సన్నీ లియోన్ పెళ్లి ఫొటో వైరల్.. చివరి వరకు ఇలాగే ఉందాం అంటూ!
పోర్న్ స్టార్ గా ఒక వెలుగు వెలిగిన సన్నీ లియోన్ ఆ తరువాత బాలీవుడ్ నటిగా మారి కొత్త జీవితాన్ని ప్రారంభించింది. పోర్న్ చిత్రాలతో లభించిన పాపులారిటీతో సన్నిలియోన్ బాలీవుడ్ లోకి అడుగు పెట్టి అక్కడ కూడా స్టార్ గా మారిపోయింది. ఐటెం సాంగ్స్ లో, రొమాంటిక్ చిత్రాలతో సన్నీ యువతని ఆకట్టుకుంటోంది. సన్నీలియోన్ బాలీవుడ్ స్టార్ గా మారక సోషల్ మీడియాలో కూడా స్టార్ గా మారిపోయింది.
తాజగా సన్నిలియోన్ ఓ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది సన్నిలియోన్ పెళ్లి ఫోటో కావడంతో వైరల్ గా మారింది. నేడు తన వివాహ వార్షికోత్సవం కావడంతో సన్నీలియోన్ ఈ ఫోటో పోస్ట్ చేసింది. ఏడేళ్ల క్రితం తన భర్త వెబర్ ని ఇదే రోజు సన్నీలియోన్ వివాహం చేసుకుంది. సన్నీ, వెబర్ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరిని దత్తత తీసుకోవడం విశేషం.
ఈ సందర్భంగా తన భర్తకు మ్యారేజ్ యానివర్సరీ విషెష్ చెబుతూ సన్నీ ఈ పోస్ట్ పెట్టింది. జీవితాంతం ఇలాగే కలసి నడుద్దాం అంటూ కామెంట్ పెట్టింది. సన్నీలియోన్ ప్రస్తుతం బాలీవుడ్ లో మాత్రమే కాక తెలుగు తమిళ భాషల్లో కూడా అవకాశాలు అందుకుంటోంది.


Click it and Unblock the Notifications











