Divorce: కుర్ర హీరోయిన్‌తో 62 ఏళ్ల స్టార్ హీరో రాసలీలలు.. కోర్ట్‌కెక్కిన భార్య

టాలీవుడ్ టూ బాలీవుడ్ అంతా విడాకుల వార్తలు నిండిపోతున్నాయి. ఎప్పుడు ఎవరు విడాకులు అంటూ బాంబు పేల్చుతారో తెలియదు. సోషల్ మీడియాలో నటీనటులు తమ జీవిత భాగస్వాములను అన్ ఫాలో చేసినా, వారి ఫోటోలను డిలీట్ చేసినా ఏదో జరగబోతోందని ప్రేక్షకులు భావించే పరిస్ధితులు వచ్చేశాయి. ఇప్పటికే నయనతార - విఘ్నేష్ శివన్, హన్సికా మోత్వానీ - సొహైల్‌లు విడాకులు తీసుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా మరో స్టార్ కపుల్ విడాకులకు సిద్ధమైంది. ఈ వివరాల్లోకి వెళితే..

ఫ్యామిలీ స్టార్‌గా గుర్తింపు
80, 90 దశకాల్లో కపూర్లు, ఖాన్‌ల రాజ్యంలోకి దూసుకొచ్చి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు గోవిందా. కామెడీ, కుటుంబ కథా చిత్రాలతో అలరించారు. కొన్నేళ్ల పాటు గోవిందా హవా అప్రతిహతంగా సాగుతోంది. 1987లో సునీత అహుజాను పెళ్లాడారు గోవిందా. వీరి వివాహం కొన్నేళ్ల పాటు సీక్రెట్‌గానే ఉండగా.. గోవిందా ఎట్టకేలకు సునీతను తన భార్యగా ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ దంపతులకు కుమార్తె టినా అహుజా, కుమారుడు యశ్ వర్ధన్ అహుజా సంతానం. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ సత్తా చాటిన గోవింద.. ఇప్పుడు తన ఇమేజ్, వయసుకు తగ్గ సినిమాలే చేస్తూ అలరిస్తున్నారు. ముఖంగా చెరగని చిరునవ్వుతో అందరితో చాలా సరదాగా ఉంటారని గోవిందాకు పేరు.

Sunita Ahuja files for divorce from Her Husband Govinda

37 ఏళ్ల వైవాహిక బంధానికి తెర
అయితే గోవిందా అహుజా, ఆయన భార్య సునీత అహుజాల మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నట్లుగా మీడియా కోడై కూస్తోంది. వీరి మధ్య కొన్నాళ్లుగా సఖ్యత లేదని, ఎడమొహం.. పెడమొహం అన్నట్లుగా ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి. 37 ఏళ్లుగా అన్యోన్యంగా గడిపిన ఈ జంట వైవాహిక జీవితానికి ముగింపు పలికేందుకు సిద్ధమైనట్లేనని అంటున్నారు. ఇందుకు అనేక కారణాలు దోహదం చేస్తున్నాయి. గోవిందా, సునీతలు విడాకులు తీసుకుంటారని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి.

విడాకులపై స్పందించిన గోవిందా మేనేజర్
సునీతతో తాను విడాకులు తీసుకోబోతున్నట్లుగా వస్తున్న వార్తలపై గోవిందా మేనేజర్ స్వయంగా స్పందించారు. వారిద్దరి మధ్యా అభిప్రాయ భేదాలు ఉన్నాయని, కానీ అవి విడాకులు తీసుకునేందుకు పెద్దవి కావని ఆయన పేర్కొన్నారు. ఇద్దరూ సమస్యలను పరిష్కరించుకుంటున్నారని గోవిందా మేనేజర్ క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత గోవిందా మేనకోడలు ఆర్తి సింగ్ కూడా ఈ విడాకుల వార్తలపై స్పందించారు. గోవిందా - సునీతల మధ్య విడాకుల వార్తలు అవాస్తవమని, వారిద్దరూ ఎంతో అన్యోన్నంగా ఉంటున్నారని ఆర్తిసింగ్ అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని మీడియాకు ఆమె విజ్ఞప్తి చేశారు.

Take a Poll

ఆ హీరోయిన్ కారణంగా కలతలు
అప్పట్లో గోవిందా- సునీతల విడాకుల వార్తలకు చెక్ పడగా.. ఈసారి గట్టిగా వినిపిస్తున్నాయి. మరాఠీ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ యంగ్ హీరోయిన్‌తో గోవిందా రిలేషన్‌లో ఉన్నారని.. ఆమె విషయంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లుగా బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ క్రమంలోనే సునీత విడాకుల కోసం ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టులో డిసెంబర్ 5న దరఖాస్తు చేసుకుందట. వేధింపులు, వ్యభిచారం, క్రూరత్వం, విడిచిపెట్టడం వంటి అభియోగాను సునీత అందులో ప్రస్తావించడం తీవ్ర చర్చనీయాంశమైంది.

ఈ ఏడాది జూన్ నుంచి ఈ విడాకుల కేసుపై న్యాయస్థానం విచారణ జరుపుతుందని టాక్. ప్రతిసారి సునీత కోర్టుకు హాజరవుతున్నా.. గోవిందా మాత్రం రాకపోవడంతో న్యాయమూర్తి సీరియస్ అయి హీరోకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. గతంలోనూ బాలీవుడ్ హీరోయిన్లు నీలం, రవీనా టాండన్‌లతో గోవిందాకు అఫైర్ నడిచిందని ఇప్పటికీ చెప్పుకుంటారు. ఇప్పడు తాజాగా మరో మహిళ గోవిందా జీవితంలోకి వచ్చినట్లుగా వార్తలు వస్తుండటంతో ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి. సునీత ఈ వ్యవహారంపై స్పందిస్తేనే కానీ ఈ పుకార్లకు చెక్ పడదు.

More from Filmibeat

Read more about: govinda sunita ahuja
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X