Just In
- 1 hr ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 2 hrs ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 3 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
- 3 hrs ago
శ్రీరాముడిపై మోనాల్ గజ్జర్ అనుచిత వ్యాఖ్యలు: అందుకే అలాంటోడిని చేసుకోనంటూ షాకింగ్‌గా!
Don't Miss!
- News
నేరం మీది కాదు..ఆ అదృశ్య వ్యక్తిది: ఎన్టీఆర్ సినిమా చూపిస్తున్నారు: నిమ్మగడ్డకు ముద్రగడ..ఘాటుగా
- Sports
IPL 2021: రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి కుమార సంగక్కర!
- Lifestyle
జుట్టు పెరగడానికి నూనె మాత్రమే సరిపోదు, ఇక్కడ మోకాలి పొడవు జుట్టు యొక్క రహస్యం ఉంది
- Finance
Budget 2021: హెల్త్ బడ్జెట్ డబుల్! నిర్మలమ్మ 'ప్రధానమంత్రి హెల్త్‌ఫండ్?'
- Automobiles
ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
షారుక్ పరువు తీస్తున్నావు.. ఏంటీ ఆ డ్రస్సు? సుహానాపై దారుణంగా ట్రోల్స్
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ముద్దుల కూతురు సుహానా ఖాన్ మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీలో ఉన్నత విద్య కోసం వెళ్లిన ఆమె హాట్ హాట్‌గా కనిపించడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందాల ఆరబోస్తూ కనిపించడంతో సోషల్ మీడియాలో షారుక్ అభిమానులు మండిపడ్డారు. తీవ్రస్థాయిలో ట్రోల్ చేయడం జరుగుతున్నది. వివరాల్లోకి వెళితే..

న్యూయార్క్ వర్సిటీ హాట్‌గా సుహానా
సుహానా ఖాన్ ఇటీవల న్యూయార్క్ యూనివర్సిటీలో చేరడంతో వారి తల్లిదండ్రులు షారుక్, గౌరీఖాన్ ఆమెను యూనివర్సిటీలో చేర్పించి వచ్చారు. యూనివర్సిటీ తరగతులకు హాజరైన సుహానా కురచ దుస్తులతో కనిపించింది. చేతిలో కాఫీ మగ్గు పట్టుకొని నవ్వుతున్న ఫోటో మీడియాలో టాప్‌గా నిలిచింది. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.

కుటుంబ ప్రతిష్టపై దెబ్బ అంటూ
అయితే ఇన్స్‌టాగ్రామ్‌లో సుహానా షేర్ చేసిన కామెంట్లపై అభిమానులు రకరకాలుగా స్పందించారు. షారుక్ ఖాన్ పరువు తీస్తున్నావు. కుటుంబం ప్రతిష్టను దెబ్బ తీస్తున్నావు అంటూ నెటిజన్లు ఘాటుగా స్పందించారు. కొందరు చాలా హాట్‌గా ఉన్నావంటూ కామెంట్లు చేశారు. మరికొందరు శృతిమించి అసభ్యంగా కామెంట్ చేశారు.

సుహానా ఎంట్రీపై గుసగుసలు
సుహానా ఖాన్ బాలీవుడ్ ఎంట్రీ గురించి ఎప్పటి నుంచో గుసగుసలు వినిపించాయి. ఆమె స్నేహితులు శన్యా కపూర్, అనన్య పాండే, ఇతరులు బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి హిట్టు కొట్టేశారు. అయితే షారుక్ మాత్రం బాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. ఆమె ఎప్పుడు నిర్ణయం తీసుకుంటే అప్పుడే.. ఆ నిర్ణయం ఆమె ఇష్టమేనని చెప్పడం జరిగింది.

షారుక్ సలహా మేరకే
తండ్రి షారుక్ ఖాన్ సూచన, సలహా మేరకు బాలీవుడ్ ఎంట్రీని వాయిదా వేసుకొన్నట్టు సమాచారం. ఉన్నత చదువు పూర్తి చేసిన తర్వాతే సినిమాల్లోకి రావాలని చేసిన సూచన మేరకే సినిమాలకు దూరంగా ఉన్నట్టు తెలిసింది. అయితే థియేటర్‌లో మాత్రం తనదైన శైలిలో రాణిస్తున్నారు. సుహాన నటన విమర్శకుల ప్రశంసలు అందుకొన్నది.
|
లండన్ థియేటర్‌లో అద్భుత ప్రతిభ
న్యూయార్క్ యూనివర్సిటీలో ఉన్నత చదువులకు వెళ్లే ముందు లండన్‌లో గతేడాది జూలియట్ అనే నాటకంలో నటించింది. ఆ కార్యక్రమానికి షారుక్ ఖాన్ ప్రత్యేకంగా హాజరయ్యారు. లండన్ వేదికపై ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి. చదువు పూర్తి చేసుకొన్న తర్వాత ఆమె మళ్లీ యాక్టింగ్‌పై దృష్టిపెట్టే అవకాశం లేకపోలేదంటున్నాయి సినీ వర్గాలు.