twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘రియా చక్రవర్తి అరెస్ట్‌కు భయపడదు.. ప్రేమ కోసం ఏ త్యాగానికైనా సిద్ధం’

    |

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో భాగంగా బయటపడిన డ్రగ్స్ వ్యవహారంపై నార్కోటిక్స్ అధికారులు పంజా విసురుతున్నారు. బాలీవుడ్‌లో డ్రగ్స్ మాఫియా లింకులను బయటపెట్టేందుకు అధికారులు పలువురుని ఇప్పటికే అరెస్ట్ చేశారు. షోవిక్ చక్రవర్తి, దీపేష్ సావంత్, శ్యామూల్ మిరాండా అరెస్ట్ తర్వాత ఆదివారం రియా చక్రవర్తిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ప్రశ్నించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో మధ్యాహ్నం డీఆర్డీవో గెస్ట్ హౌస్‌కు రియా చేరుకొన్న తరుణంలో చోటుచేసుకొన్న పరిణామాలు ఇలా ఉన్నాయి..

    Recommended Video

    Sushant Singh Rajput : ప్రేమ కోసం అరెస్ట్ అయ్యేందుకు కూడా రెడీ అంటున్న రియా చక్రవర్తి! || Oneindia
    రియా ఆదేశాల మేరకు సుశాంత్‌కు డ్రగ్స్

    రియా ఆదేశాల మేరకు సుశాంత్‌కు డ్రగ్స్

    తన సోదరి రియా చక్రవర్తి ఆదేశాల మేరకే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు డ్రగ్స్ ఇచ్చానని షోవిక్ చక్రవర్తి ఎన్సీబీ అధికారుల ముందు చెప్పడంతో ఈ కేసులో డొంక కదిలినట్టు స్పష్టమైంది. ఈ కేసులో చిన్న చేపలు కాకుండా పెద్ద తిమింగలాల పేర్లు కూడా బయటకు వచ్చినట్టు సమాచారం.

    షోవిక్, రియాను కలిపి ప్రశ్నించనున్న ఎన్సీబీ

    షోవిక్, రియాను కలిపి ప్రశ్నించనున్న ఎన్సీబీ

    శనివారం రాత్రి సమన్లు జారీ చేసిన నేపథ్యంలో రియా చక్రవర్తి ఎన్సీబీ అధికారుల విచారణకు హాజరయ్యారు. రియాను ప్రశ్నించేందుకు ఐదుగురు సభ్యుల బృందం సిద్ధమైనట్టు సమాచారం. అంతేకాకుండా శ్యామూల్ మిరాండా, షోవిక్ చక్రవర్తితో కలిపి రియాను ప్రశ్నించనున్నట్టు తెలిసింది.

    28 మంది డ్రగ్స్ సప్లయిర్ల జాబితాతో

    28 మంది డ్రగ్స్ సప్లయిర్ల జాబితాతో

    బాలీవుడ్‌లో డ్రగ్స్ లింకుల కేసులో ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే 28 మందితో కూడి డ్రగ్స్ సప్లయర్ల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. రియా చక్రవర్తి నుంచి నిషేధిత డ్రగ్స్ ఎవరెవరికి వెళ్లాయనే సమాచారాన్ని అధికారులు బయటకు లాగేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

    రియా చక్రవర్తి అరెస్ట్‌కు రెడీ

    రియా చక్రవర్తి అరెస్ట్‌కు రెడీ

    ఇలాంటి తీవ్రమైన పరిణామాల నేపథ్యంలో రియా చక్రవర్తి లాయర్ సతీష్ మాన్‌షిండే ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ కేసులో మంత్రగత్తెను వెంటాడినట్టు రియా చక్రవర్తిని వేటాడుతున్నారు. అయితే ఆమె అరెస్ట్‌కు సిద్ధంగా ఉన్నారు. తను ప్రేమించిన వ్యక్తి కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్దం. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నారు అని సతీష్ మాన్‌షిండే పేర్కొన్నారు.

    ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకోలేదు

    ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకోలేదు

    రియా చక్రవర్తి అమాయకురాలు. ఇప్పటి వరకు ఏ కేసులోనైనా ఆమె ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోలేదు. బీహార్ పోలీసులు, ఎన్సీబీ, సీబీఐ, ఈడీ కేసులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కేసులో అసలు విషయాలు బయటపడాలని ఆమె కోరుకొంటున్నారు. ముందు నుంచి ఆమె సీబీఐ విచారణకు కోరుతున్నారనే విషయాన్ని మరోసారి సతీష్ మాన్‌షిండే స్పష్టం చేశారు.

    డీఆర్డీవో గెస్ట్‌హౌస్‌ వద్ద టెన్షన్ వాతావరణం

    డీఆర్డీవో గెస్ట్‌హౌస్‌ వద్ద టెన్షన్ వాతావరణం

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో ఆయన మాజీ టాలెంట్ మేనేజర్ జయ సహా కూడా సీబీఐ విచారణకు హాజరయ్యారు. డీఆర్డీవో గెస్ట్ హౌస్‌లో జరుగుతున్న విచారణకు ఆమె హాజరయ్యారు. ఇదిలా ఉండగా, శనివారం అరెస్ట్ చేసిన సుశాంత్ సిబ్బంది దీపేష్ సావంత్‌ను సెప్టెంబర్ 9వ తేదీ వరకు కస్టడీకి తీసుకొన్నారు. ఇదిలా ఉండగా రియా చక్రవర్తి విచారణకు హాజరైన సమయంలో భారీగా పోలీసులు రావడంతో టెన్షన్ వాతావరణం నెలకొన్నది.

    English summary
    Rhea Chakraborty attended for NCB questioning in DRDO guest house on Sunday. In this occassion, Her lawyer Satish Maneshinde released a statement that, she is ready for arrest as this is a 'witch hunt' and that 'if loving someone was a crime, then she will face the consequences of her love
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X