twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్ సింగ్ కేసులో మరో ట్విస్ట్.. పాట్నా ‘సింగం’కు ముంబై పోలీసుల షాక్.. గృహ నిర్బంధంలో..

    |

    బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసు దర్యాప్తులో ఎన్నో అనుమానాలున్నాయని పలు మీడియా సంస్థలు, నెటిజన్లు అభిప్రాయపడుతుండగా ముంబై పోలీసుల వ్యవహరం మరింత సందేహాలను రేకెస్తుందనే విషయం సోషల్ మీడియాలో వినిపిస్తున్నది. సుశాంత్ సింగ్ కేసు విచారణకు వచ్చిన బీహార్ పోలీసులను అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిస్తున్న సమయంలో తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చిది.

    Recommended Video

    Sushant Singh Rajput : Mumbai Police తీరు పై Netizens ఆగ్రహం | Vinay Tiwari IPS
    సుశాంత్ మరణం వెనుక వాస్తవాలను

    సుశాంత్ మరణం వెనుక వాస్తవాలను

    సుశాంత్ మరణం వెనుక వాస్తవాలను వెలికి తీయడానికి అన్వేషిస్తున్న ముంబై పోలీసులపై సోషల్ మీడియాలో గత 40 రోజులుగా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో పాట్నాలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు కావడంతో ఈ కేసు దర్యాప్తు సరికొత్త మలుపు తిరిగింది.

    బీహార్ పోలీసులకు చేదు అనుభవాలు

    బీహార్ పోలీసులకు చేదు అనుభవాలు


    సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదుతో బీహార్ పోలీసులు తమ విచారణ చేపట్టేందుకు ముంబైలో అడుగుపెట్టారు. సుశాంత్ కేసు దర్యాప్తు కోసం పలు అధికారులను సంప్రదించగా బీహార్ పోలీసులకు సరైన సహకారం లభించలేదనే విషయం మీడియాలో కథనాలుగా వచ్చాయి. సుశాంత్ కేసును ముంబైలో దర్యాప్తు చేయడానికి వచ్చిన బీహార్ పోలీసులకు సరైన వాహనం ఏర్పాటు చేయలేదనే విషయం మీడియాలో చర్చనీయాంశమైంది. అంతలోనే బీహార్ పోలీసుల బృందాన్ని నేరస్థుల మాదిరిగా వ్యాన్‌లో బంధించి తరలించడం విమర్శలకు తావిచ్చింది.

    సిన్సియర్ సీనియర్ పోలీస్ అధికారిని

    సిన్సియర్ సీనియర్ పోలీస్ అధికారిని


    ఇలాంటి పరిస్థితుల్లో సుశాంత్ కేసును దర్యాప్తు చేసేందుకు సిన్సియర్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ వినయ్ తివారీని బీహార్ రంగంలోకి దించింది. ఈ విచారణలో ముంబై, బీహార్ పోలీసులను సమన్వయం చేస్తూ వినయ్ తివారీ తన దర్యాప్తు చేస్తారు. ఇప్పటికే ముంబై చేరుకొన్న సీనియర్ అధికారులతో కలిసి పనిచేస్తారు బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే మీడియాకు తెలిపారు.

    వినయ్ తివారికి ముంబై పోలీసుల ఝలక్

    వినయ్ తివారికి ముంబై పోలీసుల ఝలక్

    ఇదిలా ఉండగా, ముంబైకి చేరుకొన్న వినయ్ తివారికి చేదు అనుభవం ఎదురైంది. ఆయనను క్వారంటైన్‌కు తరలించాలని ముంబై పోలీసులు నిర్ణయం తీసుకొన్నారు. ఆగస్టు 15వ తేదీ వరకు క్వారంటైన్‌లో ఉండాలంటూ వినయ్ చేతిపై ముద్ర వేశారు. అయితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్లు క్వారంటైన్‌లో ఉండాలనే నిబంధన ముంబైలో అమలు పరచడం లేదు. ఇంతకు ముందు చేరుకొన్న బీహార్ పోలీసులను క్వారంటైన్‌కు పంపకుండా కేవలం వినయ్ తివారీనే పంపించడం వివాదాస్పదంగా మారింది.

    పాట్నా సింగాన్ని క్వారంటైన్‌కు

    పాట్నా సింగాన్ని క్వారంటైన్‌కు

    ఇక బీహార్‌లో వినయ్ తివారీకి అత్యంత నిజాయితీపరుడైన ఆఫీసర్ అనే పేరున్నది. బీహార్‌లో ఆయనను పాట్నా సింగంగా పిలుస్తారు. అనేక కేసుల్లో చిక్కుముడులను విప్పడంలో వినయ్ తివారి తన సత్తాను చాటుకొన్నారు. ఇక సుశాంత్ కేసులో పలు అనుమానాలను పటాపంచలు చేయడానికి వినయ్ తివారీ రంగంలోకి దిగారు. అయితే వినయ్ తివారికీ క్వారంటైన్ విధించడంపై నెటిజన్లు భగ్గుమంటున్నారు.

    డీజీపీ గుప్తేశ్వర్ పాండే ధృవీకరణ

    డీజీపీ గుప్తేశ్వర్ పాండే ధృవీకరణ


    సీనియర్ అధికారి వినయ్ తివారీని బలవంతంగా క్వారంటైన్‌కు తరలించారనే విషయాన్ని డీజీపీ గుప్తేశ్వర్ పాండే ట్విట్టర్ ద్వారా ధృవీకరించారు. పాట్నా నుంచి ముంబై చేరుకొన్న అధికారిని బీఎంసీ అధికారులు బలవంతంగా క్వారంటైన్‌కు తరలించారు. కనీస వసతి కూడా కల్పించలేదు. దాంతో స్వయంగా గోరేగావ్‌లోని గెస్ట్‌హౌస్‌ వసతిని ఏర్పాటు చేసుకొని అక్కడే ఉంటున్నారని బీహార్ డీజీపీ వెల్లడించారు.

    English summary
    Sushant Singh Rajput death case: Bihar IPS officer Vinay Tewari who came to probe SSR case, has been forcefully Quarantined by Mumbai Officials..!! While 4 other police officers were not quarantined, who came to mumbai few days ago.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X