For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఫాంహౌస్‌కు వెళ్లి బుక్కైన ఘటన మరువక ముందే.. మరోసారి దొరికిపోయిన సినీ జంట

  By Manoj Kumar P
  |

  ప్రముఖ నిర్మాత కుమారుడు సుమంత్ అశ్విన్ నటించిన 'తూనీగా తూనీగా' అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది రెహా చక్రవర్తి. ఈ సినిమా తర్వాత ఆమె నేరుగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ పలు చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత పలు టీవీ షోలకు కూడా హోస్ట్‌గా వ్యవహరించింది. వీటన్నింటి వల్ల ఆమె పెద్దగా హైలైట్ కాలేదు కానీ, ఓ హీరోతో ప్రేమాయణం నడిచి బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. తాజాగా ఈ జంట మరోసారి బుక్కైపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే...

  ధోనీతో డేటింగ్

  ధోనీతో డేటింగ్

  రెహా చక్రవర్తి డేటింగ్ చేస్తోంది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో. గతంలో ఈ పేరు ఎవరికీ పెద్దగా తెలియదు కానీ, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బయోపిక్ ‘ధోనీ: అన్‌టోల్డ్ స్టోరీ' వచ్చిన తర్వాత మాత్రం దేశ వ్యాప్తంగా అందరికీ పరిచయం అయిపోయాడు. ఆ తర్వాత ఎన్నో భారీ సినిమాలో అవకాశాలు దక్కించుకోవడంతో బాలీవుడ్‌లోని స్టార్ హీరోల సరసన చేరిపోయాడు. ఇప్పుడు ఇదే స్థానాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే వరుసగా సినిమాలు చేస్తున్నాడు.

  లండన్‌లో ఫుల్ ఎంజాయ్

  లండన్‌లో ఫుల్ ఎంజాయ్

  రెహా చక్రవర్తితో సుశాంత్ డేటింగ్ చేస్తున్నాడన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ జంట కొద్ది రోజుల క్రితం బీ టౌన్‌లో హాట్ టాపిక్ అయిపోయింది. దీనికి కారణం వీరిద్దరూ లడక్ టూర్ వెళ్లడం.. అక్కడ బాగా ఎంజాయ్ చేయడమే. అంతేకాదు, ఆమె పుట్టినరోజు సందర్భంగా సుశాంత్ డైమండ్ పెండెంట్ ఒకటి గిఫ్ట్‌గా ఇచ్చాడని బాలీవుడ్ వర్గాలు కోడై కూశాయి. అలాగే, ఆరోజున సుశాంతే ఆమెతో కేక్ కట్ చేయించాడన్న గుసగుసలూ వినిపించాయి.

  బహిరంగంగానే చెప్పేశాడు

  బహిరంగంగానే చెప్పేశాడు

  ఇటీవల తమ మధ్య ఉన్న బంధం గురించి సుశాంత్ ఓపెన్ అయ్యాడు. ఓ మీడియాతో మాట్లాడుతూ.. ‘మేమిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. మా బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నాను. ఇదే విషయాన్ని రెహాతో సైతం చెప్పాను. ఆమె నిర్ణయం కోసం వేచి చూస్తున్నాను' అని వెల్లడించాడు. దీంతో సుశాంత్ చెప్పింది పెళ్లి గురించే అని అర్థం అయిపోయింది. అప్పుడు ఈ వార్త దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిపోయింది.

  ఫాంహౌస్‌కు వెళ్లారు

  ఫాంహౌస్‌కు వెళ్లారు

  ఇక, రెండు నెలల క్రితం ఈ జంట మరోసారి వార్తల్లోకి ఎక్కింది. దీనికి కారణం వీళ్లిద్దరూ కలిసి ఓ ఫాంహౌస్‌కు వెళ్లడమే. ఓ వీకెండ్‌ సమయంలో సుశాంత్ - రెహా చక్రవర్తి ముంబై శివారులోని ఓ ఫాంహౌస్‌కు వెళ్లారట. ఆ రాత్రి మొత్తం అక్కడే ఉన్నారట. తిరిగి వచ్చే క్రమంలో ఇద్దరూ కెమెరాల కంటికి చిక్కారని తెలిసింది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

  మళ్లీ దొరికిపోయారు

  మళ్లీ దొరికిపోయారు

  సుశాంత్ - రెహా చక్రవర్తి పెళ్లి చేసుకోవడం ఖాయమేనన్న టాక్ వినిపిస్తున్నప్పటికీ.. వీళ్లిద్దరు కానీ, వీళ్ల కుటుంబ సభ్యులు కానీ దాని గురించి ఎక్కడా డైరెక్టుగా స్టేట్‌మెంట్ ఇచ్చిన దాఖలాలు లేవు. అయినప్పటికీ వీరిద్దరూ మాత్రం తరచూ ఏదో ఒక చోట కలుస్తూనే ఉన్నారు. నిరంతరం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తాజాగా ఈ జంట శనివారం ముంబైలో డిన్నర్ డేట్‌కు వెళ్లిందట. ఆ సమయంలో కెమెరా కంటికి చిక్కడంతో ఈ వార్త బయటకు వచ్చింది.

  English summary
  Sushant Singh Rajput and Rhea Chakraborty Love Each Other. If a report in Mumbai Mirror is to be believed, Sushant is ready to take the plunge and marry Rhea, even though they began dating only earlier this year.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X