రీ ఆరోపించిన తర్వాత మీడియాలో ఈ ఇష్యూ సెన్సేషన్ అయింది.

    ఈ వివాదం నేపథ్యంలో తాజాగా... 'హార్న్ ఓకే ప్లీజ్' నిర్మాత సమి సిద్ధిఖి, దర్శకుడు రాకేష్ సారంగ్, సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(సింటా) మాజీ అధ్యక్షుడు రజా మురద్, సింటా స్క్రూనిటీ ప్యానెల్ హెడ్ గజేంద్ర చౌహాన్ మీద నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ టేపులను టైమ్స్ నౌ ఛానల్ బయట పెట్టింది.

    తనుశ్రీ దత్తా వివాదంలో వారి మాటలు రికార్డ్

    తనుశ్రీ దత్తా, నానా పాటేకర్ వివాదంలో ఈ నలుగురు మాటలు ఈ స్టింగ్ టేపుల్లో ఉన్నాయి. సింటా మాజీ చీఫ్ రజా మురాద్... తనుశ్రీ ఓవర్ రియాక్ట్ అవుతుందని, కాస్త టచ్ చేసినందుకే ఇంతలా రియాక్ట్ అవ్వాలా? అంటూ రియాక్ట్ అయినట్లు ఆ టేపుల్లో ఉంది. పదేళ్ల తర్వాత ఈ పంచాయితీ ఏంటి అంటూ గజేంద్ర చౌహాన్ అనగా, బిగ్ బాస్ ఎంట్రీ కోసమే తనుశ్రీ దత్తా ఈ నాటకం ఆడుతుందంటూ దర్శకుడు రాకేష్ సారంగ్ అన్నట్లు ఆ టేపుల్లో ఉంది.

    ఆ రోజు ఆమెకు పీరియడ్స్ అంటూ..

    ఈ డిస్క్రర్షన్స్‌లో ‘హార్న్ ఓకే ప్లీజ్' నిర్మాత సమీ సిద్ధిఖీ మాట్లాడుతూ.... ఆ రోజు తనుశ్రీ పీరియడ్స్‌లో ఉన్నట్లు తాను భావిస్తున్నాను. అందుకే ఆ రోజు అలా ప్రవర్తించిందేమో అంటూ చాలా నీచంగా మాట్లాడారు.

    వీళ్లా? క్రియేటివ్ పీపుల్

    క్రియేటివ్ పీపుల్ అని చెప్పుకునే వీరు ఒక మహిళ పట్ల నీచంగా ఆలోచిస్తున్నారంటూ.... ఈ స్టింగ్ టేపులు బయటపడ్డ తర్వాత పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ స్టింగ్ టేపులు విడుదలైన తర్వాత తనుశ్రీకి మద్దతు మరింత పెరిగింది.

    వివాదం కొత్త మలుపు

    తనుశ్రీ దత్తా-నానా పాటేకర్ వివాదం ఈ స్టింగ్ ఆపరేషన్ టేపులతో మరింత ముదిరినట్లయింది. ఈ పరిణామాలు నానా పాటేకర్‌ను మరింత ఇబ్బందుల్లో పడేశాయి. ఈ గొడవ చివరకు ఎలా ముగుస్తుందో? అని అంతా ఆస్తిగా ఎదురు చూస్తున్నారు.

    English summary
    Sting operation on Tanushree Dutta-Nana Patekar's issue. Shocking reactions were recorded in a series of sting tapes, released by Times Now.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X